మొన్న శుక్రు వారం రవితేజా హీరోగా ప్రారంభమైన ‘బెంగాల్ టైగర్’ సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిన రవితేజా లుక్ చూసి చాలామంది ఆశ్చర్య పోయారని టాక్. సామాన్యంగా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు హుషారుగా సందడి చేసే రవితేజా ఆరోజు డల్ గా కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది అని వార్తలు వస్తున్నాయి.

ఆ కార్యక్రమానికి వచ్చిన కొంత మంది దర్శక నిర్మాతలు కల్పించుకుని మాస్ మహారాజాతో మాట్లాడాలని ప్రయత్నించినా రవితేజా ముభావంగా ఉండటంతో తాము చూస్తున్నది ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రవితేజానేనా? అని కామెంట్స్ చేసుకున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి.

అయితే అదే రోజు కార్యక్రమానికి వచ్చిన కొందరు అతిధులు మాత్రం రవితేజా మేకప్ లేకుండా ఆరోజు ‘బెంగాల్ టైగర్’ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇటువంటి అనుమానాలు వచ్చి ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ‘బలుపు’, ‘పవర్’ ల తరువాత మరో హ్యాట్రిక్ కొట్టి ప్రేక్షకులకు జోష్ ఇవ్వడానికి తన ‘కిక్2’ ద్వారా రాబోతున్న నేపధ్యంలో రవితేజా మొఖంలో కనిపించిన చిన్న మార్పులు ఫిలింనగర్ లో అనేక చర్చలకు దారితీసింది.

దీనిని బట్టి సినిమా సెలెబ్రెటీలను ఎంత నిశితంగా అటు మీడియా ఇటు దర్శక నిర్మాతలు పరిసీలిస్తున్నారో అర్ధం అవుతుంది. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రవితేజా పై కూడా షాకింగ్ రూమర్స్ రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: