యోగా బ్యూటీ అనుష్కకు ఈమధ్య రానా ‘బాహుబలి’ షూటింగ్ లో ఒక విచిత్రమైన పిలుపుతో పిలిచి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా హీరోయిన్స్ అంతా సిస్టర్ అని పిలిపించు కోవడం పై ఇష్టపడుతూ ఉంటారు. అయితే రానా దీనికి భిన్నంగా అనుష్కను బ్రదర్ అని పిలవడం షాకింగ్ గా మారింది. అయితే దీనికి రానా చెపుతున్న కారణాలు వేరు.

అనుష్క పేరుకు హీరోయిన్ అయినా ఇప్పుడు ఆమె చేస్తున్న పాత్రలతో హీరోగా మారిపోతోందని కామెంట్స్ చేసాడు రానా. అంతేకాదు తాను ఆమెతో కత్తి యుద్ధాలు చేస్తున్నప్పుడు తనకు ఆమెలో హీరోయిన్ లక్షణాలుకన్నా హీరో లక్షణాలు బాగా కనిపిస్తూ ఉండటంతో తాను అనుష్కను ఇలా పిలుస్తున్నాను అని అంటున్నాడు.

రానా మాటలు కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా అర్ధం అయి కాబోలు ఈమధ్య రిలీజ్ అయిన ‘లింగ’ సినిమాలో అనుష్క అవతారాన్ని చూసి ఆమె లుక్ కంటే రజినీకాంత్ చిన్నవాడిగా కనిపించాడు అనే కామెంట్స్ చేసారు. అయితే ఎవరు ఏమి అనుకున్నా ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో కత్తి పట్టుకుని తిప్పుతూ సినిమాలలో నటించగల సామర్ధ్యం ఒక్క అనుష్కకు తప్ప మరెవ్వరికి లేదు అన్నది వాస్తవం.

రానా పిలుపుకు అనుష్క ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి. త్వరలో విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ విజయవంతం అయితే అనుష్కకు రానా ఇచ్చిన ట్యాగ్ లైన్ శాశ్వతంగా మారే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: