బన్ని యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్స్, లుక్ ,సినిమాటోగ్రఫీ బన్ని యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్స్, లుక్ ,సినిమాటోగ్రఫీ సరైన కథ కథనం లేకపోవడం ,సంగీతం ,ఎడిటింగ్ ,కామెడి సరిగా లేకపోవడం , సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం.

అయిల్ కంపెనీ కోసం పేద రైతుల దగ్గర భూములను లాక్కుంటుంటాడు వైరం ధనుష్(ఆది పినిశెట్టి). ముఖ్యమంత్రి కొడుకు కావడం, అంగ, ఆర్ధిక బలం ఉండటంతో ఎవరూ ఏమీ అనలేరు. కథ ఇలా సాగుతుండగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉమాపతి(జయప్రకాష్) తనయుడు గణ(బన్ని) మిలటరీ నుండి పని మానేసి వచ్చేస్తాడు. ఉమాపతి తమ్ముడు శ్రీపతి(శ్రీకాంత్), గణను స్వంత కొడుకులా పెంచుకుంటుంటాడు.


ఓ సందర్భంలో ఎమ్మెల్యే హన్సిత రెడ్డిని చూసిన గణ ఆమె ప్రేమలో పడతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేలా చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాలంటే గణ ఏ గొడవలకు పోకుండా ఉండేలా తనకు ప్రమాణం చేయాలని కండీషన్ పెడుతుంది హన్సిత. ప్రమాణం చేసే సమయంలో మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్) ను కొంత మంది ధనుష్ అనుచరులు చంపడానికి వస్తారు. వారి నుండి గణ మహాలక్ష్మిని కాపాడతాడు. అసలు మహాలక్ష్మి ఎవరు?  ధనుష్, మహాలక్ష్మి మధ్య రిలేషన్ ఏంటి? చివరకు గణ మహాలక్ష్మిని ఎలా కాపాడాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

బన్ని తన ఎనర్జి పరంగా ఎక్కడా డ్రాప్ కాలేదు. యాజ్ యూజువల్ ఫైట్స్ లో పవర్ చూపించి డ్యాన్సులు ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన రెండు భుజాలపై లాగాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రకుల్ పాత్ర ఫస్టాఫ్ రెండు సీన్స్, సెకండాఫ్ లో మరో నాలుగు సీన్స్, రెండు, మూడు పాటలకు మాత్రమే పరిమితమైంది. క్యాథరిన్ ఎమ్మెల్యే పాత్రలో కనిపించింది. ఫస్టాఫ్ హీరోయిన్ క్యాథరిన్ అనే చెప్పాలి. ఇద్దరూ హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ అయ్యారు. ముఖ్యంగా చెప్పకోవాల్సింది హీరో నుండి విలన్ గా మారిన ఆది పినిశెట్టి పాత్ర పరంగా  మంచి విలనిజాన్నే కనపరిచాడు. ఈ స్టేజ్ లో ఇలాంటి రోల్ చేసినందుకు అభినందించాల్సిందే. శ్రీకాంత్, జయప్రకాష్, బ్రహ్మానందం, సుమన్, ఆదర్శ్ బాలకృష్ణ సహా ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు బోయపాటి శ్రీను గురంచే చెప్పిన కథను తిప్పి తిప్పి చెప్పాడు. సరే పాయింట్ కామనే కదా అనుకుందామంటే దానికి ఎంటర్ టైనింగ్ జోడించి చెప్పి ఉంటే సినిమా బావుండేదేమో ఆ విషయాన్ని బోయపాటి మరచిపోయినట్టున్నాడు. థమన్ అందించిన ట్యూన్స్ తెలుసా..తెలుసా అనే సాంగ్, అంజలి తళుక్కున మెరిసిన బ్లాక్ బస్టరే సాంగ్ బావున్నాయి. ఎమ్మెల్యే సాంగ్ పరావాలేదు. మిగిలిన సాంగ్స్ ఎక్కవు. అయితే తమన్ ఎప్పటిలాగానే వీర వాయింపుడు వాయించాడు(తెలుసా..తెలుసా..సాంగ్ మినహాయిస్తే). బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అసలు బాలేదు.


సీరియస్ సీన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు, సెంటిమెంట్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకేలా ఉండటం నవ్వు తెప్పిస్తుంది. సినిమా లెంగ్త్ దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు. ఈ నిడివి కాస్తా తగ్గించి ఉంటే సినిమా స్పీడ్ కనపడి ఉండేదేమో సినిమా సెకండాఫ్ సాగదీతగా కనపడింది. బ్రహ్మానందం కామెడి ఒకచోట ఓకే అనిపించినా మిగిలిన చోట్ల కామన్ గానే కనపడుతుంది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్ పరావాలేదనిపిస్తుంది కానీ సెకండాఫ్ విషయానికి వస్తే కథ ముందే తెలిసిపోతుంది. దాంతో ప్రేక్షుకుడికి ఉత్కంఠత కనపడదు.

బోయపాటి శ్రీను తను తీసిన భద్ర కథను మరోసారి స్టయిల్ మార్చి తెరకెక్కించాడు. అయితే ఈసారి హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ కాస్తా కథను రాసుకున్నాడు. కథ, కథనాన్ని గ్రిప్పింగ్ గా నడిపించలేకపోయాడు. ఈ సినిమా చూస్తే బోయపాటి బాలకృష్ణను తప్ప ఇప్పటి యూత్ హీరోలను మేనేజ్ చేయలేడా అనిపించేలా ఉంది. హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరో అనుకోకుండా ఆమె ఊరు వెళ్లడం వాళ్లని కాపాడటం, విలన్స్ చేతిలో హీరోయిన్ ఫ్యామిలీని కోల్పోవడం, హీరో దగ్గరికి వస్తే అతనేం చేశాడనే కథలు చాలానే చూశాం.


ఫస్టాఫ్ లో ఉన్న కాస్తా ఎంటర్ టైనింగ్ సెకండాఫ్ లో కనపడదు. పేరుకు ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ కానీ ఇద్దరూ హీరోతో డ్యాన్సులు వేస్తూ, పాటలు పాడటానికి పరిమితమైపోయారు. ఆది పినిశెట్టి మాత్రం విలన్ గా ఆకట్టుకున్నాడు. మొత్తం మీద బలహీనమైన కథకు టెక్నికల్ గా మ్యూజిక్ రూపంలో సపోర్ట్ దొరకలేదు. మొత్తం మీద సరైనోడు అభిమానులకే పరిమితమవుతాడు.

Allu Arjun,Rakul Preet Singh,Catherine Tresa,Srikanth,Boyapati Srinu,Allu Aravind,S. Thamanసరిలేని ‘సరైనోడు’

మరింత సమాచారం తెలుసుకోండి: