మ్యూజిక్ తప్ప ఏది లేదుమ్యూజిక్ తప్ప ఏది లేదుకథ కథనాలు మిగతావన్ని
రాజారాం (నారా రోహిత్) దర్శకత్వం అవకాశాల కోసం చూస్తుంటాడు. శతృవుని బలంతో కాదు తెలివితేటలతో కొట్టాలనే ఉద్దేశం కలవాడు. ఇక ఓ పక్క విజయ్ మాలిక్ (నందమూరి తారక రత్న) తను చేసే అరాచకాలకు ఎవరు అడ్డువచ్చినా వారిని సునాయాసంగా చంపి అడ్డుతొలగించుకునే క్రూయల్ మెంటాలిటీ. చైత్ర (ఇషా తల్వార్) ప్రేమలో రాజారాం ప్రేమలో పడుతుంది. రాజారాంకు దర్శకత్వం ఛాన్స్ ఇస్తానంటూ పోలీస్ వారు రాజారాంతో గేం ఆడతారు. దానిలో చైత్ర పాత్ర కూడా ఉంటుంది. రాజారాంతో మాలిక్ ను చంపించాలని ప్లాన్.. అసలు రాజారాంకు మాలిక్ కు ఉన్న సంబంధం ఏంటి..? చైత్ర ఎందుకు విజయ్ మాలిక్ ను చంపాలనుకుంది..? రాజారాం విజయ్ మాలిక్ ను ఎలా మట్టి కరిపించాడు..? అన్నదే అసలు కథ.      

రాజా చెయ్యి వేస్తే అంటూ నందమూరి తారకరత్న విలన్ గా నారా రోహిత్ చేసిన ప్రయత్నం బాగానే ఉంది. అయితే ముందుగా సినిమాలో విలన్ గా చేసిన  తారకరత్న తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నించినా సినిమా కథలో అంత దమ్ము లేకపోవడం వల్ల అంత పెద్దగా పేలలేదు. ఇక సినిమాలో దర్శకుడిగా అవ్వాలనుకుంటూ అనుకోని సమస్యల్లో చిక్కుకున్న రాజారాం పాత్రలో నారా రోహిత్ యావరేజ్ గా చేశాడు. అయితే రోహిత్ విషయంలో క్యారక్టర్ అంత ఎలివేట్ అవ్వలేదు అన్నది మెయిన్ పాయింట్. హీరోకు ఉండాల్సిన ఎనర్జీ.. క్యారక్టరైజేషన్ రాజారాం క్యారక్టర్ లో కనబడవు. హీరోయిన్ ఇషా తల్వార్ చైత్రగా తన పాత్ర మేరకు పర్వాలేదనిపించింది. అవసరాల శ్రీనివాస్, శశాంక్, శివాజిరాజా వారి పాత్రల పరిధి మేరకు నటించారు.   

రాజా చెయ్యి వేస్తే సినిమా దర్శకుడు సుధీర్ చిలుకూరి చేసిన ప్రయత్నం తెర మీద సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. అనుకున్న కథను తెర కెక్కించడంలో ఎన్నో లోటు పాట్లు కనిపించాయి. దర్శకుడిగా సుధీర్ అసలు మెప్పు పొందలేదు. ఇక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా ఈడోరకం ఆడోరకం హిట్ కొట్టిన ఈ సంగీత కెరటం ఇప్పుడు రాజా చెయ్యి వేస్తేలో కూడా మ్యూజిక్ పరంగా పర్వాలేదనిపించాడు. ఇక సర్వేష్ మురారి కెమెరా పనితనం బాగుంది. అయితే సినిమా ఎడిటింగ్ లో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటర్ ఇంకొన్ని కత్తెరలు వేసుంటే సినిమా కనీసం జనాలకు అర్ధమయ్యేది. స్క్రీన్ మీద అందంగా కనిపించిన హీరో హీరోయిన్స్ కాస్టూమ్స్, ముఖ్యంగా తారకరత్నను చాలా స్టైలిష్ గా చూపించడంలో కాస్టూమర్స్ సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. ఇక వారాహి బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతం. సినిమా తక్కువ బడ్జెట్ అయినా సరే చాలా రిచ్ లుక్ తో కనిపించింది.    



రాజా చెయ్యి వేస్తే అని దర్శకుడు సుధీర్ చేసిన ప్రయత్నం అసలు వర్క్ అవుట్ అవ్వలేదు. ఓ దర్శకుడు అవాలనుకున్న హీరోని తానో సమస్యలో ఇర్రుకునేలా చేసి దానికి కారణం హీరోయిన్ ఆడిన గేం అని చెప్పి.. ఇదంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది. హీరో క్యారక్టరైజేషన్ లో చాలా తప్పులు దొర్లాయి. దర్శకుడిగా ఛాన్స్ ఇస్తా అని చెప్పి కథ రాసి పంపమంటే మెయిల్ చేయడం వరకు బాగానే ఉన్నా అలాంటి వారితో డైరెక్ట్ మీటింగ్స్ లేకుండా వారు చెప్పినట్టు హీరో చేయడం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక హీరోయిన్ వాళ్ల నాన్నను చంపారాని చిన్నప్పటినుండి పగ పెంచుకున్నదని చూపించిన దర్శకుడు ఆ పగని హీరోతోనే డైరెక్ట్ గా షేర్ చేసుకోక పోగా హీరోని ఓ జోకర్ లా వాడాలనుకోవడం వీక్ పాయింట్. ఇక ఇదే పాయింట్ చాలా సినిమాల్లో కనపడ్డది కూడా. అంతేకాదు సినిమా స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు సినిమా పూర్తిగా పట్టు తప్పించాడు. రోహిత్ క్యారక్టర్ లో ఎటువంటి క్లారిటీ మెయింటైన్ చేయలేదు సరికదా హీరో విలన్ లాస్ట్ ఫైట్ లో తప్ప అంతకుముందు కలవక పోవడం కూడా సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం చాలా బోరింగ్ గా.. స్లోగా సాగుతుంది.. సెకండ్ హాఫ్ అయితే జనాలకు హింస అనే చెప్పాలి. దర్శకుడి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా మిస్ యూజ్ చేసుకున్నాడు.

సినిమాలో మ్యూజిక్ కాస్త పర్వాలేదనిపించగా.. కెమెరా మెన్ వర్క్ అవుట్ కూడా బాగానే ఉంది. రోహిత్ తన పాత్రలో ఇంకా మంచి అభినయాన్ని కనబరిచితే బాగుండేది. ఇక తారక రత్న ఇదవరకు కంటె బెటర్ అనిపించినా సినిమాకు ఏమాత్రం లాభం చేకూరలేదు. హీరోయిన్ తండ్రిని చంపినప్పుడు అడ్రెస్ మిస్ అయ్యి చంపానని సారీ చెప్పడం సిల్లిగా ఉన్నా.. ఆ క్రూరత్వం తర్వాత చూపించడంలో విఫలమయ్యాడు. సినిమా మొదట్లో భయంకరంగా చూపించిన విలన్ ను అంత ఈజీగా చంపడం కూడా కామెడీగా అనిపిస్తుంది. సినిమాలో అన్ని విభాగాల్లో సరైన పనితనం చూపించలేదు. సగటు సిని ప్రేక్షకుడికి ఇదో తలనొప్పి సినిమా అవుతుంది.   



Pradeep ,Sai Korrapati ,Nara Rohit ,Taraka Ratna, Isha Talwar ,Sai Karthikరాజా రోహిత్ కు మరో అపజయం..!

మరింత సమాచారం తెలుసుకోండి: