రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రానికి సంబంధించిన 15 నిమిషాల ఫైటింగ్ సీన్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఈ లీక్ వ్యవహారం అందరికి తెలియడంతో ‘బాహుబలి' టీం ఆందోళనలో పడింది. వెంటనేరంగలోకి దిగిన టెక్నికల్ టీం ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి తొలగించేసారు. అయితే కొందరు ఈ వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వీడియో స్ప్రెడ్ కాకుండా బాహుబలి టీం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీడియో లీకు వ్యవహారంపై చిత్ర దర్శకుడు రాజమౌళి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసుపై ఎఫ్.ఐ.ఆర్ కూడ నమోదు చేశారు. అంతే కాకుండా అన్ని మీడియాలకు ఎఫ్.ఐ.ఆర్ కాపీలని పంపి, దయచేసి లీక్డ్ వీడియోలను టెలికాస్ట్ చేయకుడదని, అలా చేస్తే లీగల్ పరంగా ప్రొసీడ్ అవుతామని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పోలీసులు ఈ లీక్ వెనక గల వ్యక్తులను అరెస్టు చేసారు. వీడియోను ఎవరైనా సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. ఈ వీడియో ప్రొడక్షన్‌ సిబ్బంది కారణంగా లీకైందని సీసీఎస్‌ పోలీసులు నిర్ధారించారు. దీంతో పది మంది ప్రొడక్షన్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

అయితే ఈ వీడియో మొత్తం గ్రీన్‌ మ్యాట్‌తో షూటింగ్‌ చేసింది. దీనికి 80 శాతం వీ.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తేగానీ ఫైట్‌ సీన్‌కు అర్ధం ఉంటుంది. అయితే బాహుబలి మొదటి పార్ట్ కి సంబంధించిన వీడియోనే బయటకు లీక్ కావడంతో, డామేజ్ ని అరికట్టడానికి రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: