విజయ్ ,నైనిక ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్విజయ్ ,నైనిక ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కథ, కథనం ,డైరక్షన్ , విలన్

జోసెఫ్ (విజయ్), తన కూతురు నివేదిత (నైనిక) హ్యాపీగా లైఫ్ ఎంజయ్ చేస్తుంటారు. నివి స్కూల్ టీచర్ యామి (ఎమీ జాక్సన్) నివికి దగ్గరవ్వాలని చూస్తుంది. అనుకోకుండా ఓ రోజు ఓ రౌడీ గ్యాంగ్ తో యామి గొడవ పడటం వల్ల జోసెఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ జోసెఫ్ ను చూసిన ఓ పోలీస్ ఆఫీసర్ అతన్ను విజయ్ గా గుర్తిస్తాడు. తాను చంపేశాడానుకున్న విజయ్ బ్రతుకున్నాడని తెలియడంతో వెంకట్ రెడ్డి (మహింద్రన్) మళ్లీ అతన్ని చంపాలని చూస్తాడు. ఇంతలో యామికి కూడా జోసెఫ్ లా మారింది విజయ్ అని తెలుస్తుంది. ఇక మైత్రి (సమంత)కు సంబందించిన విషయాలను తెలుసుకుంటుంది. అసలు వెంకట్ రెడ్డికి విజయ్ కు మధ్య గొడవ ఏంటి..? విజయ్ ఎందుకు జోసెఫ్ గా మారాడు..? విజయ్ తన కుటుంబాన్ని ఎలా పోగొట్టుకున్నాడు..? అన్నదే అసలు కథ..


పోలీస్ ఆఫీసర్ గా విజయ్ మరోసారి తన సత్తా చాటాడని చెప్పొచ్చు. ఓ పక్క విజయ్ గా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తూ మరో పక్క జోసెఫ్ గా ఓ తండ్రి లాలన చూపించాడు. తన పాత్రకు తగ్గట్టుగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు విజయ్. ఇక సినిమాలో తన స్టైలిష్ యాక్షన్ కు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. ఇక సినిమాలో విజయ్ కూతురిగా నటించిన నైనిక మీనా కూతురని మనకు తెలిసిందే. తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది నైనిక. సినిమాలో విజయ్, నైనికల మధ్య వచ్చే సీన్స్ హైలెట్ అని చెప్పాలి. ఇక మైత్రిగా నటించిన సమంత మరోసారి ఓ అద్భుత పాత్ర చేసింది.. సినిమా మధ్యలో ఎండ్ అయ్యే పాత్ర అయినా సినిమాలో తన మార్క్ చూపించింది సమంత.


ఇక యామిగా ఎమీ జాక్సన్ ఓకే అనిపించింది అయితే ఎమీ జాక్సన్ లాంటి హాట్ హీరోయిన్ ని టీచర్ గా పెట్టి కనీసం హీరోతో ఆమె రొమాన్స్ చేసే అవకాశం లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక విలన్ గా నటించిన మహింద్రన్ దర్శకుడు రాసుకున్న పాత్ర మేరకు ఓకే అనిపించాడు. ఇక పోలీస్ పై అధికారిగా ప్రభు.. విజయ్ తల్లిగా రాధిక తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  

సినిమాలో పనిచేసిన టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమాలో లోటు కనిపించింది దర్శకుడు దగ్గరే అని చెప్పొచ్చు. కథ, కథనాల మీద క్లారిటీ ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన జి.వి ప్రకాశ్ పాటల్లో ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కేక పెట్టించాడు. జార్జ్ సి.విలియమ్స్ కెమెరా పనితనం బాగానే ఉంది. ముఖ్యంగా విజయ్ ను స్టైలిష్ హీరోగా చూపించడంలో కెమెరా మెన్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే సినిమాలో ఫారిన్ లొకేషన్స్ అంతగా లేకపోవడంతో స్క్రీన్ అంత అందంగా కనిపించదు. ఇక ఆంటోని ఎల్.రూబెన్స్ ఎడిటింగ్ పర్వాలేదనిపించుకుంది. సినిమాకు ఇంకాస్త కత్తెరలు పడి ఉంటే మంచిదనిపిస్తుంది. ఇక కలై పులి ఎస్. థను ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టాయి. కాని ఖర్చుకు తగ్గ కథ కథనాలు లేకపోవడం విశేషం.   

పోలీస్ అంటూ ఓ పవర్ ఫుల్ టైటిల్ తో వచ్చిన దర్శకుడు అట్లీ కథ కథనాల్లో కొత్తదనం చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. విలన్ వెంకట్ రెడ్డి హీరోపై పగబట్టే సన్నివేశాలన్ని ఇంటర్వెల్  ముందే చెప్పేయడంతో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆడియెన్స్ ఊహించేలా ఉంటుంది. ఇక విజయ్ లాంటి పవర్ ఫుల్ హీరో అనగానే ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు అట్లీ సినిమా మీద గ్రిప్ సాధించలేకపోయాడు. ఇక విజయ్ కూడా ఇలాంటి కథతో వస్తాడని ఎవరు ఊహించరు.

పోలీస్ జాబ్ లో రిస్క్ తీసుకున్న ఓ వ్యక్తి ఆ విలన్ గ్యాంగ్ వల్ల తన కుటుంబాన్ని కోల్పోయి మళ్లీ రివెంజ్ తీర్చుకోవడం లాంటి కథలు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. సినిమాలో కొత్తగా చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. కాకపోతే ఇంటర్వల్ ముందు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ చనిపోయిన  సీన్, సెకండ్ హాఫ్ లో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో కూలీలు చనిపోయినప్పుడు వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్ సమంత విజయ్ తో రొమాన్స్ లైఫ్ షేరింగ్ లాంటి కలలు బాగానే ఉన్నా.. యామిగా నటించిన ఎమీ అసలు ఎందుకు చేసిందో అర్ధం కాదు. కోలీవుడ్ లో మోస్ట్ సెక్సీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఎమీ జాక్సన్ ను  కేవలం ఏదో సైడ్ ఆర్టిస్ట్ ను చేయడం సినీ ప్రేక్షకుకలు కాస్త నిరాశపడ్డారు.


ఇక సినిమా సెకండ్ హాఫ్ పెద్ద మైనస్.. ఇంకెప్పుడు అయిపోతుంది అన్న భావన ఆడియెన్స్ లో వస్తుంది. సినిమాలో విలనిజం కూడా అంత గొప్పగా చూపించలేకపోయాడు దర్శకుడు. కొన్ని సెంటిమెంట్ సీన్స్ తప్ప సినిమాలో చెప్పు కోవడానికి ఏమీ లేదు. తమిళంలో విజయ్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు కనుక అక్కడ సినిమా ఆడే అవకాశం ఉంది కాని ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి కథలు చాలా వచ్చాయి కనుక మరోసారి విజయ్ తెలుగులో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు.



Vijay,Dil Raju,Samantha,Amy Jackson,Atlee kumar,GV Prakash Kumar,ఈ పోలీస్ పరమ రొటీన్..!

మరింత సమాచారం తెలుసుకోండి: