మహేష్ స్టోరీ లైన్ సమంత , కాజల్ మిక్కి మ్యూజిక్మహేష్ స్టోరీ లైన్ సమంత , కాజల్ మిక్కి మ్యూజిక్కథనంలో గ్రిప్ సాధించలేక పోవడం ,స్లో నేరేషన్ ,సాగదీసిన సెకండ్ హాఫ్

సంతోషంగా సాగిపోయే కుటుంబం.. చంటి (సత్యరాజ్) ఇంటి పెద్దగా ఉంటాడు ఆయన భార్య రేవతి తన నలుగురు తమ్ముళ్ళు కలిసి ఉంటారు. ఆ నలుగురిలో పెద్దోడు రావు రమేష్. అందరం సమానంగా కష్టపడుతున్నా పెత్తనం అంతా బావ చూడటం రావు రమేష్ కు ఇష్టం ఉండడు. ఇక ఎప్పుడు ఏ కన్ ఫ్యూజ్ లేకుండా హ్యాపీగా ఉండే సత్యరాజ్ కొడుకే హీరో మహేష్ బాబు. నలుగురు మామయ్యలు, అత్తమ్మలతో సరదాగా కబుర్లు చెబుతూ వారితో ఆడుకుంటాడు.


ఎక్కడైనా ఓ నలుగురు కలిస్తేనే అందం ఆనందం.. అలాంటిది పదిమంది ప్రతిరోజు కలుస్తుంటే అదే బ్రహ్మోత్సవం అంటూ ట్రైలర్ లో చెప్పినట్టుగా ఎక్కడో ఉన్న చుట్టాలందరు కలవాలి.. పండుగకో పబ్బానికో కలుసుకోవాలి అని చెప్పే కథ ఈ బ్రహ్మోత్సవం. తన మేన మామ తండ్రిని ఎదురించి వెళ్లడంతో జీవితం దాని విలువ.. చుట్టాలు వారి మూలాలు వెతుక్కునే మార్గంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అన్నదే అసలు కథ.      

సూపర్ స్టార్ మహేష్ సినిమా అనగానే ఆయన పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ తండ్రికి తగ్గ తనయుడిగా జీవితం విలువ చుట్టాలు వారి గురించి వెతికే మార్గం.. అన్నిటిలో మహేష్ అద్భుతంగా చేశాడు. అంతేకాదు సినిమాలో ఇద్దరి హీరోయిన్స్ తో లిప్ లాక్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు మహేష్. ఇక కాశి అన్నపూర్ణ (కాజల్) కూడా తన పాత్రకు తగ్గ నటన కనబరించింది. కుటుంబం కోసం కుటుంబంతో కలిసి ఉండే మహేష్ ముందు కాజల్ కు కనెక్ట్ అయినా ఆ తర్వాత ఆమె మహేష్ కు దూరంగా వెళ్తుంది. ఇక తన చెల్లి స్నేహితురాలిగా లండన్ నుండి వచ్చిన సమంత అచ్చం మహేష్ ఎలా అలోచిస్తాడో అలానే ఆలోచించే పాత్రలో అదరగొట్టింది. తన క్యూట్ యాక్టింగ్ తో సమంత మరోసారి ప్రేక్షకులను అలరించింది.


ఇక సత్యరాజ్ పాత్రలోనే కథ జీవాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ పాత్రకు ఆయనే పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇక తెర మీద కన్నుల పండుగగా రేవతి, జయసుధ, నరేష్, శియాజి షిండే, కృష్ణ భగవాన్ అందరు తమ పాత్రల మేరకు నటించారు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పాత్ర రావు రమేష్ గురించి.. కనీసం ఓ సారి కూడా నవ్వడం ఎరుగని పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. సినిమాలో మహేష్ బాబు, రావు రమేష్ ల నటనే సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో మహేష్ చుట్టంగా లిల్లిగా వెన్నెల కిశోర్ నవ్వులు పండించాడు.   

కథ చెప్పే సినిమా కాస్త నెమ్మదిగా అర్ధమవుతుంది.. అయితే ఇలాంటి సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. తన కుటుంబం చీలకుండా కాపాడుకోవడంలో తండ్రి విఫలమవడం.. కొడుకు తన కుటుంబమే కాదు తన ఇంటి పేరు ఉన్న అందరు చుట్టాలని కలుసుకునే కథ రాయడం గొప్ప విషయం. అయితే దర్శకుడు కేవలం సినిమా కథ మీద దృష్టి పెట్టి కథనంలో కొన్ని పొరపాట్లు చేశాడు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకుండా చేశాడు. దర్శకత్వం పరంగా ఓకే అనిపించుకున్నా ఎక్కడో శ్రీకాంత్ అడ్డాల సినిమాలో క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది.


ఇక సినిమా ఇంత కలర్ఫుల్ గా రాడానికి కరణమైన కెమెరామన్ రత్నవేలు గురిచి ప్రత్యేకంగా మాట్లాడాలి. టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ టాప్ మోస్ట్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో రత్నవేలు ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా చిత్రీకరించారు. మిక్కి జె మేయర్ సంగీతం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. తోటాతరణి గారి సెట్స్ కూడా అబ్బురపరిచాయి. ఎడిటర్ కోటగిరి వెంటకటేశ్వర రావు ఎడిటింగ్ పర్వాలేదు కాని సినిమా ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఇక పివిపి బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేంలో కనిపిస్తున్నాయి. తన బ్యానర్ కు ఉన్న రిచ్ నెస్ ఎక్కడ పోకుండా చూసుకున్నారు నిర్మాత పరం వి పొట్లూరి.  

మహేష్, శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గుర్తొస్తుంది.. ఆ సినిమా హిట్ తో శ్రీకాంత్ అడ్డాలకు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. అయితే ఈసారి కూడా బ్రహ్మోత్సవం అంటూ మరింత సాఫ్ట్ స్టోరీతో వచ్చారు. జీవితం అర్ధం తెలుసుకున్న తండ్రి.. అవి పాఠాలుగా నేర్చుకుంటున్న కొడుకు.. ఎప్పుడు సరదాగా ఉండే కుటుంబంలో ఓ పెను భూకంపం వస్తుంది. అప్పటిదాకా కలిసుకున్న కుటుంబం ఒకడు దూరం అవ్వడం వల్ల గ్యాప్ వస్తుంది. అయితే ఈ టైంలో తన మనసు మార్చాలనే ఉద్దేశంతో అసలు కుటుంబం దాని మూలాలను వెతికే ప్రయత్నం చేయడం కథలోని అసలు పాయింట్. అయితే ఓ కథ సినిమాగా చెప్పాల్సి వచ్చిన సందర్భంలో కొన్ని కథనాలు ఆ కథకు ఎక్కడో గ్యాప్ ఏర్పడుతుంది. బ్రహ్మోత్సవంలో కూడా అలానే జరిగింది. మహేష్, కాజల్ లవ్ ట్రాక్ తో సరదాగా ఫస్ట్ హాఫ్ సాగిపోగా.. ఇంటర్వల్ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తండ్రి చనిపోవడం. అయితే ఆ ఎపిసోడ్ మహేష్ నటన సూపర్బ్ అని చెప్పాలి.   

ఇక తమని కాదని వెళ్లిన మామను తిరిగి ఇంటికి తెచ్చేయాలన్న ఆలోచనతో ఉన్న మహేష్ తన తండ్రి తరపున చుట్టాలను వెతకడం మొదలు పెడతాడు. ఆ క్రమంలోనే సమంత కూడా తోడవుతుంది. 7 తరాల చుట్టాలు.. వెతికే దొరకనంతమంది.. కలిస్తే వదులుకోలేనంత మందా అంటూ సమంత చెప్పిన ఆ 7 తరాల చుట్టాలను వెతికేస్తుంటారు. ఆ క్రమంలో లక్నో, వారణాసి, కాశి , బెంగుళూరు చుట్టేస్తారు. ఇక రావు రమేష్ కూతురు ప్రణీత పెళ్లి చేసుకునే అబ్బాయి తండ్రిగా ముఖేష్ రుషి పాత్ర పలికించిన డైలాగ్ అద్భుతం. నమ్మలేని నిజాలంటే అబద్ధాలనుకున్నా.. అవి అద్భుతాలని మీ వాడిని చూస్తే తెలిసింది అని చెప్పడం సినిమా కంటెంట్ ఇదే అని చెప్పే ప్రయత్నం చేశారు.   

కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ ను మరో కొత్త సినిమాను పరిచయం చేయడం కోసం ఈ సినిమా ప్రయత్నిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు సినిమా సూపర్ హిట్.. హిట్.. యావరేజ్.. ఈ కారణాలేవి చూడకుండా.. ఓ అద్భుతమైన భావాన్ని అందించడంలో సినిమా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అసలు దర్శకుడు ఈ కథలో ఏం చెప్పాలనుకున్నాడో అనేది కాస్త కన్ ఫ్యూజ్ అయినా అర్ధం చేసుకునే స్థాయి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ మేరకు ఒకే అనిపించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా గురించి రేటింగ్ ఇవ్వాలనుకుంటే వారి వారి అభిప్రాయాలను బట్టి ఇస్తారు. 1 స్టార్ 2 స్టార్లా కాదు మనసు పెట్టి చూస్తే ఇదో ఎన్ని స్టార్ల సినిమానో మీకే అర్ధమవుతుంది.   


Mahesh Babu,Kajal Aggarwal,Samantha Ruth Prabhu,Pranitha Subhashమనసుకు హత్తుకునే బ్రహ్మోత్సవం..!

మరింత సమాచారం తెలుసుకోండి: