హీరోయిన్ పలక్ లల్వాని స్కిన్ షో , శాం కె నాయుడు సినిమాటోగ్రఫీ హీరోయిన్ పలక్ లల్వాని స్కిన్ షో , శాం కె నాయుడు సినిమాటోగ్రఫీ కథను చెప్పిన విశానం , ఒహాజనితమ్గా చాలా బోరింగ్ గా రాసుకున్న కథనం , స్లో నేరేషన్ , వీక్ డైరెక్షన్ , ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోవడం , ఎమోషనల్ గా టచ్ అవ్వలేకపోవడం , పాత్రలకి జస్టిఫికేషన్ లేకపోవడం , సాగదీసిన ఎడిటింగ్

ఒక అమ్మాయి అబ్బాయిలలో లస్ట్ మాత్రమే ఉంటుందని, ప్రేమ ఉండదని వాదిస్తే అబ్బాయి ఏమో ప్రేమలోనే లస్ట్ కూడా ఉంటుందని వాదించుకుంటూ.. లస్ట్ తో ప్రారంభమైన అభి(నాగ శౌర్య) ప్రేమకథని చెప్పడం మొదలు పెడతారు. అభి ఓ గర్ల్ ఫ్రెండ్ ని పట్టాలని ట్రై చేస్తుంటాడు. అందులో భాగంగానే సమంత అనే పేరున్న ఓ అమ్మాయితో ఫేసు బుక్ చాట్ మొదలు పెడతాడు. అదలా సాగుతున్న టైంలో ప్రార్ధన(పలక్ లల్వాల్)ని చూసి ఇష్టపడతాడు. అనుకున్నట్టుగానే పడేస్తాడు. అభి ప్రేమలో మునిగిపోయిన ప్రార్ధన అభి కోరిక తీర్చడం కోసం తన సర్వస్వాన్ని తనకి అర్పిస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాతే కథలో ట్విస్ట్.. ప్రార్ధన అభిని వదిలి వేస్తుంది. అలా వదిలి వెళ్ళిపోయిన ప్రార్ధన ప్రేమని దక్కించుకోవడం కోసం అభి ఏమేమి చేసాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ.  

హీరో నాగ శౌర్య మొదటి మూడు సినిమాల్లో బాగానే చేసాడు, చివరికి ఫ్లాప్ అయిన జాదూగాడులో కూడా బాగా చేసాడు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి నటనని కనబరచలేదు. బాగా చేసాడు అని చెప్పుకునే సీన్స్ ఓ రెండు మూడు ఉంటాయి. చాలా సీన్స్ లో అవసరానికి మించిన ఓవరాక్షన్ చేసి చిరాకు పెడతాడు. కొన్ని సార్లిన్తే డంబ్ ఫేస్ పెట్టేసాడు. ఎవరన్నా నటుడిగా రోజు రోజుకీ డెవలప్ అవ్వలనుకుంటాడు కానీ నాగ శౌర్య మాత్రం తనని తానె చిన్నగా చేసుకునేలా సినిమాలు చేస్తున్నాడు. ఇక హీరోయిన్ గా పరిచయం అయిన పలక్ లల్వాని మొదై సినిమా అయినా అల్ట్రా మోడరన్ గా కనిపించడంలో, విపరీతమైన స్కిన్ షో చూపించే విషయంలో, లిప్ కిస్ ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందాలు ఆరబోసింది. అలాగే తనకిచ్చిన పాత్రలో కూడా హీరో కంటే బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇకపోతే రావు రమేష్ ఫుల్ నెగటివ్ షేడ్స్ కట్ చేస్తే సడన్ గా క్రేజీగా మారిపోతాడు. పాత్ర పరంగా బాగా చేసాడు.


ఇక మౌనరాగం ఫేం మోహన్ కి సినిమాలో పెద్ద స్కోప్ లేదు, ఏదో ఓ పాత్ర ఉంది అని చెప్పుకోవడం తప్ప సినిమాకి కూడా పెద్ద ఉపయోగం లేదు. ఇకపోతే తులసి, ప్రగాతిలు పరవలేదనిపించారు. లాస్య, బ్రహ్మానందం, శకలక శంకర్, మధు లాంటి వారు ఒకటి అరా సీన్స్ లో కనిపిస్తారు కాబట్టి వారు ఉన్నా లేనట్టే. నటీనటులు ఎలా చేసారు అనేది చెప్పాను. కానీ వీరి పాత్రలు ఎలా ఉన్నాయంటే... ఒక్క పాత్రకి ఇది వీరి క్యారెక్టరైజేషణ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాయి.    

నూతన సంవత్సరం పెట్టింది అని అందరూ అనందంలో ఉన్నారు.. ఇలాంటి సమయంలో సినిమా బాలేదని చెబుతూ రాయడం కాస్త బాధాకరమైన విషయం.. ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమా చాలా విభాగాల్లో ఫెయిల్ అవ్వడానికి కారణం దర్శకుడు రమేష్ వర్మ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాని మొదలు పెట్టిన చాలా రోజుల వరకూ సినిమా షూట్ చేయలేదు, అలాగే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ కూడా చాలా రోజులే గడిచింది. ఈ గ్యాప్ లో తను అనుకున్న స్టొరీ లైన్ కాస్తా సినిమా పూర్తి కథ అయ్యే టైంకి చాలా మారిపోయింది. ఆ తర్వాత కథనం మరియు టేకింగ్ విషయానికి వచ్చే సరికి ఓ క్లారిటీ లేని సొల్లు కథగా మారిపోయింది.


కథా పరంగా మనకు ఎక్కడా నచ్చేలా ఉండదు. కథని డెవలప్ చేసిన విధానం బాలేదు, ఆ కథను చెప్పడానికి రాసుకున్న కథనం ఇంకా బోరింగ్ గా ఉంది. ఎంతలా అంటే ఇంకెప్పుడు ఇంటర్వల్ ఎస్తారు, ఇక ఈ సినిమా అయిపోదా అంటూ ఆడియన్స్ క్లైమాక్స్ కోసం ఎదురు చూసేంత నీరసంగా సినిమా తయారైంది.


ఇక దర్శకత్వం పరంగా కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అంతే కాకుండా తను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ రియల్ లైఫ్ లో ఏం చేయలేకపోతున్నాం, సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం అనే పాయింట్ బాగుంది కానీ దాన్ని ప్రెజంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కనీసం పాత్రలకి ఓ సరైన క్యారెక్టర్ రాసుకోవడం లో కూడా ఫెయిల్ అయ్యాడు. కొన్ని పాత్రలు ఎందుకలా బిహేవ్ చేస్తున్నాయి అనేది కూడా అర్థం కాదు. రమేష్ వర్మ డైలాగ్స్ కూడా కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పలేకపోయాయి.


ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే రమేష్ వర్మ యాడ్ ఫిల్మ్ మేకర్ కావడం వలన ప్రతి ఫ్రేం అందంగా ఉండేలా చూసుకున్నాడు. అంతకన్నా అందంగా శాం కె నాయుడు పిక్చారైజ్ చేసాడు. సూపర్బ్ విజువల్స్. ఇక ఇళయరాజా అందించిన మ్యూజిక్ మెలోడియస్ గా బాగానే ఉంది. కానీ ఆ ట్యూన్స్, నేపధ్య సంగీతం ఇదివరకు ఆయన సినిమాల్లోనే ఎక్కడో విన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇకపోతే బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ బాగుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఏ మాత్రం బాలేదు. సినిమాని దర్శకుడే సాగదీస్తున్నాడు అంటే ఎడిటింగ్ లో అస్సలు ఎక్కడా కట్ చేయకుండా ఇంకా సాగదీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.    

ప్రతి ఏడాది ఓ మంచి కాన్సెప్ట్ తో స్టొరీ రాయడం మొదలు పెట్టి ఆ కథని సరిగా రాసుకోలేక, దానిని సరిగా తీయలేక దర్శకులు భారిగా ఫెయిల్ అయ్యి సినిమాని డిజాస్టర్ గా మారుస్తుంటారు. అదే తరహాలో మంచి కాన్సెప్ట్ కానీ తీయలేకపోయిన 2016 మొదటి సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. సినిమాకి వెళ్ళిన ఎంజాయ్ చేయదగినట్లుగా ఇందులో ఏమీ లేవు. అందుకే నేను ఒకటే చెబుతున్నాను.. న్యూ ఇయర్ రోజున మంచిగా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూద్దాం అనుకునే వారు ఈ సినిమా పరిసర ప్రాంతాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది.         

Naga Shourya,Palak Lalwani,Ramesh Varma,Ilaiyarajaఅబ్బాయితో అమ్మాయి - న్యూ ఇయర్ డిజాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: