వీనుల విందుగా అనిపించే లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ , బ్రహ్మానందం , ప్రభాస్ శ్రీనుల కామెడీ ట్రాక్ , సాంగ్స్ పిక్చరైజేషన్స్ వీనుల విందుగా అనిపించే లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ , బ్రహ్మానందం , ప్రభాస్ శ్రీనుల కామెడీ ట్రాక్ , సాంగ్స్ పిక్చరైజేషన్స్పాత పార్ములా కథకి వెలిసిపోయే కొత్త రంగులు వేయడం , సెట్ కాని టిపికల్ కథనం , ఎంటర్టైన్మెంట్ లేని నేరేషన్ , నో ఎమోషన్స్ , నో సెంటిమెంట్ , కామెడీ లేనే లేదు బాబయ్యా , ఎడిటింగ్ , పరమ బోరింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండాఫ్

ఆ కృష్ణుడు పుట్టిన రోజునే మన హీరో కూడా పుట్టడం వలన మన హీరో పేరు కూడా కృష్ణ(సునీల్). కృష్ణని చిన్న వయసులోనే అమెరికాకి పంపేసి అక్కడే ఉండేలా చూస్తారు.  పెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ ఇండియా అన్నా అక్కడి సాంప్రదాయాలన్నా, మానవతా విలువలు ఉన్న మనుషులన్నా కృష్ణకి  చాలా ఇష్టం. తానెప్పుడు ఇండియా వెళ్లకపోయినా ఎప్పుడు ఇండియా గుర్తించి గ్రేట్ గా చెప్తుంటాడు. 'ఎదుటి వారి ముఖంలో సంతోషం చూడటానికి ఎంత దూరం అన్నా వెళ్ళడానికి సిద్ధపడే' మనస్తత్వం. కృష్ణకి అమెరికా అమ్మాయిని, అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇష్టం ఉండదు. అందుకే అమ్మాయి వేటలో భాగంగా ఇండియా బయలుదేరతాడు. ఆ జర్నీలో చూసిన ఎన్నారై ఇండియన్ గర్ల్ పల్లవి(నిక్కీ గాల్రాని)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరు లవర్స్ అవుతారు. అదే జర్నీలో పరిచయం అయిన అజయ్ కుమార్(అజయ్) కి ఉన్న సమస్యని పరిష్కరించడం కోసం అజయ్ ప్లేస్ లో కృష్ణ నాగలపల్లి అశుతోష్ రానా వాళ్ళ ఇంటికి  వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కొంతమంది కృష్ణని చంపడానికి ట్రై చేస్తుంటారు? అసలు అజయ్ పనిమీద వచ్చిన కృష్ణని ఎవరు, ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ నాగలపల్లికి కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి? ఇన్ని రోజులు వాళ్ళ ఫామిలీ కృష్ణ అమెరికాలోనే ఉండి పోవడానికి గల కారణం ఎంటనే విషయాలు మీరు వెండితెరపై చూసి తెలులుకోవాలి.

తెరపై కనిపించే వారిలో హీరోనే కింగ్ అంటారు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా.. సునీల్ హీరోగా కనిపించాడు. సునీల్ ఈ మధ్య 6 ప్యాక్ చేసినా ఆయన నుంచి ప్రేక్షకులు కామెడీని ఆశిస్తారు కానీ ఆయన మాత్రం ఇందులో కామెడీ చేసి నవ్వించింది ఏమీ లేదు. సందర్భానుసారంగానే కామెడీ రావాలని కామెడీ యాంగిల్ లో సునీల్ ని వాడుకోలేదు. సునీల్ ని పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించడం కోసమే కామెడీని తగ్గించారు. మరి ఆ యాక్షన్ పార్ట్ ఎలా ఉందనే విషయానికి వస్తే యాక్షన్ పార్ట్స్ లో కొన్ని కొన్ని షాట్స్, పోస్టర్స్ అదిరాయి కానీ కొన్ని సునీల్ ఇమేజ్ కి అవి అస్సలు సెట్ అవ్వలేదు. అదీ కాక ఒక యాక్షన్ హీరోలో ఉండాల్సిన ఆ ఇంటెన్స్ అనేది సునీల్ లో అంతగా కనిపించలేదు. పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పేలవంగా చెప్పాడు. అలాగే గడ్డంతో మాస్ అండ్ రఫ్ లుక్ తీసుకువద్దాం అని ట్రై చేసినా చూడటానికి అది బాలేకపోగా  వయసోచ్చేసిన పర్సన్ లా కనపడ్డాడు. సినిమా మొత్తంగా చూసుకుంటే సునీల్ పాటల్లో డాన్సులు బాగావేసాడు తప్ప మిగతా ఎక్కడా మెప్పించలేకపోయాడు. నిక్కీ గాల్రాని చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉండి, సీన్స్ మరియు పాటల్లో మోడరన్ ఎన్నారై లుక్ లో కనిపించి గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. నటన పరంగా చెప్పుకోదగిన పాత్ర కాదు, కానీ బాగానే చేసింది. డింపుల్ చోపడే పల్లెటూరి అమ్మాయిలా బాగా చేసింది. అలాగే పైకి అమాయకురాలిగా, లోపలేమో రెబల్ కాండిడేట్ ఫీలింగ్స్ ఉన్న అమ్మాయిగా కాసింత నవ్వించింది కూడాను. బ్రహ్మానందం సెల్ఫీ బల్ఫీగా ప్రభాస్ శ్రీనుతో కలిసి చేసిన సీన్స్ బాగా నవ్విస్తాయి. ముఖేష్ రుషి, అసుతోష్ రానాలు తమ పాత్రల్లో ఎమోషన్స్ ని బాగానే పలికించారు. ఫామిలీ బ్యాక్ డ్రాప్ ఎమోషన్స్ ని పండించడంలో పవిత్ర లోకేష్, తులసిలు ఓకే ఓకే అనిపించుకున్నారు. సప్తగిరి, పోసాని కృష్ణ మురళి లాంటి కమెడియన్స్ పెద్దగా నవ్వించలేకపోయారు. అజయ్, పృధ్వీరాజ్, హర్షలు ఓకే ఓకే అనిపించారు.    

కృష్ణాష్టమి అనే సినిమా చూడడం మొదలు పెట్టిన తర్వాత నుంచి ఫినిష్ అయ్యేలోపు మొదట మీకు గుర్తొచ్చే సినిమాల వివరాల్లోకి వెళితే.. బావగారు బాగున్నారా, మస్కా, సంతోషం, జిల్, బృందావనం, జయం మనదేరా, తులసి, ఎవడి గోల వారిది మొదలైన సినిమాలు గుర్తొస్తాయి. ఒక ఎన్నారై ఇండియాకి రావడం దారిలో అమ్మాయిని ప్రేమించడం ఆ తర్వాత తనకి ఒక సమస్య పరిష్కారం అన్నీ చక చకా జరిగిపోతాయి. ఈ కథని ఎంత సిల్లీగా, ఎంత వరస్ట్ గా తీయగలరో అంట వరస్ట్ గా తీసారు. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అనే అంశాలను రీసెంట్ టైమ్స్ లో ఇంత సిల్లీగా, ఇర్రిటేషన్ వచ్చేలా తీయడం ఈ సినిమాకే దక్కింది.


కృష్ణాష్టమి... ఈ పేరు వినడానికి, చూడటానికి చాలా సాంప్రదాయబద్దంగా ఉంది. అదే రీతిలో తెలుగు సినిమా పాత సాంప్రదాయాన్ని ఫాలో అయిన డైరెక్టర్ వాసు వర్మ.. ఎలా అంటే కథ కోసం కొత్త పుంతలు తొక్కకుండా ఎలాంటి రిస్కు చేయకుండా గతంలో మన తెలుగులో చాలా సినిమాల్లో వచ్చి హిట్ అయిన ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీని ఎంచుకున్నాడు. పాత చింతకాయ పచ్చడి కన్నా పాతదైన కథని తీసుకొని దానికి పలు రకాల రంగులు వేసి కొత్త వైన్ బాటిల్ లో పెట్టి అందించాలని అనుకున్నాడు. కానీ వాసు వర్మ వేసిన రంగులన్నీ తెరపైన వెలిసిపోయేలా ఉండడంతో ఈ కథ ప్రేక్షకులకి రొటీన్ కంటే పరమ రొటీన్ అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. నిర్మాత దిల్ రాజు కూడా కథ పాతదే కానీ కథనం చాలా కొత్తగా రాసాము అన్నాడు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీరు ఏ కథనం అయితే హెల్ప్ అవుతుంది అనుకున్నారో అదే బోల్తా కొట్టించింది. దానికి తోడు ఎన్నో సార్లు ట్రిమ్ చేసి, 140 నిమిషాలకే సినిమాని కుదించినా లెంగ్తీగానే అనిపిస్తుంది. దీనివలన నేరేషన్ అంత ఫాస్ట్ గా ఉండదు. ఎదో సాగాలి కాబట్టి సాగుతూ ఉంటుంది. అలా వాసు వర్మ ఎంచుకున్న కథ - కథనం - నేరేషన్ డిజాస్టర్ అయ్యాయి. ఇక వాసువర్మ దర్శకత్వ ప్రతిభ విషయానికి వస్తే.. కృష్ణాష్టమి అనేది ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇలాంటి తరహా సినిమాలో కొన్ని సెంటిమెంట్ ట్విస్ట్ లు, ఎమోషనల్ సీన్స్ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయి. కానీ ఇందులో అవేమీలేవు. మెయిన్ గా ఎమోషనల్ గా సినిమాలో కనెక్ట్ అయ్యే పాయింట్ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. చివరికి డైరెక్టర్ ఎవరిని ఎలా వాడుకోవాలో కూడా తెలియక తడబడ్డాడు. కథ అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని రాసారు, దాన్ని సునీల్ తో చేస్తున్నప్పుడు మార్పులు చేయాలి, కానీ చేసిన మార్పులు సునీల్ కి అస్సలు సెట్ కాలేదు. డైరెక్టర్ వాసువర్మ కొత్తదనం వైపు వెళ్ళకుండా సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేసాడు. కానీ కథ మరీ పాతది, దానికి రాసుకున్న టిపికల్ స్క్రీన్ ప్లే కూడా హెల్ప్ కానందువల్ల డైరెక్టర్ గా మరోసారి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సునీల్ తో నవ్వించలేకపోవడం., ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలో ఎమోషనల్ ఫీలింగ్స్ ని కనెక్ట్ చేయలేకపోవడం మరియు రాసుకున్న హీరో పాత్ర సునీల్ సెట్ కాకపోవడం లాంటి మెయిన్ కీ పాయింట్స్ ని డైరెక్టర్ గా వదిలేయడం వాసువర్మ చేసిన పెద్ద తప్పు..  


మిగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. చోటా కె నాయుడు విజువల్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి మెయిన్ మేజర్ హైలైట్. చోటా కె నాయుడు అబ్రాడ్ లో షూట్ చేసిన ప్రతి విజువల్స్ కన్నుల విందుగా ఉంటుంది. అలాగే.. పల్లెటూరి నేపధ్యాన్ని కూడా బాగా చూపాడు. కొత్త వాడైన మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు బాగున్నాయి, వాటి పిక్చరైజేషన్ బహు బాగుంది. వాటికంటే మించేలా నేపధ్య సంగీతం ఇచ్చాడు. గౌతంరాజు ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కత్తెరకి పని పెట్టాల్సింది. ఆ 140నిమిషాల నిడివిని 120కి తీసుకు రావాల్సింది. ఎస్ రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. అనల్ అరసు - వెంకట్ లు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా  చేసాడు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సినిమా మెడ నమ్మకంతో భీభత్సంగా కర్చు పెట్టి అబ్రాడ్ లో సినిమా చేసారు. ఆ ప్రొడక్షన్ విలువలే కాస్తో కూస్తో ఆడియన్స్ ని కూర్చో బెట్ట గలిగాయి.. కానీ ఈ సినిమా వలన దిల్ రాజుకి, ఆయన బ్యానర్ కి ఉన్న ఇమేజ్ మొత్తం తన చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఎందుకంటే ఇంత నాశిరకం కథతో సినిమా చేస్తాడని ఆశించరు. కెరీర్ మొదట్లో దిల్ రాజు కొత్త రకం సినిమాలతో మెప్పించాడు. కానీ ఇప్పుడేమో అందరు కొత్త తరహా సినిమాలు ట్రై చేస్తుంటే ఇతనేమో కమర్షియాలిటీ అనే పిచ్చిలో నానా చెత్త సినిమాలు చేసి ఇమేజ్ ని చెడగొట్టుకుంటున్నాడు.


అనగనగా అనగనగా తెలుగు చలన చిత్ర సీమలో వచ్చిన, అప్పటి నుంచి వస్తూనే ఉన్న ఓ సక్సెస్ఫుల్ ఫార్ములా కథని యాజిటీజ్ గా తీసుకొని దానికి చిన్న కలరింగ్ ఇచ్చి చేసిన సినిమానే 'కృష్ణాష్టమి'. ఫ్లాప్స్ లో ఉన్న సునీల్ ఇమేజ్ ని ఇంకా నాశనం చేయడమే కాకుండా మరో డిజాస్టర్ ని ఇచ్చిన సినిమా. ఫామిలీ, లవ్, కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా ఏ పరంగా చూసుకున్నా జీరో అనేలా ఉన్న సినిమా కృష్ణాష్టమి. ఈ మధ్య కాలంలో సక్సెస్ఫుల్ ఫామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ అడ్డాల లాంటి వారికి ఈ కథని ఇచ్చినా హిట్ అయ్యేలా ఈ సినిమాని తీయలేరు. మీ జేబులోని డబ్బు పెట్టి 2 గంటల 20 నిమిషాల పాటు మీ విలువైన సమయాన్ని వెచ్చించే సినిమా కాదిది. మీరేదో కాసేపు ఎంటర్టైన్ అవ్వాలని సినిమాకి వెళ్తారు కానీ ఇదేంది ఇలా ఉందని మిమ్మల్ని ఇర్రిటేట్ చేసే సినిమాగా ఇది తయారవుతుంది. కావున ఈ సినిమా దరిదాపులకి కూడా వెళ్ళద్దు.

Sunil,Nikki Galrani,Dimple Chopade,Vasu Varma,Dil Raju,Dineshకృష్ణాష్టమి - బిగ్గెస్ట్ డామేజ్ ఫర్ సునీల్ అండ్ దిల్ రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: