శ్రీకాంత్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్ , విలన్ గా వినయ్ పోటీ నటన , కిక్కిచ్చే కొన్ని సీక్వెన్స్ లు , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , అస్సలు పాటలు లేకపోవడం , లో బడ్జెట్ లో ఫిల్మ్ ఇవ్వడంశ్రీకాంత్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్ , విలన్ గా వినయ్ పోటీ నటన , కిక్కిచ్చే కొన్ని సీక్వెన్స్ లు , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , అస్సలు పాటలు లేకపోవడం , లో బడ్జెట్ లో ఫిల్మ్ ఇవ్వడంపాత స్టొరీ లైన్ , ఊహించదగిన ట్విస్ట్స్ , క్లైమాక్స్ సాగదీయడం , కొన్ని లాజిక్స్

ఇండియాలో టెర్రరిజం అటాక్స్ అనేవి రెగ్యులర్ గా జరుగుతుంటాయి. వాటిని ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, ఎక్కడో ఓ చోట బాంబ్ బ్లాస్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ బాంబు బ్లాస్ట్స్, టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమానే ఈ 'టెర్రర్'.. అసలు కథలోకి వస్తే.. డిసిపి వి.రాథోడ్(వినయ్) టెర్రరిజం అటాక్స్ నుంచి సిటీ రక్షణ కోసం ఓ స్పెషల్ టీంని సిద్దం చేస్తాడు. ఆ టీంలో మెయిన్ పర్సన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిఐ విజయ్(శ్రీకాంత్). మన విజయ్ అనుమానం ఉన్న వారి మీదంతా నిఘా వేస్తాడు. అలా ఒక టెర్రరిస్ట్ పర్సన్ తీసుకున్న స్టెప్ వలన విజయ్ కి ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ జరగనుందని, దాని వెనుక పొలిటికల్ హ్యాండ్ ఉందని తెలుస్తుంది. అక్కడి నుంచి ఆ టెర్రరిస్ట్ అటాక్ ఆపడానికి, అ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి విజయ్ ఏం చేసాడు? అన్నదే కథ.. 

నటీనటుల పరంగా ఈ సినిమాకి ప్రాణం పోసింది శ్రీకాంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. శ్రీకాంత్ తో పాటు అందరు సపోర్టింగ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే థియేటర్స్ లో ఆడియన్స్ ని కూర్చో బెట్టగలిగింది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు శ్రీకాంత్. హోం మినిస్టర్ పాత్ర చేసిన కోట శ్రీనివాసరావు బాగా చేస్తే, ఎమ్మెల్యేగా పృథ్వి మంచి సపోర్ట్ ఇచ్చాడు. శ్రీకాంత్ వైఫ్ పాత్రలో నిఖిత చాలా చిన్న పాత్రలో బాగానే చేసింది. వినయ్ డిసిపి జస్టిఫికేషన్ ఇచ్చాడు. రవి అండ్ టెర్రరిస్ట్ గ్రూప్ వారు తమ తమ పాత్రలతో మెప్పించారు.  

టెర్రర్ అనే టైటిల్ లోనే తెలుస్తోంది ఇదొక టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని.. అందులో ఏమీ కొత్తదనమో, షాకింగ్ ఎలిమేంటో లేదు.. కానీ హోప్ మరియు కలవరమాయే మదిలో లాంటి సరికొత్త మరియు వైవిధ్యమైన సినిమాలు చేసి నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ కాసెట్టి ఒక సక్సెస్ఫుల్ ఫార్మట్ ని అడాప్ట్ చేస్కొని, పోలీస్ - టెర్రరిజం - రాజకీయాల నేపధ్యంలో సినిమా చేయడం సర్ప్రైజింగ్ విషయం. కానీ ఇంత రెగ్యులర్ ఫార్మాట్ తీసుకున్న సతీష్ ఎగ్జిక్యూషన్ మాత్రం బాగా చేసాడు. కానీ మొదటి నుంచి హైడ్ లో పెట్టిన కొన్ని పాత్రలని చివర్లో తీరుకురావడం పెద్దగా కిక్ ఇవ్వలేదు. టెర్రర్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది.. కానీ మొత్తంగా చూసుకుంటే టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది, కానీ ఎక్కడా బోర్ కొట్టించకపోవడమే ఇక్కడ స్పెషాలిటీ. శ్రీకాంత్ ఒక పవర్ఫుల్ అండ్ రూడ్ బిహేవియర్ ఉన్న పోలీస్ ఆఫీసర్, చట్టానికంటే ఎక్కువగా తన గన్ వలెనే న్యాయం జరుగుతుంది అని భావించే వ్యక్తి. ఇకపోతే ఇతనికి అసిస్టెంట్ గా ఒక భయస్తుడిని ఉంచడం అనే పాయింట్ ని అబ్ తక చప్పన్, శాగ్రిడ్ సినిమాల్లో చూసేసాం. ఆ టైంలో శ్రీకాంత్ ని కిడ్నాప్ చెయ్యడం అనే పాయింట్ సినిమాకలో నాకు నచ్చని పాయింట్. ఫస్ట్ హాఫ్ తో మెప్పించిన సతీష్ సెకండాఫ్ తో ఇంకాస్త బెటర్ గా మెప్పించాడు. సెకండాఫ్ లో నా పరంగా నేను గమనించిన మిస్టేక్ సినిమాలో ట్విస్ట్ లు అన్నీ బాగా లేట్ గా రావడం. దాని వలన సినిమా ఇంకాస్త సాగాదీసారు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ కారణంగా జరిగిన మరో తప్పు సడన్ గా క్లైమాక్స్ కి వచ్చేయడం. ఇలాంటి స్క్రీన్ ప్లే వలన ఆడియన్స్ సడన్ గా ఓ చిన్న కన్ఫ్యూజన్ కి లోనవుతారు. అందుకే కొన్ని లాజిక్స్ ని కూడా మిస్ చేసారు. ఉదాహరణకి ఒక బంగ్లాదేశీ టెర్రరిస్ట్ ఒక బాంబు బ్లాస్ట్ మిషన్ మీద హైదరాబాద్ వచ్చి నాలుగేళ్ళ పాటు అందరితో కలిసిపోయి ఉంటాడు. కానీ వచ్చిన వాడు బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేయకుండా, పదవి కోసం ఓ రాజకీయ నాయకుడు తనతో చేతులు కలపడానికి సిద్దపడ్డాకే బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత డిసిపి, శ్రీకాంత్ టీం కలిసి చేసే కొన్ని పనులు బాగా సిల్లీగా అనిపిస్తాయి. 

చాలా లో బడ్జెట్ లో తీసినప్పటికీ చాలా మంచి ప్రాజెక్ట్ ని ఇచ్చాడు. నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా అందరూ వారి వారి బెస్ట్ ఇచ్చారు. ఇక్కడ సతీష్ ని మెచ్చుకోవాల్సిన మరో విషయం ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసి కూడా ఎక్కడా ఐటెం సాంగ్ లేకుండా, సాంగ్స్ లేకుండా చూసుకోవడం ఈ సినిమాకి చాలా స్పెషల్. ఈ విషయంలో ఇంత క్లియర్ కట్ గా కొన్ని రూల్స్ ని బ్రేక్ చేసి సినిమా చేసిందుకు సతీష్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. పాటలు లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సాయి కార్తీక్ సూపర్బ్ గా చేసాడు. ఇక సినిమాటోగ్రాఫర్ వాసలి శ్యాంప్రసాద్ కిసినిమా లో బడ్జెట్ అని, ఎక్కువ లొకేషన్స్ లేవు కానీ ఉన్నవాటిని ఎంత కొత్తగా చూపచ్చు ఏ యాంగిల్ లో పెడితే బాగుంటుంది అని చూస్కొని సరికొత్తగా చూపించాడు. అలాగే కలరింగ్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటర్ బసవ పైడిరెడ్డి ఎడిటింగ్ చాలా డీసెంట్ గా ఉంది. కానీ ఈయన ఎడిట్ చేసిన స్టార్టప్ బాగుంది కానీ ఎప్పుడైతే సినిమా మంచి రసపట్టులోకి వస్తుంది అని అనుకుంటామో అప్పడు మాత్రం అంత ఎఫ్ఫెక్టివ్ గా ఉండేలా ఎడిటింగ్ లేదు. లో బడ్జెట్ అయినప్పటికీ మంచి విజువల్స్ అందించింది ప్రొడక్షన్ టీం.      .

టెర్రరిజం నేపధ్యంలో వచ్చిన సినిమానే టెర్రర్, కానీ అన్ని టెర్రరిజం తరహాలో వచ్చిన సినిమాలకి దీనికి పెద్ద పోలిక ఉండదు. చెప్పాలంటే హిందీ ఫిల్మ్ అబ్ తక్ చెప్పన్ లోని హీరో పాత్రని ఇందులో హీరో పాత్ర పోలి ఉంటుంది. అంతకు మించి కథలో పోలిక లేదు. దర్శకుడు రొటీన్ లైన్ ని చాలా ఎంగేజింగ్ గా చెప్పి థియేటర్స్ లో కూర్చో బెట్టగలిగాడు. ప్రతి వారం కమర్షియల్ ఫార్మాట్ అనే ముసుగులో వచ్చే చాలా సినిమాల కంటే ఇది చాలా బెటర్ సినిమా. టెర్రర్ అనేది ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్.. అందరూ హ్యాపీగా ఈ వీకెండ్ లో చూసేయచ్చు. పొలిటికల్ క్రైమ్ థిల్లర్ ఇచ్చే వారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. 

Srikanth,Nikitha,Satish Kasetty,Shaik Mastan,Sai Kartheek టెర్రర్ - థ్రిల్ చేసే టెర్రిఫిక్ థ్రిల్లర్.

మరింత సమాచారం తెలుసుకోండి: