వీరప్పన్ ఎపిసోడ్స్ , శివరాజ్ కుమార్ , సందీప్ భరద్వాజ్ నటన , లొకేషన్స్ అండ్ విజువల్స్ , వీరప్పన్ , పోలీస్ ఆటాక్ సీన్స్వీరప్పన్ ఎపిసోడ్స్ , శివరాజ్ కుమార్ , సందీప్ భరద్వాజ్ నటన , లొకేషన్స్ అండ్ విజువల్స్ , వీరప్పన్ , పోలీస్ ఆటాక్ సీన్స్సింపుల్ స్టొరీ ప్లాట్ , ఇంకా ఎంగేజింగ్ గా ఉండాల్సిన కథనం , నేరేషన్ స్లోగా ఉండడం , బోరింగ్ సెకండాఫ్ , ఎడిటింగ్ , చాలా లాజిక్స్ ని వదిలేయడం , బేస్ లెస్ పరుల్ యాదవ్ పాత్ర

మూడు రాష్ట్రాల పోలీసుల్ని, ప్రజల్ని గడగడలాడించిన వీరప్పన్ ని పట్టుకోలేక చంపడం కోసం పోలీసులు వేసిన కకూన్ మిషన్ ఏంటి? దాన్ని ఎవరు ఎలా డీల్ చేసారు అనేదే సినిమా కథ.. సినిమాలో చెప్పిన కథా విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అండ్ టీం ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నప్పుడు అతని సబార్డినేట్ అయిన ఎస్.పి (శివరాజ్ కుమార్) ఓ ప్లాన్ చెప్తాడు. మన ఆఫీసర్స్ అందరూ వీరప్పన్(సందీప్ భరద్వాజ్) ప్రాంతమైన ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ చనిపోతున్నారు. కాబట్టి అతని ప్లేస్ లో మనం ఏమీ చేయలేం, అందుకే అతన్ని మనం బయటకి తీసుకు రాగలిగితే ఈజీగా చంపేయచ్చు అనే ఆలోచనతో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ కోసం ఎన్.పి ఎవరెవర్ని వాడుకున్నాడు? ఫైనల్ గా ఎలా వీరప్పన్ ని అడవి నుంచి బయటకి తీసుకు వచ్చి, ఎలా అతన్ని చంపాడు అన్నదే సినిమా కథ. సినిమాలో వీరప్పన్ ని చంపిన్ మిషన్ ని మాత్రమే చూపడం వలన 'కిల్లింగ్ వీరప్పన్' అని టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చాడు.   

శివరాజ్ కుమార్ ఈ సినిమాలో రియల్ లైఫ్ లో చేసిన కన్నన్ పాత్రలో కనిపించాడు. కానీ అది సినిమాలో రివీల్ చేయలేదు. అది పక్కన పెడితే.. టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా శివరాజ్ కుమార్ చాలా బాగా చేసాడు. చాలా వరకూ డైలాగ్స్ తో కాకుండా హావ భావాలతో సీన్ ని డీల్ చేసిన విధానం బాగుంది. శివరాజ్ కుమార్ కి పర్సనల్ గా కూడా వీరప్పన్ తో సమస్య ఉంది. అందుకే ఆన్ స్క్రీన్ ఆ ఫేస్ లో ఆ కసి కనిపించినట్లు అనిపించింది. ఇక వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్ రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రియల్ గా వీరప్పన్ ఇలానే బిహేవ్ చేసేవాడేమో అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసాడు. ముత్తులక్ష్మీ పాత్రలో యజ్ఞ శెట్టి, సీక్రెట్ ఇన్ఫార్మర్ పాత్రలో పరుల్ యాదవ్ లు మంచి నటనని కనబరిచారు. మిగతా పాత్రల్లో కనిపించిన వారంతా కన్నడ వారే.. వారు వారు వారి పాత్రల్లో బాగానే చేసారు. 

కిల్లింగ్ వీరప్పన్ సినిమా మొదలు పెట్టెటప్పుడే 'నాకు తెలిసిన నిజం ఇదే అని' చెబుతూ ఈ సినిమాని మొదలు పెట్టాడు.. వర్మ చేసిన మొదటి మిస్టేక్.. కిల్లింగ్ వీరప్పన్ కథలో వీరప్పన్ గురించి చెబుతున్నామని చెప్పి చివరికి కన్నన్ పాయింట్ తరహాలో సినిమాని డీల్ చేయడం ఎక్కడో సినిమాకి సింక్ అవ్వనీయకుండా చేస్తూ ఉంటుంది.రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి గురించి ఆయన యనగిల్ లోనే సినిమాని చూపించారు అందుకే ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమాలో ఆ ఫ్లేవర్ ని మిస్ చేసాడు వర్మ అందుకే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఏదో మిస్ అవుతూ ఉంటారు. వర్మ కథా పరంగా కూడా వీరప్పన్ గురించి ఎక్కువగా చెప్పడానికి ట్రై చేయలేదు.. పోలీసులు ఎందుకు అంట స్ట్రాంగ్ గా వీరప్పన్ ని చంపాలి అనుకుంటున్నారు అనే దానికోసం ఓ మూడు, నాలుగు సీన్స్ చూపారు తప్ప ఎక్కడా వీరప్పన్ పాత్రని బలంగా చూపడానికి ట్రై చేయలేదు. వీరప్పన్ పాత్రని బలంగా ట్రై చేయకపోవడమే కాకుండా సెకండాఫ్ లో ఆ పాత్రలోని పవర్ ని మరింత తక్కువచేసి చూపించారు. ముఖ్యంగా తనకి ఎవ్వరి సపోర్ట్ లేదని చూపడం, ఎవరో సపోర్ట్ కోసం వీరప్పన్ తెగ ఆరాటపడుతున్నట్లుగా చూపడం, అలాగే పొగడ్తలకి పడిపోవడం లాంటి అంశాలు వీరప్పన్ పాత్రని మరింత తగ్గించినట్టు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో అన్నా పరవాలేదు కాస్త వీరప్పన్ కనిపిస్తాడు.. సెకండాఫ్ లో అయితే పూర్తిగా పోలీస్ పాయింట్ లోనే ఉంటుంది.. వీరప్పన్ పాత్రని డమ్మీ చేసేసారు. అందుకే సెకండాఫ్ పెద్దగా ఆడియన్స్ కి ఎక్కదు. ప్రతివిషయంలోనూ సమాచారం తెలుసుకునే వీరప్పన్ తనని మోసం చేస్తున్న విషయాన్ని మాత్రం పసిగట్టలేక పోవడం, అలాగే సమాచారం లేకపోవడం సిల్లీగా అనిపిస్తుంది. కథనం విషయంలో వర్మ ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే సినిమాలో బోరింగ్ పార్ట్ చాలా ఉంది. మెయిన్ గా సెకండాఫ్ ని మరీ సాగాదీసేసారు. ఇక డైరెక్టర్ గా తను అనుకున్నదే చెప్పాడు కానీ వీరప్పన్ పరంగా చాలా మిస్ చేసేసాడు. ఫైనల్ గా చూసుకుంటే.. వర్మ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలకంటే ఈ సినిమా చాలా బెటర్ గా అనిపిస్తుంది. కానీ తన స్టాండర్డ్స్ కి ఒక 50% మాత్రమే సరిపోయే సినిమా ఇది. లాజికల్ గా చూసుకుంటే.. పరుల్ యాదవ్ ని ప్రత్యేకంగా ఎందుకు పోలీసులు టార్గెట్ చేసి ముత్తు లక్ష్మి దగ్గరికి పంపుతారు, అసలు శివరాజ్ కుమార్ వీరప్పన్ ని చంపడం కోసం ఎందుకు అంట క్రూరంగా పరవర్తిస్తాడు, చేతికి చిక్కిన వీరప్పన్ ని మిస్ చేసుకోవడంలో పోలీస్ లు అస్సలు తెలివి లేకుండా బిహేవ్ చేయడం మొదలైన సీన్స్ ఉన్నాయి.  


రమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని ఫారెస్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా షూట్ చేసాడు. ఇక రవిశంకర్, రాజశేఖర్, మున్నా కాశీ, సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన పాటలు ఏవీ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అలాగే సాండీ ఇచ్చిన నేపధ్య సంగీతంలో వీరప్పన్ కి ఇచ్చిన ట్యూన్స్ మాత్రం బాగున్నాయి, మిగతా అంటా ఏదో ఉంది అంటే ఉందీ అన్న రీతిలో ఉన్నాయి. రఘు కులకర్ణి ఆర్ట్ ఓకే. అన్వర్ అలీ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండాఫ్ ని మాత్రం బాగా సాగాదీసేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ అనేలా ఉన్నాయి.


రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ స్టొరీతో చేసిన రక్త చరిత్ర సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత వీరప్పన్ మీద చేసిన సినిమా కావడం వలన అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే కథకి పర్ఫెక్ట్ అనిపించే నటీనటులను సెలక్ట్ చేసాడు.. వారు కూడా పెర్ఫార్మన్స్ ఇరక్కొట్టేసారు.. అంతవరకూ బాగానే ఉంది. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ వీరప్పన్ గురించి చెప్పడం మానేసి ఒక పోలీస్ యాంగిల్ లో ఎప్పుడు కథని చెప్పాడో అప్పుడే సినిమాకి చిన్న దెబ్బ పడింది. అయినా వీరప్పన్ ఎపిసోడ్స్ వలన ఫస్ట్ హాఫ్ బాగా ఉండనే ఫీలింగ్ కట్ చేస్తే సెకండాఫ్ లో ఆ ఫీలింగ్ ని బాగా తగ్గించేసి, వీరప్పన్ జీరో చేసేసి చంపడం అనేది స్టార్టింగ్ లో చూపించిన దానికి మాచింగ్ కాలేదు. ఆ విషయంలో ఆడియన్స్ కాస్త నిరుత్సాహ పడతారు. వర్మ ఓ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథని సరిగా చెప్పలేకపోయాడు.  సినిమాని ఫైనల్ గా చూసుకుంటే కొన్ని ఎపిసోడ్స్ వలన సినిమా చూడచ్చు అనిపిస్తుంది. వర్మ అభిమానులు, వర్మ టేకింగ్ నచ్చే వారు చూడదగిన బొమ్మే 'కిల్లింగ్ వీరప్పన్'. 

Shiva Rajkumar,Sandeep Bharadwaj,Yagna Shetty,Sanchari Vijay,Ram Gopal Varma,B. V. Manjunath,B. S. Sudhindra,E. Shivaprakash,Ravi Shankarకిల్లింగ్ వీరప్పన్ - వర్మ ఫాన్స్ కోసమే ఈ 'వీరప్పన్'

మరింత సమాచారం తెలుసుకోండి: