రత్నవేలు అందించిన బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ , దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , హేభ పటేల్ స్కిన్ షో , సెకండాఫ్ లో ఎమోషన్స్ ని కనెక్ట్ చేయడం , క్లైమాక్స్ రత్నవేలు అందించిన బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ , దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , హేభ పటేల్ స్కిన్ షో , సెకండాఫ్ లో ఎమోషన్స్ ని కనెక్ట్ చేయడం , క్లైమాక్స్ స్లో నేరేషన్ , కథనంలో పెద్ద కిక్ లేకపోవడం , ఎడిటింగ్ , ఓవర్ అయిన అడల్ట్ కంటెంట్ , అనవసరంగా వచ్చే సాంగ్స్

హైదరబాద్ లోని కెజిబి కాలనీలో మొదలవుతుంది. అక్కడ ఆడుతూ పాడుతూ, సింగపూర్ లోని స్టార్ క్రూస్ షిప్ లో చెఫ్ గా చేరాలనే లక్ష్యంతో ఉన్న కుర్రాడే మన హీరో సిద్దు(రాజ్ తరుణ్). సిద్డుకి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). వీరు ముగ్గురూ దొంగతనాలు చేస్తూ దర్జాగా బతుకుతూ ఉంటారు. కట్ చేస్తే అదే కాలనీలోకి ముంబై నుంచి మోడల్ అయిన కుమారి(హేభ పటేల్) వస్తుంది. కుమారి మెయిన్ క్వాలిటీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం. అలాంటి కుమారి మొదటి చూపులోనే సిద్దుని ప్రేమిస్తుంది. చాలా షార్ట్ టైంలోనే ఇద్దరూ లవర్స్ అవుతారు. కానీ కుమారి ఓపెన్ గా ఉండడం, అలాగే కుమారి గురించి సిద్దు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నెగటివ్ గా చెబుతుండడం వలన సిద్దుకి కూడా కుమారి మీద అనుమానం రావడంతో నిలదీస్తాడు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కుమారిపై కన్నేస్తారు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి సిద్దు కుమారిలు కలిసారా? లేదా? సిద్దు ఫ్రెండ్స్ కుమారి పై ఏమన్నా అగాయిత్యం చేయడానికి ట్రై చేసారా? లేదా? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన మిగిలిన కథ. 

రాజ్ తరుణ్.. రెండు వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ పైనే అందరి కన్నూ ఉంది. గత రెండు సినిమాలకి సంబంధంలేని పాత్రలో రాజ్ తరుణ్ కనిపించాడు. కానీ ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర అస్సలు ఎనర్జిటిక్ గా లేదు. ఆ ఎనర్జీ ఎందుకు లేకుండా పాత్రని డిజైన్ చేసారు అన్నదానికి క్లారిటీ లేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎప్పుడూ సీరియస్ గా ఉండడం లేదా మూతి ముడుచుకొని ఉండడం, సెకండాఫ్ లో అన్నా కొన్ని చోట్ల డైలాగ్స్ వలన ఎక్స్ ప్రెషన్ మారింది. ఓవరాల్ గా ఈ సినిమాలో రాజ్ తరుణ్ బెస్ట్ పార్ట్ అంటే క్లైమాక్స్ లో చేసిన ఎమోషనల్ సీన్ ఒక్కటే.. అసలు హీరో పాత్రని ఎందుకంత డల్ గా చూపిస్తున్నాం అనే దానిపై ఒక క్లారిటీ అన్నా ఇవ్వాలి కదా అనేదే నా వాదన.. ఇక హీరోయిన్ హేభ పటేల్ విషయానికి వస్తే.. నటన పరంగా ఓ తిప్పెసుకొని, తెగ ఎక్పోజింజ్ చేస్తుండే తప్ప పర్ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం పలికించలేదు. అలాగే తనని చూపించిన విధానం సరిగా లేదు. ఎలా అంటే తనకి ఏ లుక్ అయితే సెట్ అవుతుంది అన్నదానిపై కూడా సరిగా వర్కౌట్ చెయ్యలేదు. ఓవరాల్ గా స్కిన్ షో పరంగా హేభ పటేల్ బాగా రెచ్చిపోయినా, నటనాపరంగా యావరేజ్ అనిపించుకుంది. మిగతా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వారి విషయానికి వస్తే.. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని, దానికి తగ్గట్టు డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఇక కమెడియన్స్ అయిన నవీన్ - సుదర్శన్ లు తమ మార్క్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కాస్త నవ్వించడానికి ట్రై చేసారు. హేమ, తాగుబోతు రమేష్ లు తమ పాత్రల్లో పరవాలేధనిపిస్తే.. సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ కూడా స్కిన్ షో పరంగా మెప్పించింది.   

కుమారి 21F - సుకుమార్ కలం నుంచి జారిన అక్షరాలతో రూపం తెచ్చుకున్న ప్రేమకథ.. కాదు కాదు అడల్ట్ ప్రేమ కథ.. అంతకన్నా అచేప్పాలి అంటే. పొరపాటు మారుతి ఫ్లేవర్ అడల్ట్ కథని సుకుమార్ స్పూర్తిగా తీసుకున్నాడా అనేంతలా ఉంటుంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే. సుకుమార్ ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ కి సూపర్ మచ్చీ అనాల్సిందే.. కానీ కథా విస్తరణ మాత్రం అంత బాలేదు, మరియు ఫ్రెష్ ఫీల్ ని వదిలేసి అడల్ట్ సీన్స్ పీడా పడడం అతని ఇమేజ్ ని కాస్త తక్కువ చేసేలా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తంలో కథ అనేది ఎక్కడా ఉండదు, కేవలం అమ్మాయి అబ్బాయి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఓవర్ డోస్ అడల్ట్ కంటెంట్ ని చూపించారు. చెప్పాలంటే సుకుమార్ ఎంచుకున్న లైన్ కి అంత అడల్ట్ సీన్స్ అవసరమే లేదనే చెప్పాలి. పోనీ కథా విస్తరణ పరంగా మిస్టేక్ చేసిన వారు దానిని కథనంలో అన్నా సరి చేసుకున్నారా అంటే అదీ లేదు. సినిమాలో ఒక్కటంటే ఒక్క ట్విస్ట్ కూడా లేదు. అదీ కాక సినిమా మొదలైన 30 నిమిషాలకే సినిమా ఎలా ముగుస్తుందా అనేది ఆడియన్స్ ఊహించేయవచ్చు. దానివలన కథనంలో ఆడియన్స్ ఎగ్జైట్ గా ఫీలయ్యే సందర్భం ఒకటి కూడా లేదు. అలాగే నేరేషన్ కూడా చాలా స్లోగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాస్త బాగుండడానికి హెల్ప్ అయిన విషయం డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ రాసుకున్న చాలా సీన్స్ లోని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైకి తీసుకు రావడం.. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ లెంగ్త్ విషయంలో, అనవసరమైన పాటలని తీసేయ్యడంలో, నేరేషన్ విషయంలో, హీరో హీరోయిన్ పాత్రలని మరింత క్లారిటీగా చెప్పడంపై వర్కౌట్ చేయాల్సింది.


ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే.. రత్నవేలు సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఓ చిన్న మిడిల్ క్లాస్ కాలనీని, అక్కడ హీరో హీరోయిన్స్ ని చూపిన విధానం మరియు నాచురల్ లైటింగ్ ని వాడుకున్న విధానం అదిరిపోయింది. దేవేశ్రీ ప్రసాద్ పాటలు బాగున్నాయి, కానీ అందులో చాలా పాటలకి సరైన సందర్భాలు లేవు. ఇకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. రత్నవేలు విజువల్స్ కి దేవేశ్రీ రీ రికార్డింగ్ తో ప్రాణం పోసాడు. అమర్ రెడ్డి ఎడిటింగ్ చెప్పుకునే స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ మరియు సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని పార్ట్స్ ని ట్రిమ్ చేయాలి, కానీ అలానే వదిలేయడం వలన రన్ టైం ఎక్కువైంది. పొట్లూరి వెంకీ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. సుకుమార్ రైటింగ్స్ - పిఎ మోషన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు మాత్రం ఫెంటాస్టిక్ అనేలా ఉన్నాయి.

కుమారి 21F.. చెప్పాలంటే సుకుమార్ రైటర్ గా తనని తాను కించపరచుకోవడానికి రాసిన కథలా ఉంది. ఎందుకంటే సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బ్యూటిఫుల్ వే లో కూడా ప్రెజంట్ చేయచ్చు కానీ ఆయన మాత్రం యువతను ఆకర్షించాలని భూతుపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ సినిమాలోని సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలిపాడు. అలా వచ్చే అడల్ట్ సీన్స్ అన్నిటికీ ఒక లింక్ పాడు ఉండదు. వస్తుంటాయి అంటే వస్తుంటాయి మీరే సర్దుకొని చూసేయ్యాలి. ఇకపోతే సుకుమార్ స్టైల్ ఉన్న కథ అయితే ఇందులో కనిపిచ్నఃడు, ఏ మారుతినో, లేక బి గ్రేడ్ డైరెక్టర్ నుంచి కథ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా యువతకు నచ్చే అంశాలు, ఓవర్ స్కిన్ షో చేసే సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా యువతని ఆకట్టుకొని కలెక్షన్స్ మాత్రం బాగా రాబట్టుకుంది. మా సూచన ఒక్కటే.. దయచేసి ఫామీలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరంగా ఉండండి. 

Raj Tarun,Hebah Patel,Palnati Surya Pratap,Vijaya Prasad Bandreddi,Thomas Reddy Aduri,Devi Sri Prasadకుమారి 21F - జస్ట్ ఫర్ భూతు - ఓన్లీ ఫర్ యూత్

మరింత సమాచారం తెలుసుకోండి: