వరుణ్ తేజ్ మాస్ అప్పియరెన్స్ & డైలాగ్ డెలివరీ , వరుణ్ తేజ్ - రేవతిల సెంటిమెంట్ సీన్స్ , పిజి వింద విజువల్స్ , సునీల్ కశ్యప్ రీ రికార్డింగ్ , ఇంటర్వల్ బ్లాక్ వరుణ్ తేజ్ మాస్ అప్పియరెన్స్ & డైలాగ్ డెలివరీ , వరుణ్ తేజ్ - రేవతిల సెంటిమెంట్ సీన్స్ , పిజి వింద విజువల్స్ , సునీల్ కశ్యప్ రీ రికార్డింగ్ , ఇంటర్వల్ బ్లాక్ రొటీన్ & బోరింగ్ ఫస్ట్ హాఫ్ , సాగదీసినట్టుండే సెకండాఫ్ , ఐ రాసిన అన్ని కథలకి మిక్స్ లా అనిపించే కథ , సాగదీసిన కథనం , స్లో నేరేషన్ , సాంగ్స్ , నో ఎంటర్టైన్మెంట్ , ఎడిటింగ్ , స్లో నేరేషన్

బాగా రిచ్ అయిన లక్ష్మీ దేవి(రేవతి) ఆస్తి చూసి ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొని, పిల్లాన్ని కూడా కనేసిన తర్వాత మురళి (పోసాని కృష్ణమురళి) లక్ష్మీ దేవిని ఆస్థి తీసుకురమ్మని గొడవ పెడతాడు. తను నో అనడంతో మురళి కొడుకు రాజా(వరుణ్ తేజ్)ని తనకన్నా లోఫర్ లా పెంచాలని డిసైడ్ అయ్యి, రాజాని తీసుకొని నార్త్ ఇండియాలోని జోద్ పూర్ లో సెటిల్ అవుతాడు. అనుకున్నట్టుగానే రాజాని పక్కా లోఫర్ లా పెంచుతాడు. రాజా కూడా నొక్కేయడానికే పుట్టానని బలంగా ఫిక్స్ అయ్యి దొరికిన చోట దొరికినంత దోచుకుంటూ ఉంటాడు. అలాంటి రాజా జోద్ పూర్ వచ్చిన పారిజాతం(దిశా పటాని)ని చూసి ప్రేమలో పడడం, ఇక రోజూ తన వెంట పడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే ముఖేష్(ముఖేష్ ఋషి) మనుషులు పారిజాతంని రాజా కళ్ళముందే కిడ్నాప్ చేస్తారు.

అప్పుడే కథలో అసలు ట్విస్ట్. కట్ చేస్తే తనని కాపాడడం కోసం వెతుక్కుంటూ వెళ్ళిన రాజా పారిజాతంని పట్టుకోవడం కోసం లక్ష్మీ దేవి కొడుకుగా మారతాడు. ఇక తన సాయంతో పారిజాతంని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో రాజాకి తన గురించి, లక్ష్మీదేవి గురించి, పారిజాతం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వరుణ్ కి తెలిసిన నిజాలేమిటి? ఆ తర్వాత వరుణ్ ఎదుర్కున్న సమస్యలేమిటి? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 

కథా పరంగా మొదటి రెండు సినిమాల్లో కొసరి కొసరి మాట్లాడుతూ చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన రియల్ పెర్ఫార్మన్స్ ని చూపించాడు. గల గలా మాట్లాడుతూ, మాస్ లుక్ లో, మాస్ హీరో మానరిజమ్స్ తో సినిమా మొత్తం ఆకట్టుకున్నాడు.  పూరి సినిమాలో హీరో పాత్రనే హైలైట్ ఇందులోనూ అంతే అలాంటి పాత్రకి మూడవ సినిమాతోనే వరుణ్ తేజ్ న్యాయం చేసాడు అంటే అతను ఎంత బాగా చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


మొదటి రెండు సినిమాల వలన వరుణ్ తేజ అందరి మెగా హీరోల్లా మాస్ సినిమాలు చేయగలడా లేదా అనే చిన్న అనుమానం ఉంది, ఆ అనుమానాన్ని పాటా పంచలు చేసి మాస్ హీరోగా గుర్తింపే కాదు పలు ఆఫర్స్ కూడా అందుకుంటాడు. పూరి టెంపర్ సినిమాలో ఎన్.టి.ఆర్ చేత అరిచినట్లు ఉండే డైలాగ్ మెథడ్ ని ఇందులో కూడా కొన్ని ఫాలో అయ్యాడు. ఆ సినిమాలో పాత్రకి అది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ సినిమాలో కూడా చాలా చోట్ల వరుణ్ చేత అదే తరహాలో డైలాగ్ డెలివరీ చెప్పించడం సెట్ అవ్వలేదు. అది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.


అలాగే వరుణ్ డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఇంకాస్త వర్కౌట్ చేయాలి. ఇకపోతే హీరోయిన్ దిశా పటాని కొత్తమ్మాయి, కాని తను మొదటి రెండు మూడు సీన్స్ లోనే ఈ అమ్మాయేంది మక్కికి మక్కి ఇలియానాకి ప్రింట్ లా ఉంది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. ఎప్పటిలానే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే. కానీ దిశాకి ఉన్నది కొద్ది సీన్స్ అయినా ఆ సీన్స్ లోనే ఆకట్టుకుంది. పాటల ద్వారా దిశా బాగానే ఆడియన్స్ కి రిజిష్టర్ అవుతుంది.


ఇకపోతే ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించిన రేవతి, పోసాని కృష్ణమురళిలు వారి పాత్రలకి 100% న్యాయం చేసారు. సెకండాఫ్ లో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అంటే దానికి రేవతి నటనే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. విలన్స్ గా ముఖేష్ రుషి, చరణ్ దీప్ లు మెప్పించగా పవిత్రా లోకేష్, ఉత్తేజ్ లు తమ తమ పాత్రల్లో మెప్పించారు. ఇకపోతే ఒక్కొక్క సీన్ కి మాత్రమె పరిమితమైన అలీ, బ్రహ్మానందంలు మెరుపు తీగలా అలా కనిపించి వెళ్ళిపోయారు తప్ప సినిమాకి ఉపయోగపడలేదు. సప్తగిరి, ధనరాజ్ లు పరవాలేధనిపించారు. 

కెరీర్ ప్రారంభంలో పూరి సినిమా అంటే ఓ స్ట్రాంగ్ కంటెంట్, బలమైన ఎమోషన్ తో పాటు హీరో క్యారెక్టరైజేషణ్ అడిపోయేది.. రాను రాను కథలో కంటెంట్ మరియు ఎమోషన్ మిస్ అయిపోతూ ఫైనల్ గా హీరో క్యారెక్టరైజేషణ్ ఒక్కటే పూరి దగ్గర మిగిలింది. అనగా ఈ మధ్య పూరి పెద్ద కష్టపడకుండా సింపుల్ గా హీరో క్యారెక్టరైజేషణ్ మీద సినిమాని లాంగిచేస్తున్నాడు. అందుకే చెప్పుకోతగ్గ స్థాయిలో హిట్స్ రావడంలేదు. ఇప్పుడు లోఫర్ విషయంలో కూడా అదే మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేసాడు. ఎప్పటిలానే హీరో క్యారెక్టరైజేషణ్ లో తన మార్క్ మాస్ లక్షణాలు నిండుగా కనిపిస్తాయి.


కానీ ఇందులో ప్రతి సినిమాలోని తన హీరోలానే ఈ సినిమాలోనూ హీరో పాత్ర బిహేవ్ చేస్తూ ఉంటుంది, అది పరమ రొటీన్ గా అనిపిస్తుంది. కానీ వరుణ్ తేజ్ ని మాస్ యాంగిల్ లో చూడటం కొత్త కాబట్టి బాగానే ఉంది అనిపిస్తుంది. ఇక కథా పరంగా రాసుకున్న కొన్ని కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా ఎప్పుడో ఎక్కడో ఏదో పూరి సినిమాలో చూసిన ఫీలింగ్ తప్పక కలుగుతుంది. దీని బట్టి కథ ఎంత బాగుందో చెప్పవచ్చు. ఇకపోతే పూరి సినిమాల్లో ఫస్ట్ హాఫ్ లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది, కానీ ఇందులో ఏదో ఉందంటే ఉంది అనేలా ఉంటుంది. ఇక పూరి స్క్రీన్ ప్లే - నేరేషన్ అంటే చాలా స్పీడ్ గా ఉంటుందనే పేరు కానీ ఇందులో ఆ స్పీడ్ విషయంలో పూరి మార్క్ తగ్గిందని కనిపిస్తుంది. కానీ దానికి కారణం సినిమా రెగ్యులర్ పూరి స్టైల్ లో సాగుతూ ఉండడం అలాగే ఉన్న ఒక్క ట్విస్ట్ దాదాపు ఫస్ట్ సీన్ లో చెప్పెయడమే, మిగిలిన బ్యాలేన్స్ ని ఇంటర్వెల్ లో రివీల్ చేసెయ్యడమే.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని పోసాని సీన్స్,  ఇంటర్వల్ బ్లాక్ తప్ప మిగతా ఏదీ సెట్ అవ్వకపోవడంతో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.

సెకండాఫ్ ని పూర్తి ఎమోషనల్ దారిలోకి తీసుకెళ్ళి పోవడం వలన బాగా స్లోగా ఉంటుంది. వరుణ్ తేజ్ - రేవతిల మధ్య కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వడం వలన సెకండాఫ్ స్టార్టింగ్ బాగుందనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అంతా సర్వమంగళ మేలమే అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా అయితే పూరి స్టైల్ స్క్రీన్ ప్లే, సూపర్ ఫాస్ట్ నేరేషన్ ఇందులో మిస్ అయ్యింది. ఇక డైరెక్టర్ గా తను రాసుకున్న డైలాగ్స్ ని అందరి చేత బాగానే చెప్పించాడు. అలాగే వరుణ్ తేజ్ ని బాగానే ప్రెజంట్ చేసాడు. కానీ 2 గంటల 15 నిమిషాల పాటు ఆడియన్స్ ని బోర్ కొట్టించకుండా సీట్లో కూర్చోబెట్టడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమాలో చాలా చెడ్డగా అనిపించేది మాత్రం కన్న తల్లిని కొడుకే కిరాతకంగా చంపడం అనేది పిచ్చికి పరాకాష్టలా అనిపిస్తుంది.  


ఇక మిగిలిన టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పిజి వింద సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జోద్ పూర్, రాజస్థాన్ లోని పలు లొకేషన్స్ ని చాలా బాగా చూపించడం వలన ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కి విజువల్స్ పరంగా ఓ కొత్తదనం కనపడుతుంది. ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటలు, వాటిని పిక్చరైజ్ చేసిన విధానం ఇలా రెండూ అంత చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. కానీ రీ రికార్డింగ్ మాత్రం బాగా కొట్టాడు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది అయితే తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ దగ్గర మంచి ఫీలున్న రీ రికార్డింగ్ ఇచ్చాడు. విఠల్‌ కోసనం ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ మాత్రం బిలో యావరేజ్ అని చెప్పాలి. రొటీన్ అవ్వడం వలన అనుకుంటా తను ఎంత షార్ప్ గా కట్ చేసినా సినిమాలో మాత్రం ఆ ఫీల్ రాలేదు. ఆ విషయంలో ఎడిటర్ బాగా వర్కౌట్ చేసి ఉండాల్సింది.  సికె ఎంటర్టైన్మెంట్స్ వారు ఖర్చు చేసిన రూపాయి బాగా గ్రాండ్ గా తెరమీద కనిపిస్తుంది. 

లోఫర్ సినిమా చూసాక మొదట వచ్చే మాట ఈ చిత్ర టీం మరియు పూరి జగన్నాద్ లోఫర్ అనే సినిమా హిట్ అవ్వాలని తీసినట్టు లేరు. కేవలం వరుణ్ తేజ్ కి మాస్ హీరో ఇమేజ్ తీసుకురావాలి, తను కూడా మాస్ మసాలా సినిమాలకి సెట్ అవుతాడు అని చెప్పడం కోసమే తీసినట్టుంది. సినిమా సినిమాకి పూరి జగన్నాధ్ తన పేరును తనే చెడగొట్టుకునే సినిమాలు చేస్తున్నాడు అనడానికి లోఫర్ ఓ చక్కని ఉదాహరణ. జస్ట్ రెండు మదర్ సెంటిమెంట్ సీన్స్, హీరో పాత్ర తోనే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యాలనుకోవడం సిల్లీ అనే చెప్పాలి. పూరి స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పరంగా రాంగ్ ట్రాక్ లో ఉన్నాడని మరోసారి ఈ సినిమా నిరూపించింది. 


పూరి జగన్నాద్ సినిమాలకి మేము వీరాభిమానులం, అలాగే మెగా హీరోల నుంచి వచ్చే సినిమా ఏదైనా మేము చూడాల్సిందే అనుకునే సినీ అభిమానులు మాత్రం హ్యాపీగా చూసేసే సినిమా 'లోఫర్'. మిగతా మూవీ లవర్స్, రెండు గంటలు ఎంజాయ్ చెయ్యాలి అనుకోని వెళ్ళే వారికి మాత్రం తలపట్టుకునే సినిమానే 'లోఫర్'. 

Varun Tej,Disha Patani,Puri Jagannadh,C. Kalyan,Sunil Kashyapలోఫర్ - ఆడియన్స్ ఈడో పెద్ద తలనొప్పి.

మరింత సమాచారం తెలుసుకోండి: