ఒక వైపు ‘బాహుబలి’ లీక్ సమస్యల మధ్య టెన్షన్ పడుతున్న తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి మరో అరుదైన గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు టాప్ హీరోలు హీరోయిన్స్ మాత్రమే అందుకున్న ఈ గుర్తింపు దక్షిణ భారత దేశంలో ఒక దర్శకుడు అందుకోవడం దర్శకులందరికీ గౌరవంగా మారింది. ప్రస్తుత సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్లో రాజమౌళిని ఫాలో అయ్యే వారి సంఖ్య 1 మిలియన్ దాటింది.

సౌతిండియాలో ఇంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న దర్శకుడు రాజమౌళి మాత్రమే కావడం ఒక రికార్డు. తాను దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా తన ఫేస్ బుక్, ట్విటర్ లో నిరంతరం అనేక సామాజిక, రాజకీయ విషయాల పై తన కామెంట్స్ ను పెడుతూ తనదైన బాణీని చాటుకుంటున్నాడు రాజమౌళి.

అంతేకాదు అనేక మంచి చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆ చిన్న సినిమాలకు తన ట్విటర్ ద్వారా ఎంతో క్రేజ్ ను కల్పిస్తున్నాడు రాజమౌళి. ఒక సినిమాకు రాజమౌళి మంచి మార్కులు వేసాడు అంటే తెలుగు ప్రేక్షకులు గుడ్డిగా వెళ్ళి ఆ సినిమాను చూస్తారు అన్న విషయం అనేక సార్లు రుజువైంది.

టాలీవుడ్ సినిమా కలెక్షన్స్ స్థాయిని 100 కోట్ల మైలురాయిని దాటించాలని ఒక తపస్సులా రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ అనుకున్న విజయాన్ని సాధిస్తే తెలుగు సినిమా రంగ చరిత్రలో రాజమౌళికి ఒక ప్రత్యేక అధ్యాయం ఏర్పడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: