నాగార్జున అద్భుతమైన పెర్ఫార్మన్స్ , కార్తీ ఎనర్జిటిక్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ , ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ , గోపి సుందర్ నేపధ్య సంగీతం నాగార్జున అద్భుతమైన పెర్ఫార్మన్స్ , కార్తీ ఎనర్జిటిక్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ , ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ , గోపి సుందర్ నేపధ్య సంగీతం సెకండాఫ్ ని బాగా బోర్ కొట్టించడం , ఎమోషనల్ థ్రెడ్ లో కంటిన్యుటీ మిస్ అవ్వడం , కథకి అనవసరం అనిపించే ట్రాక్స్ ని ఇరికించడం , సాగదీసిన సెకండాఫ్ ఎడిటింగ్ , సెకండాఫ్ లో చెప్పాల్సిన రెండు కీ పాయింట్స్ ని సరిగా చెప్పలేకపోవడం , ఓవరాల్ రన్ టైం

'ఈ ప్రపంచంలో మనకు తోడుగా ఉన్నవారు ఇచ్చే ఆనందాన్ని ఎంత డబ్బైనా ఇవ్వలేందు. స్టాప్ రన్నింగ్, స్టార్ట్ లివింగ్' అని చెప్పడమే ఊపిరి.  


దేశంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో విక్రమ్ ఆదిత్య(అక్కినేని నాగార్జున) ఒకరు. హైదరాబాద్ లో అతని జీవనం.. అతని దగ్గర అన్నీ ఉన్నా ఎంజాయ్ చేయలేని పరిస్థితి అతనిది. ఎందుకంటే పెరాలసిస్(పక్షవాతం) వలన అతని వళ్ళంతా చచ్చుబడిపోయి ఉంటుంది. కేవలం మెడ పైభాగం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. డబ్బు ఎంత ఉన్నా అతనికి సంతోషాన్ని ఇచ్చేది ఏదీ తనతో ఉండదు. కట్ చేస్తే హైదరాబాద్ లో చిన్న చిన్న దొంగతనాలు గొడవలు చేసి జైలుకి వెళ్లోచ్చిన కుర్రాడే మన శీను(కార్తీ). దొంగ, జైలుకి వెళ్లోచ్చిన కారణంగా శీను మథర్(జయసుధ) తనని ఇంటి నుంచి బయటకి పంపేస్తుంది. ఇంటి నుంచి బయటకి వచ్చేసి జాబు కోసం చూస్తున్న శీను విక్రమ్ ఆదిత్య ఇంట్లో జాబ్ ఓపెనింగ్ ఉంటే వెళ్తాడు. అక్కడ విక్రమ్ ఆదిత్య పర్సనల్ కేర్ టేకర్ కోసం ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. ఊహించని రీతిలో ఆ జాబ్ శీనుకి వస్తుంది. ఇక అక్కడి నుంచి విక్రమ్ ఆదిత్య – శీనుల రిలేషన్ షిప్ ఎలా డెవలప్ అయ్యింది? శీను వలన విక్రమ్ ఆదిత్య లైఫ్ లో వచ్చిన మార్పులు ఏమిటి? అలాగే విక్రమ్ ఆదిత్య లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందులను శీను ఎలా హండిల్ చేసాడు? అన్నదే కథ.        


ఈ సినిమా కథ మొత్తం ఇద్దరి మధ్యే ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళే నాగార్జున - కార్తీ.. వీరిద్దరూ తప్ప మరే ఇద్దరూ చేసినా ఈ సినిమా అసలు బాగుండేది కాదేమో అనేలా వారు పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ముందుగా నాగార్జున విషయానికి వస్తే.. నాగార్జున బాడీ మొత్తం పర్ఫెక్ట్ గా ఉండే ఎపిసోడ్స్ లో తన ఎనర్జీ లెవల్స్, స్టైల్, రొమాంటిక్ వెర్షన్ తో బాగా చేస్తాడు. ఇక పెరాలసిస్ వ్యక్తిగా ఉన్నప్పుడు అయితే కేవలం ఫేస్ లోని హావ భావాలతోనే తన ప్రతి ఎక్స్ ప్రెషన్ ని ఎక్స్ ప్రెస్ చేసి తనలోని అద్భుతమైన నటున్ని మరోసారి తెరపై ఆవిష్కరించాడు. నాగ్ చైర్లో కూర్చొని ఇంట్లోనే ఉండి చేసిన సీన్స్ లో నాగ్ ఏదో కుచించుకుపోయి చేస్తున్న ఫీల్ వస్తుంది, కానీ పాత్ర ప్రకారం తన లైఫ్ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళగానే అనగా తనని బయట ప్రపంచంలోకి తీసుకెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుంచి తన హావభావాలు అద్భుతః అనేలా ఉంటాయి. నాగార్జునని నటుడిగా మరో ఉన్నతస్థాయికి తీసుకెళ్ళే సినిమా ఊపిరి. 


ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ కార్తీ.. తనే ఈ సినిమాని పూర్తిగా తన భుజాలపై నడిపించాడు. బాగా మాస్ గా అనిపించే కార్తీ పాత్ర వెంటనే ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతుంది. అలాగే సినిమాలో మనల్ని నవ్వించేది, ఎడ్పించేది కూడా కార్తీనే.. ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్విస్తే, సెకండాఫ్ లో ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేసేది కూడా కార్తీనే..  నాగార్జున - కార్తీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫెంటాస్టిక్. ఇక తమన్నా నాగ్ సెక్రటరీగా, కార్తీకి చేసింది లవర్ గా బాగా చేసింది. గ్లామర్ విషయంలో కూడా ఆకట్టుకుంది. కార్తీ - తమన్నాల లవ్ ట్రాక్ కూడా నవ్విస్తుంది.


ఇక సినిమాలో చాలా మంది అతిధి పాత్రల్లో కనిపిస్తూ సినిమాని మలుపులు తిప్పుతూ ఉంటారు. అలా కనిపించిన ప్రకాష్ రాజ్, జయసుధ, కల్పన, అలీ, తనికెళ్ళ భరణిలు వారి వారి పాత్రల్లో మెప్పించి సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇక గ్లామర్ డాల్ గా కనిపించిన గాబ్రియెల్ల దిమెత్రియేడ్స్ అందంతో ఆకర్షించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అనుష్క - అడవి శేష్ లు అతిధి పాత్రల్లో సూపర్బ్ గా సర్ప్రైజ్ చేసి మెప్పించి వెళ్ళిపోయారు.            

'ఊపిరి' సినిమాకి మాతృక అయిన 'ది ఇంటచబుల్స్' అనే సినిమాలో ఇద్దరి మధ్య ఎమోషనల్ జర్నీ మరియు వారిద్దరి మధ్య అటాచ్ మెంట్ ని చూపించారు. దానికంటే బెటర్ గా ఆ ఎమోషనల్ జర్నీని చూపించి హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ స్టొరీగా 'ఊపిరి'ని ప్రేక్షకులకి అందించారు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం చాల ఆసక్తికరంగా ఓ చేజింగ్ సీక్వెన్ తో మొదలై అందరినీ కథలోకి తీసుకెళ్తుంది. అలా మొదలైన కథ మొదలైన 10 నిమిషాలకే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లి కాస్త స్లో అవుతుంది. కానీ ఒక్కసారి కార్తీ వచ్చాక కథలో మళ్ళీ వేగం పుంజుకొని, ఇంటర్వల్ వరకూ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కానీ ఆ తర్వాతే సినిమాకి సమస్య మొదలైంది. ఎందుకంటే.. సినిమాలో ఉన్న బెస్ట్ మొమెంట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ లోనే అయిపోవడం, అలాగే పాత్ర గురించి చెప్పాలనుకున్నది, ఏం క్లారిటీ ఇవ్వాలనుకున్నది ఇంటర్వల్ దగ్గరే చెప్పేయడం వల్ల సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ లేదు.


అలాగే ఎంటర్టైన్మెంట్ లెవల్స్ తగ్గి ఎమోషనల్ ట్రీట్ మెంట్ బాగా ఎక్కువ అవ్వడం వలన కథ అస్సలు ముందుకు వెళ్ళదు. దానికి తోడు సెకండాఫ్ స్టార్టప్ బాగున్నా ఆ తర్వాత కథ లేక కథకి అవసరం లేని సబ్ ట్రాక్స్ ని కథలోకి తీసుకు వచ్చారు. దాని వాళ్ళ కథకి ఉపయోగం లేకపోగా బాగా బోరింగ్ గా ఉంటుంది. ఇక వంశీ పైడి పల్లి - హరి - సోలోమాన్ కలిసి ఈ సినిమా కథని మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసారు. వీరు ఫస్ట్ హాఫ్ ని మంచి ఫీల్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్లాన్ చేసుకున్నా సెకండాఫ్ మొత్తాన్ని కేవలం ఎమోషనల్ మీదే డ్రైవ్ చేసి తప్పు చేసారు. అలా చేస్తున్నప్పుడు సినిమా లెంగ్త్ అన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాల్సింది కానీ అది చేయలేదు.


అంతే కాకుండా ఆ ఎమోషనల్ జర్నీ థ్రెడ్ ని కంటిన్యూగా ఆడియన్స్ కి కనెక్ట్ చేసి ఉంచడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక కథనం విషయంలో కూడా సెకండాఫ్ ని చాలా స్లో చేసేసి, అప్పటికే ఆడియన్స్ కి తెలిసిన విషయాన్ని తిప్పి తిప్పి చెప్పడానికి ప్రయత్నం చేసి బోర్ కొట్టించేసాడు. సెకండాఫ్ పరంగా నేరేషన్ ఇంకాస్త స్పీడ్ గా, ఎమోషనల్ రైడ్ ని సింపుల్ అండ్ స్వీట్ గా చూపించి ఉంటే బాగుండేది. వంశీ పైడిపల్లి ఇప్పటి వరకూ యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ వచ్చాడు కానీ మొదటిసారి ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ రైడ్ ని తీసుకొని దాన్ని చాలా వరకూ ఫీల్ గుడ్ జర్నీలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డైరెక్టర్ గా తనలోని మరో కోణాన్ని ప్రవేశ పెట్టిన సినిమా ఊపిరి. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను కూర్చో బెత్తడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. 


సినిమాకి కెప్టెన్ అయిన వంశీ పైడిపల్లి తర్వాత తన టీంగా పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చి కెప్టెన్ కి సహకరించారు. ముందుగా పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. పారిస్ ని చూపిన విధానం. అలాగే అక్కడి చేజ్ లు, రిచ్ లొకేషన్స్ ని చూపించిన తీరు ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఇక ఇలా విజివల్స్ తో దృశ్యకావ్యంలా అనిపించే విజువల్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. లవ్, ఎమోషనల్, కామెడీ ఇలా ప్రతి ఒక్కదానికి అందించిన మ్యూజిక్ సినిమాని చాలా ఎలివేట్ చేసాయి. ఇక పాటలు విన్నప్పుడు కంటే సినిమాలో చూసేప్పుడు బాగా అనిపిస్తాయి. ఇక మధు ఎడిటింగ్ మొదటి అర్థభాగం బాగానే అనిపించినా సెకండాఫ్ మాత్రం బాగా స్లో అయినట్టు నిపిస్తుంది. సెకండాఫ్ ని బాగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. అబ్బూరు రవి డైలాగ్స్ బాగున్నాయి. ఫైనల్ గా పివిపి సినేమాస్ నిర్మాణ విలువలు వాహ్.. అదిరిపోయాయి.. రెప్పవేయనీయలేదు అనేలా ఉన్నాయి...  


వెంటనే కనెక్ట్ అయ్యే పాత్రలు, కామెడీ, లవ్ మరియు ఎమోషన్స్ ఇలా అన్నీ కలిపి వండర్ఫుల్ ఫస్ట్ హాఫ్, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అనుకొని బయటకి వచ్చి ఒక కూల్ డ్రింక్ తీసుకొని వెళ్లి కూర్చున్న ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ కి పూర్తి విరుద్దమైన బోరింగ్ సెకండాఫ్ ని అందిస్తే ఒక్కసారిగా ఆడియన్స్ డల్ అయిపోతారు. అప్పుడు ఆడియన్స్ ఫీలయ్యే మాట ' ఇదేం మాయ రోగమయ్యా కొంతమంది దర్శకులకి అద్భుతమైన ఫస్ట్ హాఫ్ తీసి, అజ్జబాబోయ్ ఏందీ బోరింగ్ అనేలా సెకండాఫ్ తీస్తారు'. సెకండాఫ్ ని అటు , ఇటు అంటూ ఎటు తీసుకెళ్ళినా చివరికి చెప్పాల్సిన దానినే ఎమోషనల్ గా ఫీల్ గుడ్ అనేలా చెప్పి ముగించడం వలన ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వచ్చిన ఫీల్ రాకపోయినా గుడ్, ఫీల్ గుడ్ బొమ్మే ఈ ఊపిరి.. ఈ హాట్ హాట్ సమ్మర్ లో చాలా కూల్ కూల్ గా అనిపించే సినిమానే 'ఊపిరి'. సమ్మర్ ఫస్ట్ హిట్ గా కూడా దీనిని డిక్లేర్ చేయచ్చు.    

Nagarjuna Akkineni,Karthi,Tamannaah,Vamsi Paidipally,Prasad V Potluri,Gopi Sunderఊపిరి - ఫీల్ గుడ్ & లెంగ్తీ ఎమోషనల్ జర్నీ.!

మరింత సమాచారం తెలుసుకోండి: