ఎన్.టి.ఆర్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ అండ్ స్టైలిష్ లుక్ , హృదయాన్ని కదిలించే ఎన్.టి.ఆర్ , రాజేంద్ర ప్రసాద్ ల ఎమోషనల్ సీన్స్ , ఎన్.టి.ఆర్ , జగపతి బాబుల గేమ్ , ఎన్.టి.ఆర్ - రకుల్ లవ్ స్టొరీ , విజయ్ కె చక్రవర్తి ఫెంటాస్టిక్ విజువల్స్ ఎన్.టి.ఆర్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ అండ్ స్టైలిష్ లుక్ , హృదయాన్ని కదిలించే ఎన్.టి.ఆర్ , రాజేంద్ర ప్రసాద్ ల ఎమోషనల్ సీన్స్ , ఎన్.టి.ఆర్ , జగపతి బాబుల గేమ్ , ఎన్.టి.ఆర్ - రకుల్ లవ్ స్టొరీ , విజయ్ కె చక్రవర్తి ఫెంటాస్టిక్ విజువల్స్ చాలా సింపుల్ గా అనిపించే రొటీన్ రివెంజ్ డ్రామా , స్క్రీన్ ప్లే లో పెద్ద కిక్ లేకపోవడం , ఊహాజనితంగా సాగే నెరేషన్ , సెకండాఫ్ సాగాదీత , ఎడిటింగ్ , అనవసరమైన పాటలు , మ్యూజిక్ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడం

లండన్ మహానగరంలో పెద్ద వ్యాపారవేత్త అయిన  రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)  వారసుడే అభిరామ్(ఎన్.టి.ఆర్). అభిరామ్ ఉన్న ఏకైక ఎమోషన్ నాన్న, ఎలాంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కునే ఆయనే అభిరామ్ కి స్ఫూర్తి.. ఒకరోజు సడన్ గా  రమేష్ చంద్ర ప్రసాద్ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. అది తెలుసుకున్న అభిరామ్ ఇండియా చేరుకుంటాడు. హాస్పిటల్ యాజమాన్యం  రమేష్ చంద్ర ప్రసాద్ ఇక ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తారు. అప్పుడే అభిరామ్ తన తండ్రి మాటల్లోనే తను అలా అవ్వడానికి కారణమైన కృష్ణమూర్తి (జగపతిబాబు) గురించి తెలుసుకుంటాడు. ఏదో ఒక గేమ్ ఆది మోసం చేస్తేనే పైకి ఎదగగలం అని అనుకునే కృష్ణమూర్తిని ఎదుర్కోవడానికి లండన్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తిని ఎదుర్కోవడం కోసం అభిరామ్ ఏం చేసాడు? ఎలా తన తండ్రికి జరిగిన మోసాన్ని బయట పెట్టాడు. అభిరామ్ - కృష్ణమూర్తికి మధ్య మొదలైన మైండ్ గేమ్ ఏంటి? అభిరామ్ కృష్ణమూర్తిని ఎలా ఓడించాడు..? తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు..? అన్నదే మిగతా కథ.  

ఈ సినిమాకి నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు వారి డెడికేషనే సినిమాకి హైలైట్. కావున వారి గురించి రెండు మూడు బలమైన పదాలు వాడి చెబుతా.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన 24 సినిమాల కంటే మించిన, పూర్తి మెచ్యూరిటీ ఉన్న నటనని ఇందులో కనబరిచాడు. చూడటానికి చాలా స్టైలిష్ గా, సూటు, భూటు, టై వేసుకొని అమ్మాయిలను ఆకర్షించేలా కనపడ్డాడు. ఇక సుకుమార్ స్టైల్ అనగా హీరో పాత్రలో కూసింత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్.టి.ఆర్ నటన కొత్తగా ఉంది. లవ్, కామెడీ, యాక్షన్, సెటిల్ చాలెంజ్ ఎమోషన్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఎమోషనల్ రైడ్ మాత్రమే ఒక ఎత్తు. ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకునేలా ఆ పాత్రలో జీవించాడు. ఇంతలా ఎమోషన్స్ ఎన్.టి. ఆర్ ఏ సినిమాలోనూ చూపలేదు. రకుల్ ప్రీత్ సింగ్ నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది.


అలాగే ఎన్నారై పాత్ర కావడం వలన మోడరన్ లుక్స్ లో అందాలతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా తన ఓన్ డబ్బింగ్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. క్లాసీ విలనిజం చూపించడంలో జగపతి బాబు ది బెస్ట్ అనిపించాడు. ఎన్.టి.ఆర్ - జగపతి బాబు సీన్స్ చాలా క్లాసీగానే కాకుండా విలనిజంని ఎలివేట్ చేయడం బాగుంది. రాజేంద్ర ప్రసాద్ నటన కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. 

సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' అనే సినిమాని ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని రాసుకున్నాడు. అదే క్లైమాక్స్ సీన్.. ఆ ఒక్క సీన్ ని ఆడియన్స్ కి ఎఫ్ఫెక్టివ్ గా కనెక్ట్ చేసాడు.. కానీ ఆ సీన్ ని కనెక్ట్ చేయడం కోసం 160 నిమిషాలు ఆడియన్స్ ని కూర్చో బెట్టడం అనేది మామూలు విషయం కాదు.. ఇక లా కూర్చో బెట్టడం కోసం సుక్కు ఏం చేసాడు అనే విషయానికి వస్తే.. సుకుమార్ కథ కోసం ఎంచుకున్న లైన్ చాలా చాలా చిన్నది. ఏ మాత్రం కిక్ ఇచ్చే పాయింట్ కాదు. ఇక దానిని రెగ్యులర్ గా చెప్పకుండా హీరో విలన్ ని క్లాస్ గా చూపించి ఓ థ్రిల్లర్ తరహాలో రివెంజ్ డ్రామాని సిద్దం చేసాడు. కానీ థ్రిల్లర్ జోనర్ ని సెలక్ట్ చేసుకున్నప్పుడు, సినిమా ఆధ్యంతం ఆసక్తికరంగా, స్క్రీన్ ప్లే పరిగెత్తేలా ఉండాలి. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే అలా లేదు. రాజేంద్ర ప్రసాద్ మొదటి సీన్ లోనే సినిమా కథ, కథనం మరియు సినిమా ఎలాంటి సందర్భంలో ముగుస్తుంది అనే క్లారిటీని పక్కాగా ఇచ్చేయడం వలన ఆడియన్స్ ఈజీగా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది గెస్ చేసేస్తారు.


ఇకపోతే సుకుమార్ సినిమాల్లో కల్లా ఫ్లాట్ నేరేషన్ ఈ సినిమాకే ఇచ్చాడని చెప్పాలి. సినిమాలో ఎక్కడా అబ్బా అనేలా థ్రిల్స్ ఉండవు. సినిమాలో బెస్ట్ మూమెంట్ అనిపించేది ఇంటర్వల్ బ్లాక్ కానీ ఆ తర్వాత సినిమా వేగాన్ని పూర్తిగా తగ్గించేసి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయాడు. అసలైన ట్రాక్ లోకి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లోనే వచ్చాడు. ఇలా కథ, కథనంలో మిస్టేక్స్ చేసిన సుకుమార్ డైరెక్టర్ గా రాసుకున్న కొన్ని సీన్స్ ని చాలా బాగా స్క్రీన్ పై ఆవిష్కరించాడు. ఇంటర్వల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్స్ అదిరాయి. కానీ మిగతా అంతా బాగా నీరసంగా ఉండేలా చూసుకున్నారు. ఇక సినిమాకి మెయిన్ లాజిక్ లో ఒకటి, జగపతి బాబు ఎలా రాజేంద్ర ప్రసాద్ ని మోసం చేసాడు అనే పాయింట్ ని పర్ఫెక్ట్ గా చుపించనేలేదు. అలాగే ఇది నా సినిమా అని చెప్పుకోవడానికి కొన్ని అనవసరమైన సీన్స్ ని పెట్టారు.


అలాగే పాటల్లో ఎక్కడా సుకుమార్ మార్క్ టేకింగ్ కనిపించదు. అందుకే ఒక్క ఫాలో ఫాలో పాట తప్ప మిగతా ఏదీ బాలేవు. సుకుమార్ డైరెక్టర్ గా ఒక మోస్తరు సినిమా ఇవ్వగలిగాడే తప్ప తన స్థాయికి తగగా సినిమాని ఇవ్వలేకపోయాడు. లాజికల్ గా చూసుకుంటే.. రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటెలిజెంట్ తనని జగపతి బాబు ఎలా మోసం చేసాడు అన్నది చూపించలేదు, అలాగే డ్రగ్ కేసులో వైఫ్ ని పట్టుకొని మొగుడు అయిన జగపతి బాబుని వదిలేయడం, క్లైమాక్స్ లో తనకి క్లీన్ చిట్ ఇచ్చారని చూపకుండా చంపేయడం ఎక్కడో అసంపూర్ణంగా అనిపిస్తుంది.      


విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా చాలా సూపర్బ్ గా ఉంది. ప్రతి ఫ్రేంని చాలా కలర్ఫుల్ గా, చాలా ఫ్రెష్ ఫీల్ ని వచ్చేలా షూట్ చేసాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో పాటలు విన్నప్పుడు బాగున్నా సినిమాకి వచ్చేసరికి పిక్చరైజేషన్ పరంగా తుస్సుమన్నాయి. ఇక రీ రికార్డింగ్ కూడా కొన్ని సీన్స్ కి మాత్రమే బాగుంది అనిపించేలా ఇచ్చాడు, మిగతా అంతా తూతూ మంత్రంలా కానిచ్చేసాడు. నవీన్ నూలి ఎడిటింగ్ ఓవరాల్ గా అయితే చాలా బాడ్.. కానీ కొన్ని కొన్ని సీన్స్ ని మాత్రమే ఏరుకుంటే ఈ సీన్స్ బాగానే చేసాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక పీటర్ హెయిన్స్, రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ కలిసి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. ఎడిటర్ ఎస్. రవీందర్ వర్క్ బాగుంది. ఇకపోతే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం హై క్లాస్ లో ఉన్నాయి. 


'సుకుమార్ 1- నేనొక్కడినే అనే సినిమాని చాలా కన్ఫ్యూజన్స్ ని క్రియేట్ చేసి తీసేసాడు. దాని వలన చాలా మంచికి అర్థం కాలేదు. అందుకే సుకుమార్ ఈ సారి చాలా సింపుల్ వేలో కథ చెప్పడానికి ట్రై చేసాడు. తను అనుకున్న పాయింట్ బాగుంది, కానీ దానిని పర్ఫెక్ట్ గా చెప్పడంలో మిస్ అయ్యాడు. స్ట్రైట్ గా చెప్పాడు కానీ అందరికీ తెలిసిన, ఊహించదగిన విధంగా చెప్పడమే నాన్నకు ప్రేమతోలోని ఎమోషనల్ కంటెంట్ 100% ఆడియన్స్ కి రీచే అయ్యేలా చెప్పలేకపోయింది. బ్లడ్ షెడ్ లేకుండా సినిమా చెప్పాలనుకోవడం, పాత్రలు రాసుకున్న విధానం బాగుంది. కానీ వాటిని ఇంకా టిపికల్ గా, థ్రిల్లింగ్ గా చెప్పాలి. కథలో రాసుకున్న రెండు మూడు థ్రిల్స్ ని కూడా ఈజీగా అందరూ ఊహించేస్తారు.


అందుకే ఏదీ పెద్ద కిక్ ఇచ్చేలా ఉండదు. నాన్నకు ప్రేమతో అనే సినిమాకి హెల్ప్ య్యింది రెండు మూడు పాయింట్స్ అయితే, సినిమాని నాశనం చేసిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. నాన్నకు ప్రేమతో అనే సినిమా తొడగొట్టి మాస్ మాసాలా సినిమాలు చూసే వారికి నచ్చదనే చెప్పాలి. అలాగే తెలుగులో కొత్తతరహా సినిమాలు రావాలి అనుకునే వారికి నచ్చే సినిమా.. ఓవరాల్ గా స్టార్ హీరో అయిన ఎన్.టి.ఆర్ ఇలాంటి తరహా సినిమాని తెలుగులో ట్రై చేసి ఓ కొత్తదనానికి నాంది పలికినందుకు హ్యాస్తాఫ్ చెపుతున్నాం. ఇక్కడ ఎన్.టి.ఆర్ తప్పు అనేది తక్కువ ఎందుకంటే తను సినిమా కోసం ది బెస్ట్ ఇచ్చాడు. కానీ టేకింగ్ దగ్గర సినిమా కూసింత రాంగ్ వేలోకి వెళ్ళింది.

Jr NTR,Rakul Preet,Sukumar,BVSN Prasad,Devi Sri Prasadనాన్నకు ప్రేమతో - క్లాస్ ప్రెజంటేషన్ విత్ జీరో ఎమోషన్

మరింత సమాచారం తెలుసుకోండి: