ఫస్ట్ హాఫ్ , క్లైమాక్స్ లో పృధ్వీ రాజ కామెడీ , సుధీర్ , వామికల పెర్ఫార్మన్స్ , శాందత్ సినిమాటోగ్రఫీ , సన్నీ ఎంఅర్ రీ రికార్డింఫస్ట్ హాఫ్ , క్లైమాక్స్ లో పృధ్వీ రాజ కామెడీ , సుధీర్ , వామికల పెర్ఫార్మన్స్ , శాందత్ సినిమాటోగ్రఫీ , సన్నీ ఎంఅర్ రీ రికార్డింరెగ్యులర్ బోరింగ్ సెకండాఫ్ , ఊహాజనిత కథనం , స్లో నేరేషన్ , అవసరం లేని చోటల్లా వచ్చే పాటలు , సెకండాఫ్ ఎడిటింగ్ , లవ్ స్టొరీ ఎక్కడా లేదు కానీ ఇద్దరికీ లవ్ పుట్టడంలో జస్టిఫికేషన్ లేదు , నో థ్రిల్స్

ఉండ్రాజవరం.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని తెగ ఆరాటపడుతున్న సీత(వామిక గబ్బి) పెళ్లి మరికొద్దిసేపట్లో అనగా పెళ్ళికొడుకు పారిపోతాడు. పెళ్లి ఆగిపోద్ది, కట్ చేస్తే శక్తి(సాయికుమార్)  సీతని కిడ్నాప్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాడు. కట్ చేస్తే హైదరాబాద్.. రామ్(సుదీర్ బాబు) ప్రేమించిన అమ్మాయి మరో డబ్బున్న వాన్ని పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని ఎలాగన్నా కొట్టాలి అని బయలుదేరిన రామ్ తన ఫ్రెండ్ ప్రవీణ్ వాళ్ళ ఓ యాక్సిడెంట్ చేస్తాడు. దాని వలన ఎదురు కారులో కిడ్నాప్ అయిన సీత తప్పించుకుంటుంది. కానీ సడన్ గా ఏదన్నా జరిగితే హై బిపి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు రామ్. అలా శక్తి మనుషులకి దొరికేస్తాడు. వాళ్ళేమో రామ్ ఫ్రెండ్ ఆది(ప్రవీణ్)ని ఉంచుకొని రామ్ ని వెళ్లి సీతని వెతికి పట్టుకురమ్మంటారు. అలా వెళ్ళిన రామ్ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసి సీతని పట్టుకున్నాడు. సీతని పట్టుకున్నాక తనవల్ల అతని జర్నీలో కలిగిన మార్పు లేమిటి? ఫైనల్ గా శక్తి నుంచి తన ఫ్రెండ్ ని ఎలా విడిపించారు అన్నదే కథ.

సుధీర్ బాబు నటన పరంగా చాలా సెటిల్ గా చేసాడు. హావ భావాలు పలికించడంలో, డైలాగ్ డెలివరీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ సినిమాకి తన వంతు న్యాయం అయితే చేసాడు. సుధీర్ బాబు ఇక నుంచి ఫైట్లు పాటలు అనే సినిమాలు కాకుండా ఇలాంటి సినిమాలు చేస్తే తన కెరీర్ మంచిగా ముందుకు సాగిపోతుంది. చూడటానికి బొద్దుగా ఉన్న వామిక గబ్బి  పెర్ఫార్మన్స్ లో మాత్రం మస్త్ అనిపించింది. తన ఎనర్జీ లెవల్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా అందరికీ నచ్చే పాత్ర. సాయి కుమార్ పేరుకి పెద్ద కిడ్నాపర్ బయట ఆ రోల్ ని వాహ్ అనేలా చేస్తూనే, ఇన్నర్ గా పెళ్ళానికి భయపడే యాంగిల్ ని కూడా చాలా బాగా చేసాడు. 30 ఇయర్స్ పృథ్వి సినిమా చివర్లో వచ్చి సినిమా మొత్తానికి తనే హైలైట్ అనుకునేలా తన ఎపిసోడ్ ని చేసి వెళ్ళిపోయాడు. ఇకపోతే కిడ్నాపర్స్ గా చేసిన వేణు - శ్రీరామ్ లు ఫస్ట్ హాఫ్ లో సందర్భానుసారంగా వచ్చే కామెడీతో నవ్వించారు. ప్రవీణ్, విద్యుల్లేక, పోసాని కృష్ణమురళి ట్రాక్స్ అక్కడక్కడా వచ్చి నవ్వు తెప్పిస్తే, పరుచూరి గోపాలకృష్ణ మిడిల్ క్లాస్ ఫాదర్ గా నవ్విస్తారు. చైన్య కృష్ణ, ధన్య బాలకృష్ణలు తమ చిన్న చిన్న రోల్స్ లో మెప్పించారు.   

ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ కమర్షియల్ గా మా మాసాలా, రొటీన్ ఫ్లేవర్ లో సినిమాలు చేయాలని తెగ ట్రై చేస్తున్న ఈ టైంలో శ్రీరామ్ ఆదిత్య ఇలాంటి ఓ విభిన్న సినిమా చేయాలనుకోవడం అభినందనీయం. తనే కథ - కథనం - దర్శకత్వం డిపార్ట్మెంట్స్ ని డీల్ చేసాడు. డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ సినిమా ఫార్మాట్.. ఇందులో ఏవేవి వర్కౌట్ అయ్యాయి అనే విషయానికి వస్తే.. కథా పరంగా డైరెక్టర్ స్టార్టప్ బాగానే రాసుకున్నాడు. కానీ ఫినిషింగ్ కి వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువై మధ్యలో ఫ్లో మిస్ అయ్యిన అటుతిప్పి ఇటు తిప్పి ఫైనల్ గా తను స్టార్ట్ చేసిన కొత్త విధానాన్ని వదిలేసి మరీ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వచ్చి ముగింపు ఇచ్చాడు. ఇక కథనం విషయానికి వస్తే డిఫరెంట్ గా ప్రెజంట్ చెయ్యాలన్న కారణం వలన అనుకుంటా చక చకా సాగే స్క్రీన్ ప్లే ఆస్సలు కనిపించదు. దానికి తోడు స్క్రీన్ ప్లే లో డైరెక్టర్ రివీల్ చేయాలనుకునే థ్రిల్స్ లో ఏ ఒక్కటీ సూపర్ మచ్చి అనుకునేలా లేవు. ముఖ్యంగా పాత్రల ఇంట్రడక్షన్, వారి ఫ్లాష్ బ్యాక్ మరియు మెయిన్ కాన్సెప్ట్ వలన ఫస్ట్ హాఫ్ బాగానే రాసుకున్నాడు బానే ఉంది కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి తన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. దాంతో సాగదీసి దీసి చివరికి ఓ కామెడీ సీన్ తో ఎండ్ చేసాడు.


ఇక నేరేషన్ అయితే పాకడం కన్నా కూసింత స్పీడ్ గా నడకకన్నా స్లోగా ఉంటుంది. సినిమా స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా స్పీడ్ గా వెళ్ళాడు. దానికి తోడు మధ్యలో పాటలు సినిమాకి గుడి బండల్లా తయారయ్యాయి. ఊ అంటే పాట, ఆ అంటే పాట వచ్చి ఇర్రిటేట్ చేస్తాయి. ఇకపోతే డైరెక్టర్ గా అయితే ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కూర్చోబెట్టగలిగినా సెకండాఫ్ లో మాత్రం సగం మంది లేచి వెళ్ళడానికి ఇష్టపడితే సగం మంది డీలా పడిపోయి చూడాలి కదా అంటే చూడాలి అనే రీతిలో చూస్తున్నారు. దాంతో కొంతమేర మాత్రమే శ్రీరామ్ ఆదిత్య సక్సెస్ అవ్వగాలిగాడు. మొత్తంగా రెండు విషయాలు చెప్పాలి. మొదటిది మన డైరెక్టర్స్ ఎందుకునే కొన్ని థీమ్స్ ని రెండు గంటల్లో చెప్పలేం కొన్నిటికి ఇంకాస్త సమయం కావాలి కానీ షార్ట్ రన్ టైం పిచ్చి కారణంగా వారు అనుకున్న థీమ్ ని ముక్కలు చేసి లేక దానికి న్యాయం చేయకుండా కథని రాసుకుంటున్నారు. ఇక రెండవది.. ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా ఫస్ట్ హాఫ్ లోనే మొత్తం చెప్పేసి సెకండాఫ్ అనేదాని కోసం ఒక స్ట్రాంగ్ సీన్ ని కూడా పెట్టుకోవడంలేదు. మెయిన్ గా డైరెక్టర్ చేసిన తప్పు ఇది క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. కానీ ఇందులో అదిరిపోయేలా థ్రిల్ చేసే అంశాలేవీ లేవు.     


మిగతా టెక్నికల్ టీంలో ఈ జానర్ సినిమాకి పర్ఫెక్ట్ లొకేషన్స్ మరియు సెట్స్ ని డిజైన్ చేసిన ఎస్. రామకృష్ణ గురించి చెప్పాలి. సినిమాలో తను చూపించిన ప్రతిది సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇక ఆ లొకేషన్స్ మరియు సెట్ ని సినిమాటోగ్రాఫర్ శాందత్ తెరపై చూపించిన తీరు సూపర్ మచ్చి. సినిమా మూడ్ కి, జానర్ కి సింక్ అయ్యేలా తను చూపిన విజువల్స్ వలనే మనం సినిమాతో ట్రావెల్ అవుతాం. సన్నీ ఎంఆర్ కంపోజ్ చేసిన పాటలు సూపర్ అయితే కాదు, అలాగే సినిమాకి అవి పెద్దగా అవసరం కూడా లేదు. కానీ రీ రికార్డింగ్ మాత్రం అదరగొట్టాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ లో మొదటగా అన్ని పాటల్ని కట్ చెయ్యాలి. అవే ఈ సినిమాకి పెద్ద అడ్డం. ఇక పోతే సెకండాఫ్ పరంగా ఎడిటింగ్ చాలా చాలా స్లో. అర్జున్ - కార్తీక్ రాసిన డైలాగ్స్ బాగా క్లాస్ గా ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ అప్పుడు 'తిరిగే భూమి ఆగిపోయినా, గన్ లో నుంచి బులెట్ వచ్చినా జీవితాలు తలకిందులైపోతాయి' అని రాసిన డైలాగ్ బాగుంది. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. 


2015 సంవత్సరంలో ఒక 10 సినిమాలు వదిలేస్తే.. మిగతా అన్ని సినిమాలు.. ప్రతి వారం బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అవ్వడం పరమ రెగ్యులర్ సినిమా అనిపించుకోవడం అనేది దాదాపు 98% జరిగింది. కానీ ఈ ఏడాది చివర్లో మాత్రం ఆ రొటీన్ ఫ్లేవర్ నుంచి బయటకి తీసుకు వస్తూ ఓ డిఫరెంట్ అటెంప్ట్ గా చెప్పుకోదగిన సినిమా 'భలే మంచి రోజు'. కాన్సెప్ట్ పరంగా, ఫస్ట్ హాఫ్ పరంగా బాగా కొత్తగా అనిపించినా, ఎంటర్టైన్ చేసినా సెకండాఫ్ అనేది సరిగా లేకపోవడం మరియు చాలా విషయాలను పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయలేదు అందుకే ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగులో డిఫరెంట్ సినిమాలు రవాళి అని కోరుకుంటే వారు చూడాల్సిన సినిమా 'భలే మంచి రోజు'.   

Sudheer Babu,Wamiqa Gabbi,Sriram Aditya,Vijay Kumar Reddy,Shashidhar Reddy,Sunny MRభలే మంచి రోజు - అంత భలేగా లేదు.. జస్ట్ ఓకే మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: