టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ఫిల్మ్ గా విపరీతమైన హైప్ క్రియేట్ అయిన మూవీ టెంపర్. తాజాగా టెంపర్ మూవీ ఆడియో ఫంక్షన్ కోలాహలంగా జరిగింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తుంది. అయితే ఈ మూవీతో పాటు గుణశేఖర్ కూడ రుద్రమదేవి మూవీని రిలీజ్ చేస్తాడు అని టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాడు.

ఇక్కడ కంగారు పడాల్సింది ఏమి లేదు. రుద్రమదేవి మూవీని రిలీజ్ చేస్తున్నాడు అంటే మొత్తం మూవీని రిలీజ్ చేయడం లేదు. ఆ మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ ని టెంపర్ మూవీ రిలీజ్ రోజున గుణశేఖర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 13న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారు, అదే రోజు రిలీజ్ కాబోతున్న రుద్రమదేవి థియోట్రికల్ ట్రైలర్ కోసం మూవీలవర్స్ ఎదురుచూస్తున్నారు.

చాలా రోజులుగా రుద్రమదేవి టీం తమ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో సినిమాతో ట్రైలర్ ని రిలీజ్ చేస్తే ట్రైలర్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని రుద్రమదేవి టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’.

మరింత సమాచారం తెలుసుకోండి: