అస్సలు ఒక్కటంటే ఒక్కటే ఎకూడా లేదు లేదంతే.. అస్సలు ఒక్కటంటే ఒక్కటే ఎకూడా లేదు లేదంతే.. ఎన్నో సినిమాల మిక్సింగ్ నుంచి పుట్టిన కథ , పసలేని కథనం , నీరసం వచ్చే నేరేషన్ , డైరెక్షన్ , ఎడిటింగ్ , నో ఎంటర్టైన్మెంట్ , ప్రాసతో కూడిన అర్థం పర్ధం లేని డైలాగ్స్ , ఇంకా మిగతావి అన్నీ.. అన్నీ ఉన్నాయి

వామ్మో వాయ్యో ఇలాంటి పరమ రొటీన్ కథలని ఇప్పటికే చాలా సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు చూసి చూసి విసిగి వేసారి పోయి ఉన్నారు. సరే సౌఖ్యం అనే సినిమాని తీసారు కాబట్టి ఆ కథ ఎలా ఉందనేది వీలైనంత షార్ట్ గా చెప్తా... హీరో శ్రీను(గోపీచంద్) హ్యాపీగా బాచిలర్ లైఫ్ సాగిస్తున్న టైంలో హీరోయిన్ శైలజ(రెజీన)ని చూసి ప్రేమలో పడడం, ఇద్దరూ ఓకే అవ్వడం కట్ చేస్తే శైలజ కిడ్నాప్.. ఇక తనని వెతికే పనిలో పలువురిని కలవడం వారిథి శ్రీను చాలెంజ్ లు చేయడం, మధ్య మధ్యలో మస్కా కొట్టి ఫైనల్ గా అందరినీ మట్టుబెట్టి ఎలా తన ప్రేమను దక్కించుకున్నాడు అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ. 

ఒక కథని నడిపించడానికి హీరో అనే ఒక ఫేస్ కావాలి, అలాగే ఫైట్స్ చేయడానికి, హీరోయిన్ పక్కన ఫ్రేంలో నిలబడడానికి హీరో అనే వాడు కావాలి. మిగతా అంతా హీరో పక్కన ఉన్నవాళ్ళే మెయిన్ హీరోలై చేస్తుంటాడు. అదేనండి మన తెలుగు సినిమా భాషలో కమెడియన్స్. ఈ సినిమాకి పేరుకి గోపీచంద్ హీరో, కానీ ఆయనకంటే కమెడియన్స్ ని ఎక్కువ హైలైట్ చేయాలని ట్రై చేసారు. కానీ కట్ చేస్తే వాళ్ళు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు నవ్వించడంలో.. పృథ్వి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, సప్తగిరి, జయప్రకాశ్ రెడ్డిలు ఇలా ఎవరూ నవ్వించలేకపోయారు. ఇక గోపీచంద్ ఎప్పటిలానే తన స్టైల్ ఫైట్స్, డాన్సులు మరియు మధ్య మధ్యలో హీరోయిజం డైలాగ్స్ చెబుతూ ఎప్పటిలానే బాగానే చేసాడు. రెజీన కామెడీ టచ్ ఉన్న సీన్స్ లో ఓకే, ఇక పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది. హీరోకి పోటీని ఇచ్చే విలన్స్ గా ప్రదీప్ రావత్, దేవన్ లు మెప్పించలేదు.  మిగతా పాత్రల్లో కనిపించిన ముఖేష్ రుషి, ప్రగతి, సురేఖ వాణి, సత్య కృష్ణ, రఘుబాబు, శివాజీ రాజా, కృష్ణ భగవాన్ లు వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. 

హీరో హీరోయిన్ ని చూడడం.. కట్ చేస్తే లవ్.. హీరోయిన్ సైడ్ నుంచి సమస్య.. హీరో ఒక ప్లాన్ వేసి అందరినీ ఒక ఇంట్లో పెట్టి గందరగోళం క్రియేట్ చేసి ఫైనల్ గా విలన్ మార్చి లేదా కొట్టి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం..ఇదే మూస కథని ప్రతి ఏడాది మనం ఓ 60-70 సినిమాల్లో అన్నా చూస్తున్నాం. అందులో మహా అయితే రెండు లేదా మూడు మాత్రమే ఆడుతున్నాయి అయినా అలాంటి కథలని మన రచయితలూ రాయడం మానలేదు, హీరోలు చేయడమూ మానలేదు. అదే కోవలో మరోసారి శ్రీధర్ సీపాన రాసిన కథే ఈ సౌఖ్యం. సినిమా చూసిన తర్వాత ఇదే కథని ఇంకా ఎన్నిసార్లు రాస్తారని అతనికన్నా బోర్ కొట్టడం లేదా అనే ఫీలింగ్ వస్తుంది.. ఏమన్నా అంటే దర్శకులు, హీరోలు అదే అడుగుతున్నారు అని చెప్తున్నారు తప్ప కనీసం కొద్దిగా కూడా కథని, ఆ కథ చెప్పే ఫార్మాట్ ని ఎందుకు మార్చడం లేదో.. ప్రేక్షకులు తిప్పి కొడుతున్నా తమ పేరుని దిగజార్చుకొని ఇలాంటి కథలు ఎందుకు రాస్తున్నారో వారికే తెలియాలి.


సౌఖ్యం అనే సినిమాకి శ్రీధర్ సీపాన రాసిన కథ ది బిగ్గెస్ట్ మైనస్. రచయితగా తెలుగు సినిమా స్థాయిని మరింత దిగజార్చేలా చేస్తున్న ఇలాంటి కథలు ఇకనన్నా రాయడం ఆపేస్తే బెటర్. చివరికి వీరు కామెడీ కూడా సరిగా రాసుకోలేక స్పూఫ్స్ మీద ఆధారపడడం బాధాకరం. ఇక కోన వెంకట్ - గోపి మోహన్ లు కలిసి రాసిన కథనం కూడా వరస్ట్ అని చెప్పాలి. సినిమా స్టార్ట్ టు ఎండ్ ఆడియన్స్ కి చిరాకుతో పాటు భూతులు తెప్పించేలా స్క్రీన్ ప్లే రాసారు. అందుకే సెకండాఫ్ లో స్పూఫ్ కామెడీ పెట్టి నవ్వించాలనుకొని బొక్క బోర్లా పడ్డారు. సినిమా అంతా ఆడియన్స్ కి తెలిసిందే జరుగుతూ ఉండడం వలన పరమ బోరింగ్ అనిపిస్తుంది. ఇక నేరేషన్ కూడా చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ ఆడియన్స్ ని ఇన్నర్ గా ఉన్న సహనాన్ని కిల్ చేస్తూ ఉంటుంది. దర్శకుడిగా కూడా రవికుమార్ చౌదరి ఆడియన్స్ ని ఏ కోశానా మెప్పించలేకపోయాడు. ఓ సినిమాకి ప్రాణమైన కథ - కథనం - డైరెక్షన్ అనే 3 విభాగాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక లాజికల్ గా లెక్కలేనన్ని మిస్టేక్స్.. సినిమా స్టార్టప్ రెడీతో మొదలయ్యి, ఆ తర్వాత వెంకీని టచ్ చేసి, ఇంటర్వల్ బ్లాక్ కి రెబల్ టెంపుల్ ఫైట్ తో ముగిసి సెకండాఫ్ ఇక ఒకే ఇంట్లో డ్రామా అనే చాలా సినిమాల ఫార్మాట్లోకి వస్తుంది. 


మిగతా విభాగాల్లో మేజర్ గా హెల్ప్ అయ్యింది ఒక్కటే అదే సినిమాటోగ్రఫీ. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా పనితమ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఆయన సెలక్ట్ చేసుకున్న కెమెరా యాంగిల్స్, కలర్ ఫార్మాట్, నటీనటులను చూపిన విదానం బాగుంది. అనూప్ రూబెన్స్ పాటలు పెద్ద క్యాచీగా లేవు, లేదు విజువల్స్ గ్రాండియర్, రెజీన అందాల వలన చూసేస్తారు. పాటల మీద రీ రికార్డింగ్ ఇంకా చెత్తగా ఉంది. శ్రీధర్ సీపాన రాసిన డైలాగ్స్ లో ప్రాస, పంచ్ లు ఉన్నాయి కానీ అర్థం మాత్రం లేదు. ఇలాంటి అర్థం లేని పంచ్ డైలాగ్స్ ఎన్ని రాసినా ఫలితం శూన్యం. వివేక్ ఆర్ట్ వర్క్ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాలేదు. ఆయన కత్తెర వేయకుండా చాలానే వదిలేయడం వలన థియేటర్స్ లో ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే ఓకే అనేలా ఉన్నాయి. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు మాత్రం రిచ్ గా ఉంది సినిమాకి మంచి గ్రాండియర్ లుక్ ని తెచ్చాయి.    

కోన వెంకట్ - గోపి మోహన్ అనే జంట రచయితల కలం నుంచి వచ్చిన ఎన్నో హిట్ అండ్ ఫ్లాప్ సినిమాల అదే మూస ఫార్ములాయిక్ ఫార్మాట్ లో వారి శిష్యుడు శిష్యుడు అయిన శ్రీధర్ సీపానరాసిన కథే ఈ సౌఖ్యం. ఈ సినిమాతో వీరితో పాటు వీరి శిష్యులకి కూడా ఇది తప్ప ఇక ఏదీ రాదని ఫిక్స్ అయిపోవడమే కాదు, ఇకపై వీరిద్దరితో పాటు శ్రీధర్ సీపాన టాగ్ లైన్ వేసుకోవలన్నా భయపడతారేమో నిర్మాతలు.. ఇప్పటికే ఇలాంటి సినిమాల వలన తెలుగు సినిమా స్థాయి తగ్గిపోతోంది.. ఇక నుంచి అన్నా ఆ మూస ఫార్మిలాయిక్ కథా ఫార్మాట్ ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసి కొత్త తరహా ఫార్మాట్, కొత్త కథలకి శ్రీకారం చుడితే బాగుంటుంది. సౌఖ్యం అనే సినిమా రొటీన్ సినిమాలు కోరుకునే ఆడియన్స్ కి కూడా నచ్చని సినిమా. గోపీచంద్ కెరీర్లోనే ది బెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఒక్కటే మాట.. ఈ సినిమా దరిదాపులకి కూడా వెళ్ళద్దు అలా కాదు అని చూస్తె మీకు మీ జేబులోని డబ్బు పోవడమే కాకుండా తలనొప్పి, బిపిలు కూడా వస్తాయి. సౌఖ్యం మీ అసౌకర్యానికి కేరాఫ్.. సో బీ కేర్ఫుల్..

Gopichand,Regina Cassandra,A.S.Ravi Kumar,Anand Prasad,Anup Rupensసౌఖ్యం - ప్రేక్షకుల పాలిట 'అసౌకర్యం'

మరింత సమాచారం తెలుసుకోండి: