Okkadine: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

  ‘బాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్. ‘సోలో’ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో నటించిన కొత్త సినిమా ‘ఒక్కడినే’. ఈ చిత్రంలో అతనికి జోడిగా నిత్యామీనన్ నటించింది. మరి ‘ఒక్కడినే’ ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :     శివాజీ రావు [సాయికుమార్] ప్రజాసేవే లక్ష్యంగా జీవిస్తుంటాడు. ప్రజలకు అండగా నిలబడుతుంటాడు. అతని కుమార్తె శైలజ [నిత్యామీనన్] విదేశాల్లో చదువు ముగించుకుని వస్తుంది. ఆమె జీవితంలోకి IFS ట్రైనింగ్ లో ఉన్న సూర్యం [నారా రోహిత్] ప్రవేశిస్తాడు. సూర్యాన్ని వివాహం చేసుకుందామని శైలజ నిర్ణయం తీసుకున్న సమయంలో అతని గురించి ఆమెకు ఒక భయంకరమైన వాస్తవం తెలుస్తుంది. సూర్యం ఎవరు..., అతను ఏ కారణంతో శైలజ  జీవితంలోకి ప్రవేశించాడు.., శివాజీ రావు వాస్తవ రూపం ఏమిటి, అతని అసలైన లక్ష్యం ఏమిటి... అనేవి వెండితెర మీద చూడాలి. నటీనటుల ప్రతిభ :   సూర్యంగా నారారోహిత్ ఆకట్టుకుంటాడు. డాన్సుల్లో నిరాశపరిచినా, ఫైట్స్ లో రాణించాడు. అయితే ఈ యువ హీరో తన డైలాగ్ డెలవరీ మీద, తన శరీరాకృతి మీద దృష్టి పెట్టాలి. హీరోగా రాణించాలంటే ఇవి రెండు చాలా ముఖ్యం. నిత్యామీనన్ నటన సహాజంగా ఉంది. మేకవన్నె పులి తరహా పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయాడు. ఇటీవల కాలంలో నాగేంద్ర బాబుకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. ఆ పాత్రను తన సహాజ శైలితో మెప్పించాడు. కోట శ్రీనివాసరావు-సుధ నిజంగా భార్యభర్తల్లా   ఉన్నారు. వారి మధ్య సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ ఫర్వాలేదనిపించినా, నేపధ్య సంగీతం యావరేజ్ గా ఉంది. ఒక్క పాట కూడా గుర్తుపెట్టుకునే విధంగా లేదు. పాటల చిత్రీకరణ, పాటల్లో సాహిత్యం కూడా అలానే ఉంది. మాటల్లో పదను లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథను ఎంచుకోవడంలో కరెక్ట్ గానే ఉన్న దర్శకుడు కథనంలో తడబడ్డాడు. చిత్ర కథనం చాలా స్లోగా సాగుతుంది. ఇలాంటి సమయంలో దర్శకులు పాటలు, వినోదం మీద దృష్టి పెడతారు. అయితే ఈ సినిమాలో అవి కూడా నీరసంగా సాగాయి. అయితే యాక్షన్ దృశ్యాలు, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, హీరో ఫ్యామిలీ దృశ్యాల్లో శ్రీనివాస రాగ తన ప్రతిభ చూపించాడు. కథనం మీద పూర్తి పట్టు చూపిస్తే పరిశ్రమలో నిలదొక్కుకునే లక్షణాలు ఉన్నాయి. హైలెట్స్ :     నారా రోహిత్, సాయికుమార్, నిత్యామీనన్ ల నటన, కథ  డ్రాబ్యాక్స్ :   స్లోగా సాగే కథనం, పాటలు, వినోదం ఆశించే విధంగా లేకపోవడం విశ్లేషణ : కొన్ని కథలు, నవలలు చదవటానికి చాలా బాగుంటాయి. చదివినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తాయి. అయితే వాటిని తెరమీద చూపించాలనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. చదివినప్పుడు వచ్చే ఫీలింగ్ ను తెర మీద చూసినప్పుడు కూడా కలగాలంటే దర్శకుడు చాలా కష్టపడాలి. దానికి తోడు ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చింది. కథ కంటే కథనం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వినోదం, పాటలు.. ఇలాంటి వాటిపై ఆసక్తి కనబరస్తున్నారు. సుదీర్ఘ కాలంగా సినిమా పరిశ్రమలో సాగుతున్న సివిరెడ్డి మొదటి నుంచి కూడా మంచి కథలతో చిత్రాలను తెరకెక్కించినా ఆశించిన విజయాలను పొందలేకపోయాడు. ఈసారి దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని సివి రెడ్డి  నిర్మించిన ఈ చిత్రంలో కథ కూడా బావుంటుంది. అయితే కథనంపై మరింత దృష్టి పెడితే ఈ సినిమా మరింతగా ఆకట్టుకునే ఉండేదోమో...! చివరగా :     థియేటర్/టివి/డివిడి ఏదో ఒకచోట ‘ఒక్కడినే’ ఒక్కసారి చూడవచ్చు.

Okkadine Review: Cast & Crew

Okkadine Movie Review, Rating | Okkadine Review | Okkadine Rating | Nara Rohit's Okkadine Telugu Movie Cast & Crew, Music, Performances te Okkadine Telugu Movie Review;Okkadine Telugu Movie Rating;Okkadine Movie Review;Okkadine Movie Rating;Nara Rohit Okkadine Movie Review, Rating;Telugu;Review;Rating;Nara Rohit;Nithya Menon;Bramhanandam;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Okkadine-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/1SASUS6M4y0

మరింత సమాచారం తెలుసుకోండి: