రవితేజ ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మన్స్ , అడ్డు అదుపు లేకుండా ఆరబోసిన తమన్నా, రాశీ ఖన్నాల అందాలు , ఫస్ట్ హాఫ్ , పోసాని కృష్ణ మురళి , పృధ్వీల కామెడీ రవితేజ ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మన్స్ , అడ్డు అదుపు లేకుండా ఆరబోసిన తమన్నా, రాశీ ఖన్నాల అందాలు , ఫస్ట్ హాఫ్ , పోసాని కృష్ణ మురళి , పృధ్వీల కామెడీ పరమ బోరింగు స్టొరీ అండ్ స్టొరీ డెవలప్ మెంట్ , చిరాకు పెట్టె సెకండాఫ్ , బాగా అంటే బాగా రొటీన్ గా అనిపించే సెకండాఫ్ స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , నో ఎంటర్ టైన్మెంట్ ఇన్ సెకండాఫ్ , రన్ టైం , పవర్ఫుల్ విలన్ లేడు

ఆత్రేయపురం, ఆ ఊరికి పెద్ద అయిన జయనారయన్(నాగినీడు). ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన ఆకాష్ నారాయణ్(రవితేజ) మన హీరో. చదువు పూర్తి చేసుకొని లక్ష్యం అనేది లేకుండా జాలీగా ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరిగే ఆకాష్ కి పెళ్లి చేస్తే సెట్ అవుతాడని అక్షతో పెళ్లి చూపులు సెట్ చేస్తారు. కానీ అక్ష ఏమో నాకు మొగుడు కావాలంటే నువ్వు బాగా ఫేమస్ అయ్యుండాలని, నువ్వు ఫేమస్ కాదు కాబట్టి పెళ్ళికి నో అంటుంది. ఆ మాటలకు బాగా హర్ట్ అయిన ఆకాష్ ఉన్నపలంగా ఫేమస్ అయిపోవాలి అనుకుంటాడు. దాని కోసం ఓ రోజు ప్రజాసేవ పార్టీ మినిష్టర్ అయిన సాంబు(సాయాజీ షిండే) మీటింగ్ ని చెడగొట్టి ఫేమస్ అవుతాడు. అలా మినిష్టర్ అయిన నాగప్ప(రావు రమేష్) దృష్టిలో పడి అయన కుమార్తె శ్రద్ధ(రాశీఖన్నా)కి బాడీ గార్డ్ అవుతాడు. తన హీరోయిజం చూసి శ్రద్ధ ఆకాష్ లవ్ లో పడుతుంది. అక్కడే ఓ చిన్న ట్విస్ట్.


కట్ చేస్తే అక్కడి నుంచీ కథ సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) - ఆకాష్ ల మధ్యకి షిఫ్ట్ అవుతుంది. దాంతో కథలోకి సిఎం కుతురు అయిన మీర(తమన్నా) కూడా ఎంటర్ అవుతుంది. అసలు ఆకాష్ - సిఎం అశోక్ గజపతి మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఆ యుద్దంలో గెలుపెవరిది? అసలు ఆకాష్ అనే వాడికి నిజంగానే ఫేమస్ అవ్వాలి అనే పిచ్చి ఉందా? లేక వేరే దేనికోసమైన సిఎం అశోక్ గజపతితో పెట్టుకున్నాడా? అన్నది వెండితెరపై చూసి తెలుసుకోండి.

మాస్ మహారాజ్ అయిన రవితేజ తన సూపర్ లుక్ ని వదులుకొని డైట్ చేసి బాగా సన్నగా అయిన తర్వాత చేసిన రెండవ సినిమా ఇది. కిక్ 2 లో ఫేస్ లో బాగా ముసలి పోలికలు కనిపించాయి. ఇక సినిమా విషయానికి వస్తే రవితేజ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. దానివలన చాలా చోట్ల యంగ్ గా కనిపించినా కొన్ని చోట్ల మాత్రం తన వయసు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో 90% రవితేజ ఫేస్ యంగ్ గా కనిపించడం కోసం సిజి వర్క్ ని వాడారు. ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. రవితేజ మాస్ మసాలా పాత్రలు చేయడం, పంచ్ డైలాగ్స్ చెప్పడం బట్టర్ తో పెట్టిన విద్య. కావున ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా చేసుకొని వెళ్ళిపోయాడు. ఇందులో తను కొత్తగా నటనలో చూపిన వైవిధ్యం ఏమీ లేదు. ఇకపోతే  తనకి డిజైన్ చేసిన పాత్ర కూడా కొత్తదేమీ కాదు,  గత సినిమాల్లో చేసిన పలు పాత్రలను గుర్తు చేసేలానే ఉంది. ఇక హీరోయిన్స్ లో తమన్నా గ్లామర్ డాల్ గా కనిపించింది. తన నటనకి ప్రాధాన్యం ఉన్న సీన్స్ లో బాగానే చేసినా, తనని ఎక్కువగా గ్లామర్ పరంగానే వాడుకోవడం వలన ఆడియన్స్ కి తన అందాల విందు మాత్రమే గుర్తుంటుంది.


ఆడియో రిలీజ్ నుంచే హైప్ పెంచిన చూపులతో దీపాల పాటలో రవితేజ కనపడకుండా పోయేలా అందాలు ఆరబోసింది. ఇక రాశీ ఖన్నా కాస్త పొగరున్న పాత్ర చేస్తోంది అనిపించినా  ఫైనల్ గా తను కూడా ఓ గ్లామర్ అట్రాక్షన్. మొదటి సారి రాశీ ఖన్నా కూడా తన గ్లామర్ డోస్ ని పెంచి ఏకంగా బికినీలో కనువిందు చేసింది. ఇక రాజసం చూపే సిఎంగా, తనకు అడ్డొచ్చే వారిని పరలోకాలు పంపే కౄరత్వం ఉన్న మెయిన్ విలన్ గా బొమన్ ఇరానీ చాలా సెటిల్ గా చేసిన పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. ఇక కమెడియన్స్ లో పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృద్వీ బాగా నవ్వించే ప్రయత్నం చేయగా, సత్యం రాజేష్, శకలక శంకర్ లు పరవాలేధనిపించారు.


ఇక అమలా పాల్ గా బ్రహ్మానందం మరోసారి నవ్వించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రావు రమేష్, హర్షవర్ధన్ రాణే, నాగినీడు, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, పవిత్రా లోకేష్, ప్రియదర్శిని రామ్ లు తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఇక అతిధి పాత్రల్లో కనిపించిన అక్ష, హంసా నందినిలు ఎవరి తరహాలో వారు ఆకట్టుకున్నారు.    

'రచ్చ' సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత సినిమా చేయడం వలన అనుకుంటా సంపత్ నంది ఇంకా 2012లోనే ఉండిపోయాడు అనిపిస్తుంది. ఎందుకంటే తన 'రచ్చ' సినిమాలానే ఈ సినిమాని కూడా తీసాడు. బేసిక్ స్టొరీ ఫ్లాట్ ని కూడా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోలేదు. దానికి తోడు దాని చుట్టూ అల్లుకున్న కథ, పాత్రలు, ఆ పాత్రలు బిహేవ్ చేసే విధానం ఇలా అన్నీ పరమ చెత్త అనిపించే స్థాయికి వచ్చేసిన రొటీన్ కమర్షియల్ ఫ్లేవర్ లోనే రాసుకున్నాడు. కానీ ఇక్కడ ఓ విషయంలో సంపత్ నందిని మెచ్చుకోవాలి, ఆయన మొదటి నుంచీ నేను చరిత్రలో నిలిచిపోయే కథతో సినిమా చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కానీ ఫ్లాష్ బ్యాక్, స్క్రీన్ ప్లే మరియు హీరో క్యారెక్టరైజేషణ్ లు మాత్రం కొత్తగా ఉండేలా చూసుకున్నా అన్నాడు. మరి అవి ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చేప్పిన ఓ పాయింట్ మాత్రం పరవాలేధనిపించినా ఓవరాల్ ఎపిసోడ్ మాత్రం బాగా రెగ్యులర్ గా ఉంది, ఇక్కడ దాని చుట్టూ అల్లుకున్న కథ అంతకన్నా రెగ్యులర్. సంపత్ నంది తెలుసుకోవాల్సింది ఎన్నుకునే స్టొరీ పాయింట్ మాత్రమే కాదు ఓవరాల్ స్టొరీ కూడా కొత్తగా ఉండాలి. 

ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. తన దగ్గర ఉన్నదే చిన్న పాయింట్ దాన్ని ఎలాగోలా దాచి పెట్టి ఫస్ట్ హాఫ్ లో పలు పాత్రలు పెట్టి వారి చుట్టూ కథని అల్లు కుంటూ ఎంటర్టైనింగ్ గానే నడిపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ లోనే ఆడియన్స్ కి కాస్త క్లారిటీ వస్తుంది,ఇక సెకండాఫ్ స్టార్ అవ్వగానే అసలు ట్విస్ట్ తెలిసిపోద్ది, ఇక సినిమా గోవిందా గోవింద గంగలో కాలిపోయింది. రెగ్యులారిటీ కోసం మళ్ళీ సెకండాఫ్ ని పొడిగించి సాగదీసి ఆడియన్స్ కి అప్పటి వరకూ ఉన్న మంచి ఫీలింగ్ ని చెడగొట్టి ఓ లెంగ్తీ క్లైమాక్స్ తో బోర్ కొట్టించి ఆడియన్స్ ని బయటకి పంపించాడు. దీని ప్రకారం సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మేజిక్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇకపోతే మిగిలింది హీరో క్యారెక్టరైజేషణ్.. ఈ సినిమాలో రవి చేసిన పాత్రని  ఓ రెండు మూడు రవితేజ సినిమాల్లోని క్రేజీ పాత్రల్ని మిక్సీలో వేసి తీస్తే వచ్చిందే ఈ పాత్ర. అంటే మనం ఇదివరకే చూసేసాం అనమాట..ఉదాహరణకి - డాన్ శీను, కిక్, బలుపు లాంటి సినిమాల్లో రవితేజని సిమిలర్ గా చూసేసాం. డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. అటు సీరియస్ పంచ్ డైలాగ్స్, ఇటు కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక ఫైనల్ గా డైరెక్టర్ గా అయితే రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే కోరుకునేవారిని సంతృప్తిపరచగలిగాడు. కానీ కూసింతన్నా కొత్తదనం కోరుకునే వారిని, విమర్శకులను మాత్రం అస్సలు మెప్పించలేకపోయాడు. ఇక లాజిక్స్ అంటారా.. హీరో ఫాదర్ ని జనాలు కొట్టి చంపరు పర్ఫెక్ట్ మర్డర్ కానీ అది ఫామిలీ మెంబర్స్ కి తెలియదు, అలాగే వాటర్ లో ఉన్నా షూస్ వేసుకుంటే షాక్ కొట్టదు కానీ ఇక్కడ కొడుతుంది.              


ఇక మిగతా కీలకమైన టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. తన కలర్ఫుల్ విజువల్స్ సినిమాకి గ్రాండియర్ లుక్ ని తెచ్చి పెట్టాయి. మెయిన్ గా సాంగ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేసాడు. భీమ్స్ పాటలు జస్ట్ ఓకే కానీ పిక్చరైజేషన్ చూసాక బాగున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా చిన్నా ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాకి చాలా పెద్ద ప్లస్. హీరోయిజం ఎలివేషన్ కి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. డివై సత్యనరాయణ ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ జస్ట్ యావరేజ్... ఫస్ట్ హాఫ్ హిట్ అయ్యి, సెకండాఫ్ ఫ్లాప్ అయితే యావరేజ్ అనేగా అనుకోవాలి. రామ్ - లక్ష్మణ్ స్టంట్స్ జబర్దస్త్ అనేలా ఉన్నాయి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.


'రచ్చ' అనే సినిమా తర్వాత బాగా గ్యాప్ రావడం వలన సంపత్ నందికి కచ్చితంగా ఓ హిట్ కావాలి. దానికోసం ఆయన ఎలాంటి రిస్క్ చేయకుండా స్రీన్ ప్లే తో మాయ చేసేద్దామని, కొత్తగా అనిపించే ఓ చిన్న పాయింట్ ని తీసుకొని రొటీన్ మాస్ మసాలా ఫార్మాట్ లోనే సేఫ్ గేమ్ ఆడేద్దాం అని చేసిన సినిమానే 'బెంగాల్ టైగర్'.


రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకి వీరాభిమానులైన వారు, రవితేజ ఫాన్స్, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకునే బ్యాచ్ మాత్రమే ఈ సినిమా చూడటానికి అర్హులు. వాళ్ళకి కూడా నేనిచ్చే సలహా ఒక్కటే ఫస్ట్ హాఫ్ చూసి బయటకి వచ్చేయండి, దాంతో మీకు ఓ మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది. మిగతా వారైతే ఇదేం సినిమారా బాబు అంటూ తలపట్టుకొని బయటకి వచ్చే సినిమానే 'బెంగాల్ టైగర్'. 

Raviteja,Tamanna,Raashi Khanna,Sampath Nandi,Radhamohan,Bheems.బెంగాల్ టైగర్ - పిల్లిలా కూడా గర్జించలేకపోయిన 'బెంగాల్ టైగర్'

మరింత సమాచారం తెలుసుకోండి: