కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ , షాన్ మొహమ్మద్ సినిమాటోగ్రఫీ , జిబ్రాన్ మ్యూజిక్ , ప్రేమ్ నవస్ ఆర్ట్ వర్క్ , సాంగ్స్ లేకపోవడం , ఎంగేజ్ ఫస్ట్ హాఫ్ కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ , షాన్ మొహమ్మద్ సినిమాటోగ్రఫీ , జిబ్రాన్ మ్యూజిక్ , ప్రేమ్ నవస్ ఆర్ట్ వర్క్ , సాంగ్స్ లేకపోవడం , ఎంగేజ్ ఫస్ట్ హాఫ్ నేరేషన్ స్లోగా ఉండడం , సాగదీసిన కథనం , ఎడిటింగ్ , ఎక్స్ట్రా గా యాడ్ చేసిన సీన్స్ , నో థ్రిల్స్ , ఒరిజినల్ సోల్ మిక్స్ అవ్వడం

దివాకర్ (కమల్ హాసన్) పేరుగాంచిన నార్కోటిక్ బ్యూరో ఆఫీసర్. హైదరాబాద్ బ్రాంచ్ లో పనిచేస్తూ డబ్బు కోసం తన కొలీగ్ అయిన మణి(యుగి సేతు)తో కలిసి విట్టల్ రావు(ప్రకాష్ రాజ్) గ్యాంగ్ స్మగుల్ చేస్తున్న 13కేజీల కొకెయిన్ ని వారి పై దాడి చేసి, ఒకరిని చంపేసి కొట్టేస్తారు. కానీ అక్కడ ఓ మర్డర్ కేసు జరగడం వలన దానిని ఇన్వెస్టిగేట్ చేయడానికి అదే డిపార్ట్ మెంట్ కి చెందిన మోహన్(కిషోర్), మల్లిక(త్రిష)లు ఆ కేసుని టేకప్ చేస్తాయి. ఆ కొకెయిన్ అమ్మేద్దాం అనుకుంటున్న టైంలో విట్టల్ రావు కొట్టేసింది దివాకర్ అని తెలుసుకొని, దివాకర్ కొడుకుని కిడ్నాప్ చేసి తన కొకెయిన్ రిటర్న్ చేయమని చెప్తాడు. దాంతో కొకెయిన్ తీసుకొని ఇన్సోమియా పబ్ కి బయలుదేరిన దివాకర్ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడు? కొకెయిన్ విట్టల్ రావుకి ఇవ్వడానికి ముందు ఎంతమంది చేతులు మారింది? అలాగే ఇన్సోమియా పబ్ దగ్గర మల్లిక - మోహన్ లు దివాకర్ కి క్రియేట్ చేసిన సమస్యలేమిటి? అసలు దివాకర్ ఈ దొంగతనం చేయడానికి వెనకున్న అసలు మిషన్ ఏంటి? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి.. 

నటీనటుల విషయానికి వస్తే.. ఉలగనాయగన్ కమల్ హాసన్ వన్ మాన్ షో ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. కమల్ గెటప్, నటన, ఎక్స్ ప్రెషన్స్ సినిమాని చాలా వరకూ నిలబెట్టాయని చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా కమల్ చేసిన కొన్ని రిస్కీ స్టంట్స్ అందరినీ మెప్పించేలానే ఉన్నాయి. ఇక కమల్ కి సూపర్బ్ సపోర్ట్ ఇచ్చిన స్టార్స్ త్రిష, ప్రకాష్ రాజ్ మరియు కిషోర్. త్రిష పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా సెట్ అయ్యింది. అలాగే తన లుక్ మరియు పెర్ఫార్మన్స్ కమల్ కి ఈక్వల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కమల్ - త్రిషల మధ్య వచ్చే ఫైట్ లో త్రిష చేసిన స్టంట్స్ ఎక్కడా ఓవర్ అనిపించవు. చాలా నమ్మశక్యంగా ఉంటాయి. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అయ్యింది అంటే దానికి కారణం వాళ్ళిద్దరి నటనే కారణం. ఇక కామెడీ టచ్ ఉన్న విలన్ గా ప్రకాష్ రాజ్ డీసెంట్ అనిపించాడు. టోటల్ నెగటివ్ షేడ్ ని కప్పి పెట్టుకొని గుడ్ పర్సన్ గా కిషోర్ హావభావాలను బాగా చూపించాడు. వీరి తర్వాత మధు శాలిని గ్లామర్ మరియు లిప్ కిస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సంపత్ రాజ్ తన పాత్రకి బాగానే న్యాయం చేసాడు. ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతులు తమ పాత్రల్లో ఓకే అనిపించి వెళ్ళిపోయారు. 

చీకటి రాజ్యం అనే సినిమా హాలీవుడ్ వెర్షన్ అయిన 'స్లీప్ లెస్ నైట్' అనే సినిమాకి అధికారిక రీమేక్.. రీమేక్ విషయంలో మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే.. ఆక్కడి కథలో ఉన్న ఒరిజినల్ సోల్ ని రీమేక్ వెర్షన్ లో ప్రెజంట్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడా అదే జరిగింది.. అదే విధంగా హాలీవుడ్ వెర్షన్ ని సౌత్ ఇండియన్ వెర్షన్ కి సింక్ చేయడంలో డైరెక్టర్ రాజేష్ సెల్వ మిస్ అయ్యాడు. ఏమేమి మిస్ అయ్యాడు అనే విషయానికి వస్తే.. ఫస్ట్ మిస్టేక్.. ఒరిజినల్ వెర్షన్ లోని సోల్ ని మిస్ చేసేసి, దానికి కాస్త కామెడీ యాంగిల్ ని ట్రై చేసి, కాస్త సెంటిమెంట్ మరియు రొమాంటిక్ యాంగిల్ ని మిక్స్ చేసి చెప్పాలని ట్రై చేసాడు. దాని వల్ల ఫీల్ తేడా కొట్టింది. అలాగే ఈ సినిమా కంటెంట్ లో ఉన్న ట్విస్ట్ ఒకటే ఒకటి, ఒరిజినల్ వెర్షన్ లో ఆ ట్విస్ట్ ని లాస్ట్ వరకూ సీక్రెట్ గా పెడతారు, కానీ ఇక్కడ మాత్రం దానిని మొదట్లోనే రివీల్ చేసి ఆ కిక్ కూడా లేకుండా చేసేసాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్.. కాబట్టి ఇందులో కుదిరినన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ థ్రిల్ అయ్యే సీన్స్ ఏమీ లేకుండా పోవడం మరో మేజర్ మైనస్. ఇక పోతే నేరేషన్ చాలా స్లోగా అనిపిస్తుంది, సెకండాఫ్ లో అయితే మరీ దారుణంగా నేరేషన్ స్పీడ్ పడిపోతుంది. ఇక కథనంలో కూడా థ్రిల్స్ మిస్ అవ్వడం వలన పెద్ద ఆసక్తికరంగా అనిపించదు. ఓవరాల్ గా చెప్పదిగిన విష్యం ఒకటే.. కమల్ హాసన్ - రాజేష్ ఎం సెల్వల రీమేక్ స్క్రిప్ట్ వర్క్ మన నేటివిటీకి సెట్ చెయ్యాలి అని ఒరిజినల్ సోల్ ని వదిలేసి, అనవసరమైన సీన్స్ అన్నీ యాడ్ చేసి తీసేశారు. అందువలన ఈ సినిమా ఓవరాల్ గా అటు బాలేదు అనలేం అలా అని సూపర్బ్ గా ఉంది అని కూడా అనలేం.  


జన వర్గీస్ సినిమాటోగ్రఫీ, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ ప్రేమ్ నవస్ వేసిన ఇన్సోమియా సెట్ చాలా చాలా బాగుంది. సినిమా మొత్తం ఆ సెట్లోనే జరిగినా చాలా వరకూ బోర్ కొట్టనీకుండా చేసింది ఆ సెట్ వర్క్. జిబ్రాన్ మ్యూజిక్ పలు హాలీవుడ్ వెర్షన్స్ నుంచి కాపీ కొట్టినప్పటికీ సినిమాకి మాత్రం చాలా బాగా సింక్ అయ్యింది. ఎడిటర్ షాన్ మొహమ్మద్ ఫస్ట్ హాఫ్లో వావ్ అనిపిస్తే, సెకండాఫ్ ని మాత్రం ఓహ్ నో అనేలా ఎడిట్ చేసాడు. అబూరి రవి డైలాగ్స్ జస్ట్ ఓకే. గిల్లెస్ కాన్సీల్, రమేష్ యాక్షన్ స్టంట్స్ కూడా ఒరిజినల్ వెర్షన్ లానే ఉన్నాయి. చంద్రహాసన్ - కమల్ హాసన్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 


ఒరిజినల్ వెర్షన్ అయిన స్లీప్ లెస్ నైట్ అనే సినిమాని ఇక్కడికి సెట్ చెయ్యాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ గా బ్యాక్ డ్రాప్ ని సెట్ చెయ్యాలి. కానీ ఈ సినిమా విషయంలో సెట్ కాలేదు. నేపధ్యం సరిగా సెట్ కాకపోవడం మరియు ఒరిజినల్ వెర్షన్ లోని సోల్ మిస్ అవ్వడం వలన సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఒరిజినల్ వెర్షన్ కంటే రీమేక్ వెర్షన్ లో లెంగ్త్ పెరుగుతోంది అంటే.. ఆ సీన్స్ సూపర్బ్ అనేలా ఉండాలే తప్ప, ఆ సీన్స్ సినిమాని నాశనం చేసేలా ఉండకూడదు. కానీ చీకటి రాజ్యంలో అదే జరిగింది. సుమారు 30 నిమిషాల పాటు పెంచేసినా అందులో పనికొచ్చే సీన్స్ 5 నిమిషాలు కూడా లేకపోవడం వలన ఒరిజినల్ సోల్ ఈ సినిమాలో కనిపించదు. ఓవరాల్ గా చీకటి రాజ్యం అనే సినిమా ఫస్ట్ హాఫ్ లో గుడ్ థ్రిల్లర్ అనిపించి సెకండాఫ్ లో నీరసం తెప్పించి, సగం ఉడికిన అన్నమాలా ఏదో ఉంది అంటే ఉంది అనే ఫీలింగ్ తో ఆడియన్స్ ని బయటకి పంపిస్తుంది. 

Kamal Hassan,Trisha,Rajesh M Selva,S. Chandrahasan,M. Ghibran.చీకటి రాజ్యం - థ్రిల్స్ లేని థ్రిల్లర్!!

మరింత సమాచారం తెలుసుకోండి: