నిర్మాణ విలువలునిర్మాణ విలువలుసందర్భమే లేకుండా వచ్చే పాటలు , సీన్ కి సీన్ కి మధ్య సరైన జస్టిఫికేషన్ లేకపోవడం , డెడ్ స్లో నేరేషన్ , బలవంతంగా ఇరికించిన పేరడీ కామెడీ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ , డైరెక్షన్

మొదటి 10 నిమిషాల్లో అరెరె భలే ఉండే అనిపించి ఆ తర్వాత చాలా దారుణంగా అనిపించే సినిమాలు ఈ మధ్య చాలానే వస్తున్నాయి. అలా వచ్చిన మరో సినిమానే 'దృశ్య కావ్యం'. అఖిల్(కార్తీక్) - అభినయ(కష్మీర) కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. వీరిద్దరూ ప్రేమలో పడతారు. అదే టైంలో అభినయ తల్లి తండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. దాంతో అఖిల్ తన ఫ్రెండ్ అన్వేష్(మధు) సాయంతో అభినయని  పెళ్లి చేసుకుంటాడు. అలా 5 సంవత్సరాల హ్యాపీ వివాహ బంధం గడిచాక అఖిల్ కి యూరప్ లో జాబ్ అవకాశం వస్తుంది. అఖిల్ ఎప్పుడైతే యూరప్ వెల్తాడో అప్పటి నుంచి ఇంట్లో కొన్ని అనుకోని భయానక సంఘటనలు జరుగుతుంటాయి. అసలు యూరప్ వెళ్దామని బయలుదేరిన అఖిల్ కి ఏమయ్యింది? ఎందువల్ల అఖిల్ ఇంట్లోకి సూపర్ నాచురల్ పవర్స్ ఎంటర్ అయ్యాయి? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..   

సినిమాల్లో ఒక్కొక్కరు చూపిన నటనా చాతుర్యం ల్వల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే.. పృథ్వి, చందు లాంటి కమెడియన్స్ యావారేజ్ రేంజ్ నుంచి ది వరస్ట్ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆడియన్స్ కి టార్చర్ చేసాడు. సినిమాలోకి బెస్ట్ అంటే అలీ, సత్యం రాజేష్ లకి చాలా వీక్ పాత్రలు ఇచ్చినా వారి టాలెంట్ తో సినిమాని కాస్త పుష్ చేసారు. హీరో పాత్ర చేసిన కార్తీక్ తన పాత్రకి అస్సలు న్యాయం చేయలేదు.. ఆ పాత్రలోని ఒక్క భావాన్ని కూడా తన కళ్ళతో కన్వే చేయలేకపోయారు. మధు నందన్ పరవాలేదనిపించాడు. కష్మీర చోడటానికి బాగుంది, కానీ నటన పరంగా మాత్రం జీరో, అనతకు మించి తనకు పాత్ర లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అమ్మాయి బాగా చేసింది.    

థ్రెడ్ మీల్ మీద నువ్వు ఎంతసేపు పరిగెత్తినా అక్కడే ఉంటావ్ ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళవు, అలాగే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచీ కథ కొంచెం అన్నా ముందుకు వెళ్తుందా అని ఎదురు చూస్తూ చివరి దాకా కూర్చున్నా అస్సలు ఉపయోగం లేదు. ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టు సినిమా కథ పరంగా, అలాగే నేరేషన్ పరంగా చాలా చాలా స్లోగా సాగుతూ థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి అసలు సహనం ఉందా లేదా అని పరీక్ష పెట్టేలా ఉంటుంది. కెమెరా యాంగిల్స్ మరియు మూవింగ్ చాలా స్లోగా ఉంటుంది. అలాగే ప్రతి పాత్రని గురించి దీప గా చెప్పారు కానీ అలా డీప్ గా చెప్పే సీన్స్ మాత్రం సిల్లీగా ఉంటాయ్. అవసరంలేని పాత్రల గురించి అంతా ఎక్కువ చెప్పి సినిమాకి అవసరం అయిన సూపర్ చాచురాల్ పవర్స్ గురించి మాత్రం సరిగా చెప్పలేదు. నిర్మాత నుంచి దర్శకుడిగా మారిన రామకృష్ణ రెడ్డి చేసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసాక ఈయన తను కష్టపడి సంపాదించుకున్న మనీ వృధా చేయడమే కాకుండా, ఆడియన్స్ కి టార్చర్ చూపించాడు. ఇక సెకండాఫ్ ఏమన్నా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడా అంటే అదీ లేదు.. రాను రాను ఇంకా వరస్ట్ అనే మోడ్ లోకి తీసుకెళ్ళిపోయారు. అనవసరమైన పృథ్వి పేరడీ ట్రాక్ తో ఆడియన్స్ కి మెంటల్ ఎక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక మెయిన్ గా చివర్లో కథలోని చాలా పాయింట్స్ కి ఒక కంక్లూజన్ ఇవ్వకుండా, కన్ఫ్యూజన్స్ లో సినిమాకి ముగింపు ఇవ్వడమే కాకుండా 'నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్' అని ఇచ్చిన ఎండ్ ఆడియన్స్ కి మెంటల్ ఎక్కిస్తుంది. 

దెయ్యంతో భయాన్ని సృష్టించే హర్రర్ సీన్స్ మరియు కాస్త హాస్యం పక్కగా మిక్స్ చేసుకొని తీసి ఉంటే ఈ సినిమా ఆడియన్స్ కి కొంతలో కొంత నచ్చేది. కానీ డైరెక్టర్ ఆ లాజిక్ ని ఎక్కడో వదిలేసి రొమాన్స్, సొల్లు కామెడీ, పాటలు ఉండాలి అనే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి వెళ్ళడం వలన సినిమా కాస్తా కొండేక్కేసింది. ఇలాంటి ఇండిపెండెంట్ దర్శక నిర్మాతలైన కాస్త కమర్శియాలిటీని పక్కన పెట్టి పాత్ బ్రేకింగ్ సినిమాలు ట్రై చేస్తే బెటర్. కమలాకర్ అందించిన మ్యూజిక్ బాలేదు. సొంగ అనేటివి అస్సలు ఎక్కలేదు, దానికి తోడూ హర్రర్ డ్రామాకి కావాల్సిన నేపధ్య సంగీతం అంతకన్నా బాలేదు. ఇక నాగి రెడ్డి ఎడిటింగ్ అయితే సినిమాని ఇంకాస్త లో రేంజ్ కి తీసుకెళ్లేలా చేసింది. కనీసం హర్రర్ సినిమాకి కావాల్సిన విజువల్ అన్నా ఉన్నాయా అంటే అదీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా బాడ్. ఫైనల్ గా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి అనే ఫీలింగ్ ని కలిగించడమే టెక్నికల్ లో కాస్త ఊపిరి పీల్చుకునే పాయింట్.  



మొదటి 10 నిమిషాలు చూసిన తర్వాత దృశ్య కావ్యం అనే సినిమా బాగుంటుంది, కనీసం డీసెంట్ గా అన్నా ముగించే అవాకాశం ఉంది అనే ఆశాభావంలోకి వెళ్లాను. కానీ ఆ 1ఓ నిమిషాల తర్వాత సినిమా చూసాక నాలోని ఆశలన్ని సచ్చిపోయాయి. సినిమా అయ్యే టైంకి ఈ మార్చి నెలలో వచ్చిన చాలా అంటే చాలా వరస్ట్ సినిమాల జాబితాలో చేరిపోయింది 'దృశ్యకావ్యం'. చాలా అందమైన అనుభూతికి చిహ్నమైన 'దృశ్యకావ్యం' అనే పేరు పెట్టి మనల్ని 133 నిమిషాల పాటు చిత్రవద చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది ఈ సినిమా.    

Ramkarthik,Kashmira Kulakarni,Bellam Rama Krishna Reddy,Pushyami Film Makers,Pranam Kamlakhar Kదృశ్యకావ్యం - ఇది ఆవ్యం కాదు, కావ్యానికి పట్టిన పీడాకారం.

మరింత సమాచారం తెలుసుకోండి: