మెయిన్ స్టొరీ లైన్మెయిన్ స్టొరీ లైన్మిగతా అన్నీ తెరపై నరకాన్నే చూపిస్తాయి మీకు.

దేశంలోని అన్ని బ్యాంక్స్ లో అనాధగా పడి ఉన్న అన్ క్లైమ్డ్ అకౌంట్స్ లోని కొన్ని కోటానుకోట్ల డబ్బుని కొట్టేయాలని ప్లాన్ చేస్తారు అజయ్ అండ్ గ్రూప్. కానీ ఆపని చేయడానికి వాళ్ళకి కొన్ని డీటైల్స్ అండ్ సమస్య రాణి బ్యాంకు ఏదన్నా ఉండాలి. దాని ప్రకారమే ప్లాన్ చేసి జనత బ్యాంకు ని టార్గెట్ చేస్తారు. కట్ చేస్తే మన హీరో నవీన్ (నవీన్ చంద్ర) అదే బ్యాంకు లో హెల్ప్ ఇన్చార్జ్ గా పనిచేస్తుంటాడు. అదే ఆఫీస్ లో మెయిన్ పోస్ట్ లో పనిచేస్తుంటుంది దేవి(లావణ్య త్రిపాటి). దాంతో డబ్బు ఆశ చూపి అజయ్ అండ్ టీం  అన్ క్లైమ్డ్ అకౌంట్స్ లిస్టు కోసం నవీన్ ని అప్రోచ్ అవుతారు. పలు కారణాల వల్ల నవీన్ కూడా ఓకే చెప్తాడు. అలా డీల్ ఓకే చేసిన తర్వాత అనుకున్న డీల్ ని ఫినిష్ చేయడానికి నవీన్ ఏమేమి చేసాడు? మధ్యలో లావణ్య నవీన్ ని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? ఇన్నింటి నడుమ అజయ్ టీంతో కలిసి నవీన్ ఆ డబ్బుని కొట్టేసాడా లేదా? అసలీ అనాధ డబ్బు కాన్సెప్ట్? ఏంటనేదే అసలు కథ.

నటీనటుల పరంగా ఈ సినిమా ఒక్కరు కూడా కనీస బాధ్యతగా ఒక 40% నటనని కూడా కనబరచలేదు. ఆ విషయంలో పూర్తిగా వారిని కూడా ఏమీ అనలేం ఎందుకు అంటే.. ఏ ఒక్కరి పాత్ర సరిగా లేదు, ఏ ఒక్కరి పాత్ర ఇలా ఉండాలి అని రాసుకోలేదు. ఏదో పాత్రలు ఉన్నాయి అంటే ఉన్నాయి అనేలా రాసేసారు. నవీన్ చంద్రకి ఆ పాత్ర అస్సలు సెట్ అవ్వలేదు. తన పాత్ర, నటన సినిమాకి హెల్ప్ అవ్వదు. ఇక వరుసగా రెండు హిట్స్ అందుకున్న లావణ్యకి ఈ సినిమా మళ్ళీ ఫెయిల్యూర్ ని ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. కథ అంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంది కానీ తనకి మాత్రం సరైన పాత్ర లేదు. కావున తన వంతుగా చాలా బెటర్ గా ట్రై చేసినా పాత్రలో దెప్థ్ లేకపోవడం వలన తేలిపోయింది. ఇక జయప్రకాశ్ నారాయణ్ పాత్ర బాగా నవ్విస్తుందని ఫీల్ అయ్యారు కానీ ఆ సినిమా అందరికీ చ్చిరాకు తెప్పిస్తుంది. ఇక చిన్న చిన్న అపాత్రాల్లో కనిపించిన అజయ్, సంపూర్నేష్ బాబు, బ్రహ్మాజీ, భద్రం, నరసరాజ్, భాను శ్రీ ఇలా ఎవ్వరూ మెప్పించేలేకపోయారు.

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' సినిమా టెక్నికల్ టీం పరంగానే కాకుండా ఓవరాల్ కూడా లెక్క తప్పి ప్రేక్షకులకు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అని చెప్పుకొని జగదీశ్ తలసిల ఈ సినిమా చేసాడు. అక్కడి దాగా బాగ్గానే ఉంది. అలాగే సినిమా అనుకున్నాక బాగా వెతికి కష్టపడి తెలుగు వారికి కొత్తగా అనిపించే స్టొరీ లైన్ ని ఎంచుకున్నాడు. అక్కడి వరకూ శభాస్ అనాలి. కానీ ఆ తర్వాత నుంచి తను ఎంచుకున్న ప్రతీదాన్ని తప్పుగానే ఎంచుకున్నాడు. స్టొరీ లైన్ కోసం ఎంచుకున్న పాత్రల్లో అస్సలు డెప్త్ లేదు, క్లారిటీ లేదు. చెప్పాలంటే ఈ మధ్య వస్తున్న సీరియల్స్ లో మేలు చాలా మంచి పాత్రలు ఉంటున్నాయి.

ఇకపోతే పూర్తి కథ అయితే దారునాతి దారుణంగా ఉంది. ఒక మంచి లైన్ ని ఎంత వరస్ట్ గా డెవలప్ చేయచ్చో చెప్పే సినిమా కథే ఇది. ఇక దానికి రాసుకున్న కథనంలో ఒక్క థ్రిల్ లేదు, ఒక్క ఆసక్తికర సన్నివేశం లేదు. అలాగే నేరేషన్ అయితే సంవత్సరం అయినా ఒక్క ఇంచ్ కూడా ముందుకు కదలకపోతే ఎలా ఉంటుందో అంత స్లోగా ఉంటుంది. ఇక డైరెక్టర్ గా అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక్కటంటే ఒక్క సీన్ ని కూడా పర్ఫెక్ట్ గా తీయలేకపోయాడు. ఇక ఈయన్ని డైరెక్టర్ గా ఎలా సపోర్ట్ చేసాడని చెప్పాలి. ఓవరాల్ గా ఈ సినిమాని నిత్త నిలువునా హుస్సేన్ సాగర్లో ముంచేసిన ఘనత డైరెక్టర్ జగదీశ్ కే దక్కుతుంది. సినిమానే ఇలా ఉంది అంటే లాజిక్స్ అస్సలు బాలేవు.. అందులే ఆ లాజిక్ లెస్ థింగ్స్ చెప్పి మీ టైం వృధా చేయడం లేదు. 

ఇక మిగిలిన టెక్నికల్ తెమలో గుడ్డి మీద మెల్ల మేలు అనిపించేలా చేసినవి రెండే రెండు అవే ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతం.. ఈ రెండు ఓవరాల్ గా యావరేజ్ గా అనిపిస్తాయి. ఇకపోతే కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అస్సలు బాలేదు. డైలాగ్స్ బాగాలేవు. మయూఖ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.


'అందాల రాక్షసి' పెయిర్ అయిన లావణ్య త్రిపాటి - నవీన్ చంద్రల కాంబినేషన్ లో వచ్చిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అనే సినిమా సినిమా మరోసారి ఈ జంటకి అట్టర్ ఫ్లాప్ నే ఇచ్చింది. కనీసం ఆ సినిమా వీరికి గుర్తింపును అన్నా తెచ్చింది. కానీ ఈ సినిమా ఇప్పుడు వారికి ఉన్న గుర్తింపును కూడా చెడగొట్టిన సినిమా ఇది. అలాగే ఓ మంచి కాన్సెప్ట్ కి వరస్ట్ అవుట్ పుట్ వచ్చిన సినిమాల్లో దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ జగదీశ్ కి పూర్తిగా అవగాహన లేకపోవడం వలన తనకి ఇచ్చిన మొదటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకున్నాడు. లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే సినిమాకి దూరంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

Naveen Chandra,Lavanya Tripathi,Jagadish Talasila,Sai Prasad Kamineni,M. M. Keeravaniలచ్చిందేవికీ ఓ లెక్కుంది - ఓ తికమక లెక్క..

మరింత సమాచారం తెలుసుకోండి: