మీరా నందన్ వివైధ్యభరిత పెర్ఫార్మన్స్ , జగపతి బాబు నటన , అక్కడక్కడా వావ్ అనిపించే డైలాగ్స్మీరా నందన్ వివైధ్యభరిత పెర్ఫార్మన్స్ , జగపతి బాబు నటన , అక్కడక్కడా వావ్ అనిపించే డైలాగ్స్ క్లారిటీ లేని కథ , అస్సలు ముందుకు సాగని నేరేషన్ , ఆసక్తిలేని కథనం , అనుభవం లేని దర్శకత్వం , ఎడిటింగ్ , రన్ టైం , ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పకపోవడం

హైదరాబాద్ మహా నగరంలో డాక్టర్ గా పనిచేస్తున్న అభిలాష(మీరా నందన్) నుంచి కథ మొదలవుతుంది. ఆమె ఓ మారు మూల గ్రామంలో పుట్టి ఆ స్థాయికి రావడానికి కారణం సీతారాం(జగపతి బాబు). సో కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్తుంది. పాడేరు గ్రామం.. సీతారాం సరైన చదువు లేక, అవగాహన లేక నక్సలైట్ గా మారతాడు.ఆ పాడేరు గ్రామంలో షావుకారి పెత్తనమే నడుస్తుంటుంది. అలాంటి వారిని అనగదొక్కి ప్రజలను చైతన్య వంతుల్ని చేయాలని, అలా చెయ్యాలంటే అక్కడి పిల్లలు చదువు కోవాలని సీతారాం చెప్తాడు. ఆ ఊరి పోస్ట్ మాస్టర్ సాయంతో స్కూల్ పెట్టి పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. అదే ఊరిలో కాస్త తెలివితేటలు కలిగిన మ్మాయి అబ్బులు అదే మన అభిలాష.తను చదువు నేర్చుకునే విధానం చూసి తనని ఎంతైనా చదివించి గొప్పదాన్ని చెయ్యాలి అనుకుంటారు. దాని కోసం సీతారాం ఏమేమి చేసాడు? పాడేరు గ్రామం నుంచి వెళ్లి డాక్టర్ చదివే స్థాయికి వెళ్ళిన అభిలాష జర్నీ ఎలా సాగుంది? ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది? ఫైనల్ గా సీతారాం చదువే మనిషిని చైతన్య వంతున్ని చేస్తుంది అని నమ్మిన సిద్దాంతాన్ని అభిలాష నిజం చేసిందా? లేదా? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోండి..     

నటీనటుల్లో మనకు ఎక్కువగా కనిపించేది ఇద్దరే ఒకటి జగపతి బాబు, రెండవది మీరా నందన్. సినిమాలో జగపతి బాబు పాత్ర ట్రావెలింగ్ పరంగా మూడు విభిన్న తరహా గెటప్స్ లో కనిపిస్తాడు. కథానుగుణంగా ఆ గెటప్స్ బాగా సింక్ అయ్యాయి. అలాగే సీతారం అనే పాత్రకి న్యాయం చేసాడు. మెయిన్ గా గన్ అందే పట్టుకోని జగపతి బాబు పాత్ర ఓ సందర్భంలో రియలైజ్ అయ్యి షావుకారి పాత్రని కొట్టే సీన్ లో చాలా బాగా చేసాడు. ఇక మీరా నందన్ ఇందులో మూడు డిఫరెంట్ వయసుల్లో, డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది. ఏమీ తెలియని పల్లెటూరి అమ్మాయిగా, పలు ఇబ్బందులు ఎదుర్కుంటూ చదువుకునే ఓ స్టూడెంట్ గా, ఓ డాక్టర్ గా చాలా చక్కని నటనని కనబరిచింది. తనే సినిమాలో ఎక్కువ భాగం కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఇక నక్సలైట్ గా బెనర్జీ బాగా చేసాడు. ఇక మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిదిమేర నటించారు.  

చాలా చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా టెక్నికల్ టీం గురించి చాలా చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటగా డైరెక్టర్ విధానాల్లో మార్పు రావాలి అంటే, ప్రజలు సక్రమమైన మార్గంలో నడవాలి, అంటే వారిని సత్ప్రవర్తనలో పెంచి వారిని విద్యతో చైతన్య వంతుల్ని చేయాలి. అలా చేస్తే మనుషులు ఒకరికి బానిసలుగా ఉండరు అనే పాయింట్ ని చెప్ప్లనుకున్నాడు. ఇది బాగుంది కానీ ఇక్కడ కథని మొదలు పెట్టాడు కానీ పూర్తయ్యే టైం కి అది ఎటో ఎటో వెళ్ళింది, కథలో ఏమేమో జరుగుతుంటాయి.


మీరు చెప్పాలన్న పాయింట్ లో ప్రేమకథ అవసరం లేదు, కానీ పెట్టేసాడు. కథా పరంగా ఇలా బావి సైజ్ మిస్టేక్ చేస్తే దాని కథనం, నేరేషన్ లో ఓ చిన్నపాటి చెరువు సైజ్ మిస్టేక్ గా మార్చేశాడు. దాంతో థియేటర్స్ లో సినిమా చూసే వారు ఏదో జరుగుతోంది అంటే జరుగుతోందిలే అని చూసే వారు కొందరైతే, సినిమాకి సింక్ కాక నిద్రపోయే వారు కొంతమంది. ఇక డైరెక్టర్ గా ఓవరాల్ గా రెండు మూడు సీన్స్ లో తప్ప మిగతా ఎక్కడా ఏ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చూపించలేకపోయాడు. ఇదొక ఆర్ట్ ఫిల్మ్ తరహాలో సాగే కథ, అలాంటి సినిమాలో ఉండాల్సిందే హృదయాన్ని పిండేసే ఎమోషన్. మరి అదే లేకపోతే డైరెక్టర్ విప్లవ్ ఎలా సక్సెస్ అయ్యాడని చెప్పమంటారు. సినిమా మొత్తంలో డైరెక్టర్ ఏదో చెప్పేయాలని చాలా సబ్ ఫ్లాట్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాడు, కానీ ఏ పాయింట్ ని క్లియర్ చెప్పలేదు, కానేసాం వాటిని చెప్పడానికి కూడా ట్రై చేయలేదు. ఓవరాల్ గా విప్లవ్ సినిమాలో ఎక్కడన్నా సక్సెస్ అయ్యాడు అంటే కొన్ని కనేంట్ ఉన్న సీన్స్ లో డైలాగ్స్ ని పర్ఫెక్ట్ గా రాయడంలో మాత్రమే..    


ఇక మిగతా టెక్నికల్ టీంలో..మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటల ఏవీ జనాలకు ఎక్కవు. అలాగే నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది.  భరణి కె ధరణ్ సినిమాటోగ్రఫీ ఒకొక్ అనేలా ఉంది.ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ అనేది సినిమాకి అస్సలు హెల్ప్ కాలేదు. ఇక కెఎస్వీ నిర్మాణ విలువలు జస్ట్ యావరేజ్ అనేలా ఉన్నాయి.  


డైరెక్టర్ విప్లవ్ అనుకున్న స్టొరీ లైన్ ప్రకారం 'హితుడు' అనే సినిమా పర్ఫెక్ట్ గా రూపొందించబడి ఉంటే, ఒక ఫీల్ గుడ్ ఆర్ట్ తరహా సినిమాగా తయారయ్యి ఉండాలి. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేకపోవడం వలన ఎలాంటి ఫీల్ ని ఆడియన్స్ కి అందించలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ కి ఇంత పెద్ద పాయింట్ ని డీల్ చేసే అవగాహన, అనుభవం లేకపోవడం వలన హితుడు అనే సినిమా ప్రతివారం ఆడియన్స్ మర్చిపోయే చాలా సినిమాల జాబితాలో చేరిపోయింది.     

Jagapati Babu,Meera Nandan,Viplav,KSV,KotiComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: