SVSC:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


10:15 PM: ఎపి హెరాల్డ్ ట్వీట్ రివ్యూ వీక్షకులకు స్వాగతం, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ట్వీట్స్ మీకోసం..
10:20 PM: 2013, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతమ్మ..’ సినిమా ‘స్మోకింగ్ కు వ్యతిరేకంగా రావు రమేష్ వార్నింగ్ తో ప్రారంభం అయ్యింది.
10:22 PM: సమాజం చక్కగా ఉండాలంటే మానవ సంబంధాలు మంచిగా ఉండాలని ‘శ్రీకాంత్ అడ్డాల’ వాయిస్ ఓవర్ లో చెప్పుతున్నాడు.
10:24 PM: ‘ప్రకాష్’ మనకు గ్రామీణ వాతావరణాన్ని గుర్తుచేస్తున్నాడు
10:26 PM: ‘సీత’గా అంజలి సొంత డబ్బింగ్ బావుంది. ఆమె ఆహార్యం కుడా ఆకట్టుకునే విధంగా ఉంది.
10:30 PM: ‘ఏం చేద్దాం..’ పాటతో వెంకటేష్, మహేష్ లు తెరమీదికి వచ్చారు. 
10:38 PM: ప్రిన్స్ మహేష్ ఎప్పటిలాగానే చాలా అందంగా కనిపిస్తున్నాడు.
10:40 PM: కోట శ్రీనివాసరావు తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటున్నాడు.
10: 43 PM: ‘నేను ఇలానే ఉంటాను. నాలానే ఉంటాను’ అని వెంకటేష్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులందరర్నీ మురిపించింది.  
10: 47 PM: వెంకటేష్,మహేష్ బాబులు ‘ఏరా ఏరా’ అని సంభోదించుకుంటూ మాట్లాడుకోవడం ప్రతీ ఒక్కరికి తమ కుటుంబాన్ని గుర్తు చేస్తుంది.
10: 48 PM: దర్శకుడు శ్రీకాంత్ ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసే విధానం ఫరవాలేదనిపించేవిధంగా ఉంది.
10: 50 PM: ‘బతకడానికి భారతదేశం కంటే గొప్పదేశం లేదు’ కొండలరావు డైలాగ్ నిజాన్ని గుర్తు చేస్తుంది.  
10: 52 PM: అచ్చమైన ‘గోదావరి యాస’తో సినిమా సాగుతుంది.  
10: 53 PM:  ‘భారత స్ర్తీలు జడలేసుకోవడం మర్చిపోయారే..’ అని మహేష్ చెప్పిన డైలాగ్ హాస్యం పండించింది.
10: 54 PM:  సమంత పరిచయ సన్నివేశం సాధారణంగా ఉంది. అయితే సమంత తన అందంతో అదరగొట్టింది.
10: 57 PM: ‘6 అడుగులుంటాడా..’ పాటలో అచ్చమైన భారతీయ సాంప్రదాయ దుస్తులు వేసుకుని సమంత తన బృందంతో నాట్యం చేస్తుంది. అయితే ఈ పాట చూస్తుంటే ‘అతడు’ సినిమాలో త్రిష గుర్తుకు వస్తుంది.
10: 59 PM: రావు రమేష్, రమాప్రభ, తనికెళ్ళ భరణి ల మధ్య జరిగే సంభాషణ మన అందరీ  కుటుంబ సభ్యుల కలయికను గుర్తు చేస్తుంది.
11:01 PM: వివాహ వేడుకను భారీతనం ఉట్టిపడేలా చిత్రీకరించారు.
11:04 PM: మహేష్-సమంత ల పరిచయ సన్నివేశం బావుంది. ఇలాంటి సన్నివేశాన్ని మీరు ఊహించరు. నేపథ్య సంగీతం గొప్పగా ఉంది.
11:09 PM: ‘ఇంకోక్క 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కడ ముద్దు పెట్టేస్తుందో తెలియదు’ అని మహేష్ చెప్పిన డైలాగ్ ధియేటర్ లో నవ్వులు పూయిచింది.
11:14 PM: మహేష్-సమంత ల జంట చూడ్డానికి బావుంది. 
11:16 PM: ‘ఇలాంటి ఫిగర్ ను చూసి తట్టుకోవాలంటే 100 భగవద్గీతలు చదవాలి’ అనే డైలాగ్ బావుంది.  
11:18 PM: వెంకటేష్-మహేష్ కలసిన మొదటి సన్నివేశం సహజంగా ఉంది. బామ్మ తో నడిచే సన్నివేశంలో ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు.
11:20 PM: మహేష్, వేణుమాధవ్ ( ఓంకార్ - సెన్సార్ ఆఫీసర్) మధ్య సన్నివేశం సరదాగా ఉంది.
11:22 PM: రావు రమేష్ నటన అతని తండ్రి రావుగోపాల రావును గుర్తు చేస్తుంది. అతని యాస ఆకట్టుకుంది.   
11:23 PM: వెంకటేష్- పోలీసులతో వాదించే నటన సహజంగా ఉంది.
11:24 PM: ‘ఒక చిన్న అబద్దం చెప్పచ్చు కదే.... జీవితాన్ని లామినేట్ చేసి నీ చేతిలో పెడతానే’ అనే డైలాగ్ బావుంది
11:25 PM: మహేష్-రవిబాబు మధ్య హస్య సన్నివేశం బావుంది.
11:27 PM: మహేష్- వెంకటేష్ ల మధ్య ఘాటైన మాటాలతో సాగే సన్నివేశం ప్రేక్షకులను మెప్పించింది.
11:28 PM: వెంకీ-మహేష్ ల అన్నదమ్ముల బంధాన్ని అద్భుతంగా తెరక్కెక్కింది.
11:31 PM: ‘ఈ జనాలు ఏంటిరా బాబు... ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పోలమని వచ్చేతుంటారు.’ డైలాగ్ బావుంది.
11:33 PM: పెళ్లి చూపులు సన్నివేశం సహజంగా సాగుతూ మధ్య తరగతి జీవితాన్ని ప్రతిభింభించింది.
11:35 PM: మురళి మోహన్ (స్థానిక ఎమ్మెల్మేగా నటించాడు.) ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సన్నివేశం గుర్తించుకునే విధంగా ఉంది.
11:37 PM: ప్రేక్షకులందరూ ‘సీతమ్మ వాకిట్లో..’ పాట మొదలయ్యింది. సినిమాటోగ్రఫర్ ప్రతిభ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది.
11:39 PM: పెళ్లి చూపులు మొదలుకుని పెళ్లి పూర్తయ్యేవరకూ జరిగే సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు.
11:41 PM: ‘హైదరాబాద్ లో ఎక్కడా..?... ఎక్కడపడితే అక్కడ’ : మహేష్ మరో సరదా డైలాగ్  
11:43 PM: వెంకటేష్ ఒక వైపున తన సహజ నటనతో మెప్పిస్తుంటే, మరో వైపు నుంచి మహేష్ బాబు హస్యం-శృంగార నటనతో ఆకట్టుకున్నాడు.
11:45 PM: వెంకటేష్ తన నటనతో ఆకట్టుకునే తీరు చూస్తుంటే తన కెరీర్ కోసం పడుతున్న తాపత్రయం కనిపిస్తుంది.
11:47 PM: వెంకటేష్-అంజలి మధ్య సాగే బావమరదళ్ల సన్నివేశం బావుంది.
11:48 PM: సీరియస్ సన్నివేశంతో విశ్రాంతి
11:56 PM: సమంతతో జరిగే  సన్నివేశంలో మహేష్ డైలాగ్స్, అభినయం కనవిందు చేస్తున్నాయి.
11:58 PM: ‘ఇంకా చెప్పాలంటే..’ పాట మహేష్-సమంత మధ్య కొనసాగుతుంది.
12:02 AM: మహేష్ - వెంకటేష్ ల మధ్య మేడ పై జరిగే చిన్న సన్నివేశం అలరిస్తుంది.
12:05 AM: మేకప్ లేకున్నా మహేష్ సహాజంగా, అందంగా కనిపిస్తున్నాడు.
12:10 AM: ‘ఉదయాన్నే 9 గంటలకు బయటకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి టివిలో ఏది చూడాలో తెలియక అటు ఇటూ కొట్టుకోవడం నావల్ల కాదు’ అని వెంకటేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.  
12:15 AM: ఉద్రేకంతో మహేష్, రావు రమేష్ తో చెప్పే డైలాగు హత్తుకుంటుంది.  
12:16 AM: మరోసారి మేడపై మహేష్-వెంకటేష్ ల సంభాషతో. సినిమాలో మంచి మలుపు.  
12:18 AM: అంజలి అందంగా కనిపిస్తుంది. ఆమె సహాజ అభినయం అద్భుతంగా ఉంది.   
12:23 AM: సినిమాలో ఏకైక యుగళ గీతం. ‘వాన చినుకులు..’ పాట వెంకటేష్-అంజలీ మధ్య గోదావరి నేపథ్యంలో సహజంగా చిత్రీకరించబడింది.
12:28 AM: ‘సీత’ వివాహం గురించి ప్రకాష్ రాజ్-రావు రమేష్ ల సంభాషణ బావుంది.
12:29 AM: ముఖ్యమైన సన్నివేశంలో నేపథ్యం సంగీతం అద్భుతంగా ఉంది.
12:32 AM: సీతకు రావు రమేష్ పెళ్లి సంబంధం చూస్తున్నాడు. మహేష్-సమంతల ప్రేమాయణం సాగుతుంది.., వెంకీ-అంజలి మధ్య సన్నివేశాలు తెర పై నెమ్మదిగా సాగుతున్నాయి.
12:34 AM: ప్రకాష్ రాజ్ ప్రమాదానికి గురవుతాడు. ఈ సన్నివేశాలు సహజంగా తెరకెక్కించినప్పటికీ సినిమా నెమ్మదిగా సాగుతుంది.
12:36 AM: వెంకటేష్ కెరీర్ గురించి జయసుధ, మహేష్ మధ్య సాగే సన్నివేశం బావుంది.
12:38 AM: వెంకటేష్-మహేష్ మధ్య ఉద్వేగభరితమైన సన్నివేశం బావుంది. ఈ ఘనత దర్శకుడికే చెందుతుంది.
12:44 AM: భద్రాచలంలో ప్రకాష్ రాజ్ కుటుంబం, రావు రమేష్ కుటుంబం కలుసుకున్నాయి. 
12:50 AM: భద్రాచలంలో షార్ట్  సర్క్యూట్ సీన్ చాలా సహాజంగా ఉంది.
12:52 AM: సమాజానికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన సందేశం అంతగా ఆకట్టుకోదు.
12:57 AM: ‘సీతమ్మ వాకిట్లో..’ పాటతో వెంకటేష్-అంజలి మధ్య జరిగే వివాహం సన్నివేశం  చివరి అర్థగంటలో నిదానంగా సాగిన విధానాన్ని మరిపించే విధంగా చిత్రీకరించారు.
12:58 AM: ‘శుభం’     

SVSC Review: Cast & Crew

  • Director: Srikanth Addala, Producer: Dil Raju
  • Music: Mickey J Meyer, Cinematography: K. V. Guhan, Editing : Marthand K. Venkatesh, Writer:
  • Star Cast: Venkatesh, Mahesh Babu, Anjali, Samantha, Jayasudha, Prakash Raj, Rohini Hattangadi, Murali Mohan, Rao Ramesh, Abhinaya, Kota Srinivasa Rao, Tanikella Bharani, Rama Prabha, Venu Madhav, Ravi Babu, Ahuti Prasad andSrinivasa Reddy,
  • Genre: Family Entertainer, Censor Rating: U, Duration: 02:30Hrs.
  • Description: Seethamma Vakitlo Sirimalle Chettu Movie Review, Rating | Seethamma Vakitlo Sirimalle Chettu Review | Seethamma Vakitlo Sirimalle Chettu Rating | Mahesh babu Venkatesh Seethamma Vakitlo Sirimalle Chettu Telugu Movie Cast & Crew, Music, Performances, Language: te
  • Keywords: Mahesh Babu Venkatesh SVSC Review, Rating;Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) Review;Seethamma Vakitlo Sirimalle Chettu Rating;Seethamma Vakitlo Sirimalle Chettu Movie review;Seethamma Vakitlo Sirimalle Chettu Movie Rating;Venkatesh;Mahesh Babu;Samantha;Anjali;Srikanth Addala;Dilraju;Telugu Latest Movies;
  • Is Family Friendly: true
  • Author: , Creator: APHerald, Publisher: APHerald








  •  

    More Articles on SVSC || SVSC Wallpapers || SVSC Videos


     

    మరింత సమాచారం తెలుసుకోండి: