సాయి ధరం తేజ్, రాశి ఖన్నా,చైల్డ్ ఆర్టిస్ట్ మైఖెల్ గాంధి,మ్యూజిక్ కామెడీ సీన్స్సాయి ధరం తేజ్, రాశి ఖన్నా,చైల్డ్ ఆర్టిస్ట్ మైఖెల్ గాంధి,మ్యూజిక్ కామెడీ సీన్స్కథలో ట్విస్ట్ లు లేకపోవడం,రొటీన్ స్క్రీన్ ప్లే

అనంతపురంలో జాగ్రుతి అనే స్వచ్చంధ సంస్థ కింద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. రాజ కుటుంబమైన రాఘవరావు  దాన్ని ఊరి ప్రజల బాగుకోరిన వారికి రాసి ఇచ్చేస్తారు. జాగ్రుతి స్వచ్చంద సంస్థ విషయాలన్ని నారాయణ రావు (సాయి కుమార్) చూస్తుంటాడు. అయితే సంతోషంగా ఉన్న జాగ్రుతి సంస్థ మీద విక్రం సర్కార్ (కబిర్ సింగ్) కన్ను పడుతుంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆ ట్రస్ట్ కు సంబందించిన భూములన్ని తన పేరిట రాయించుకుంటాడు. ఆ ట్రస్ట్ తాలుకు రాజ కుటుంబీకుల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉటాయని.. దాని కోసం ఓ నెల పాటు గడువు అడుగుతారు నారాయణ రావు.


ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ గా ఉంటున్న బాలు (సాయి ధరం తేజ్) తండ్రి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి నివసిస్తుంటాడు. తనకు నచ్చిన విషయం కోసం రిస్క్ తీసుకునే క్యారక్టర్ గల బాలుకు అనుకోకుండా రాజన్ (మైఖేల్ గాంధి) కుర్రాడు తారస పడతాడు. అక్కడ నుండి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఓ పక్క మొదటి చూపులోనే లేడీ పోలీస్ గా బెల్లం శ్రీదేవి (రాశి ఖన్నా) సాయి ధరం తేజ్ లవ్ పడతాడు. అసలు విక్రం సింగ్ చంపాలనుకుంటుంది ఎవరిని..? రాజన్ కు బాలు ఎలా పరిచయమయ్యాడు..? జాగ్రుతి ట్రస్ట్ భూములు ఎవరి సొంతమయ్యాయి..? అన్నది అసలు కథ.       

సుప్రీం డోంట్ సౌండ్ హార్న్ అంటూ ఓ టెంపోతో వచ్చిన సాయి ధరం తేజ్ మరోసారి తన స్టైలిష్ యాక్షన్ ను చూపించాడు. బాలుగా సరదాగా క్యాబ్ డ్రైవర్ గా కనిపించే సాయి ధరం తేజ్ తనకు స్కోప్ ఉన్నంత వరకు మంచి ప్రతిభ కనబరించాడు. ఇక డ్యాన్సుల్లో కూడా మంచి ఈజ్ తో చేసి మెగా స్టామినా ఏంటో చూపించాడు. ఇక బెల్లం శ్రీదేవిగా పోలీస్ పాత్రలో నటించిన రాశి ఖన్నా కూడా ఓకే అనిపించింది. కథలో తన పాత్రకు స్కోప్ తక్కువ ఉన్నా ఉన్నంతలో రాశి పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సాంగ్స్ లో రాశి ఖన్నా గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంది. మెగాస్టార్ రీమిక్స్ సాంగ్లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నాల పెయిర్ బాగుంది. విక్రం సర్కార్ గా కబీర్ సింగ్ ఒకే కాని ఆ పాత్ర విలనిజాన్ని ప్రదర్శించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.


ఇక సినిమాలో బికుగా నటించిన రవి కిషన్ ఓ పక్క విలనిజం చూపిస్తూనే మంచి కామెడీ పండించాడు. బికు పక్క జబర్దస్త్ శేషు కూడా మంచి పంచ్ లిస్తూ కామెడీ చేశాడు. ఇక క్యారక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ మరోసారి తమ నటనా ప్రదర్శనతో ప్రేక్షకులు మెప్పించారు. సినిమాలో రాశి ఖన్నా తండ్రిగా రఘుబాబు, అసిస్టెంట్ గా వెన్నెల కిశోర్, కార్ల దొంగలుగా జింగ్ జింగ్ గ్యాంగ్ గా 30 ఇయర్స్ ఫృథ్వి, ప్రభాస్ శీను మంచి కామెడీ పంచారు. అంతేకాదు సన్నాయి మోతలతో బ్యాండ్ మేళం బ్యాచ్ గా పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి కూడా మంచి కామెడీని పంచారు.       

పటాస్ తో దర్శకుడిగా పరిచయమై సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి సుప్రీం గా సాయి ధరం తేజ్ ను చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ పాతదే అయినా దర్శకుడు దాన్ని తెరేక్కించే ప్రయత్నంలో కాస్త పొరపాట్లు చేసినా ఫైనల్ గా ఓకే అనిపించుకున్నాడు. ఇక సినిమాకు మరో ముఖ్య పాత్ర పోశించింది మ్యూజిక్. సాయి కార్తిక్ సంగీతం అందించిన సుప్రీం సాంగ్స్ సినిమాకు మంచి పాజిటివ్ ఎనర్జీని తెచ్చాయి.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాయి కార్తిక్ ఇంప్రెస్ చేశాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఓడిశా ఎపిసోడ్స్ లో కెమెరా పనితనం బగుంటుంది. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దిల్ రాజు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యానర్ రిచ్ నెస్ సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది.

పటాస్ తో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో కొత్త కోణాన్ని చూపించిన దర్శకుడు అనీల్ రావిపూడి సాయి ధరం తేజ్ తో సుప్రీం అంటూ వచ్చాడు. సినిమా మొదలైనప్పటి నుండి భారీ హోప్స్ ఉన్నాయి. అయితే సినిమా కథ ఓ చిన్న పిల్లాడిని అతని ఊరికి చేర్పించడం కోసం రాసుకున్న కథలో కొన్ని ఎమోషనల్స్ సీన్స్, కామెడీ సీన్స్ తో దర్శకుడు తన ప్రతిభను కనబడేలా చేసినా సినిమా ఎక్కడ సీరియస్ గా అనిపించదు. జాగ్రుతి ట్రస్ట్ ను సొంతం చేసుకోవాలనుకునే విక్రం సర్కార్ పాత్ర చాలా బలం ఉన్నదే అయినా ఆ పాత్రను తెర మీద చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఓ ట్రస్ట్ తాలుకు పేపర్లు కోర్ట్ వారు పెట్టిన గడువుకి తగిన సమయంలో అందించడమే అసలు కథ. ఆ ప్రయాణంలో సాగే సన్నివేశాలన్ని కామెడీతో నింపే ప్రయత్నం చేసినా ఆడియెన్స్ బోర్ ఫీల్ అవ్వడం జరుగుతుంది.  


సినిమా ఓపెనింగ్ తో కథ చెప్పేసిన దర్శకుడు విశ్రాంతికి ముందు కాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసినా   సెకండ్ హాఫ్ లో గ్రిప్ కోల్పోయాడు. కథ ముందే తెలియడంతో తెర మీద కనిపించే సన్నివేశాలకు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవ్వరు. ఇక బాలుగా దర్శకుడు అనుకున్న హీరో పాత్రలో సాయి ధరం తేజ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో హీరో ఇంకాస్త పరిణితి చెందాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఇక రాశి ఖన్నా క్యారెక్టర్ సినిమాలో అంత ఇంపార్టెంట్ లేదని చెప్పాలి. కామెడీ పండించేందుకు హీరోయిన్ తన ఫ్యామిలీని పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక రాజన్ గా నటించిన మైఖేల్ గాంధి తన పాత్ర వరకు పర్ఫెక్ట్ గా చేశాడు. చిన్న వాడైనా తన పలికే మాటలు చాలా విలువలతో ఉంటాయి. నా రాజ్యంలో ప్రజలందరు క్షేమంగా ఉండాలి అనే చెప్పే రాజన్ డైలాగ్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ఇక సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ లో సాగించడానికి దర్శకుడు అన్ని రంగాల్లో కృషి చేశాడు. సినిమాటోగ్రఫీ పరంగా సాయి శ్రీరాం ఓకే అనిపించాడు. ముఖ్యంగా సాంగ్స్ లో కెమెరా పనితనం బాగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి రీమిక్స్ సాంగ్ కూడా భలే ఆకట్టుకుంటుంది. సుప్రీం హీరో టైటిల్ మోసేందుకు అన్ని అర్హతలు తనలో ఉన్నాయంటూ చెప్పకనే చెప్తున్నాడు సాయి ధరం తేజ్.  

సినిమా చూసే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవ్వకూడదు.. తన సినిమా చూసి హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్లాలనుకునే దర్శకుల్లో అనీల్ ఒకరు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఇంకాస్త పట్టు సాధించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది. సగటు సినిమా ప్రేక్షకుడు సినిమా చూసి ఓకే అనేలా ఈ సినిమా ఉంటుంది. కొత్తదనం కోసం సినిమా చూసే వారికి ఈ సినిమా నచ్చాడు.. రొటీన్ కథ కథనాలతో తీసిన సుప్రీమ్ ఒక వర్గం ప్రేక్షకులు ఒకే అనేలా ఉంటే.. మెగా అభిమానులకు మాత్రం జోష్ ఇచ్చే సినిమా అవుతుంది.


'సుప్రీమ్' పటాస్ లా పేలలే..!

మరింత సమాచారం తెలుసుకోండి: