విశాల్ ,శ్రీ దివ్య ,కమెడీ, ఫైట్స్ విశాల్ ,శ్రీ దివ్య ,కమెడీ, ఫైట్స్ స్లో నేరేషన్సె ,కండ్ హాఫ్ ,క్లైమాక్స్

సుబ్బా రాయుడు (విశాల్) అందరు రాయుడు అనే పిలిచే కుర్రాడు సింహానికి ఉన్న పొగరు.. పౌరుషంతో ఉంటాడు. అనంతపురంలో ఓ గ్రామంలో నివసిస్తున్న రాయుడు తన ముందు ఎలాంటి అన్యాయం జరిగినా అవతల ఎలాంటి వారినైనా వదలడు. ఇక మరో పక్క పాపంపేటలో భైరవ (రాధ రవి) అనే పెద్ద మనిషి ఉంటాడు. రౌడీ మూకలతో తనకు అడ్డొచ్చిన వారిని అడ్డుతొలగించుకుంటూ తనకు సహచరులుగా ఉన్న రోలెక్స్ బాచి (సురేష్ ఆర్.కె) అక్కడ అధికారం చెలాయిస్తూ ఉంటాడు. అయితే తన మూర్ఖమైన పనులతో ఒకసారి తనకు అడ్డుగా ఉన్న భాగ్యం (శ్రీ దివ్య) తల్లి భానును హతామారుస్తాడు. అయితే ఆ హత్య కారకుడైన బాచి మీద కేసు వేయడంతో భాగ్యం ఆమె తండ్రిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే రాయుడు భాగ్యాన్ని ప్రేమించడం వారికి రాయుడు అండగా నిలవడం జరుగుతుంది. అయితే అసలు భానును బాచి ఎందుకు చంపాడు..? భైరవను బాచి ఎందుకు చంపాల్సి వస్తుంది..? రాయుడు అన్నమ్మ మంగమ్మను చంపిన వారి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది అసలు కథ.   

తెలుగు వాడైన విశాల్ తమిళంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పందెం కోడి తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేని విశాల్ రాయుడులో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పక్కా మాస్ మనిషిగా విశాల్ అదుర్స్ అనిపించాడంతే.. ఇక తనదైన మాసిజం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక్కువగా హాఫ్ సారీలో కనబడ్డ శ్రీ దివ్య తన సహజ నటనను కనబరచి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. విశాల్ ఫ్రెండ్ మగధీర్ ఐ. కొక్కోరొకో క్యారక్టర్ లో సురీ అదరగొట్టేశాడు.


విశాల్ కు సురీకి మధ్య వచ్చే సీన్స్ మంచి కామెడీని పంచుతాయి. అంతేకాదు సినిమాలో అన్నమ్మగా నటించిన ఆమె తన నటనతో అందరిని ఆకట్టుకుంది. చివరకు చనిపోయే సీన్స్ లో కూడా ఆమె నటన అద్భుతం. భైరవగా రాధా రవి మరోసారి హుందా తనమైన పాత్రలో నటించి మెప్పించగా.. విలన్ గా సురేష్ ఆర్.కె బాచి క్యారక్టర్ లో ఇరగొట్టేశాడు. కరకు రాతి గుండె అన్న పదానికి నిదర్శనంగా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక మిగతా వారు కూడా తమ తమ పాత్రల మేరకు మంచి నటన కనబరిచారు.   

ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ రాయుడు కోలీవుడ్ లో మరుదుగా రిలీజ్ అయ్యింది. విషాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా తెలుగులో హరి రిలీజ్ చేశారు. రాయుడుని మాస్ సినిమాగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక ఇమ్మాన్ మ్యూజిక్ సినిమాలో సాంగ్స్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాకు తగ్గ మ్యూజిక్ ఇచ్చి సంగీత దర్శకుడు ఇమ్మాన్ అదరగొట్టేశాడు. ఇక కెమెరామన్ వేల్ రాజా పనితనం సినిమాలో బాగా కనబడ్డది.. సినిమా మొత్తం విలేజ్ బ్యాక్డ్ డ్రాప్ లోనే కాబట్టి ఆ విలేజ్ అట్మాస్పియర్ బాగా కబడేలా చేశారు. సినిమా అంతా చాలా సహజంగానే ఉంటుంది.


ఇక తమిళ సినిమాల్లో ఉండే మంచి క్వాలిటీనే అది కావాలని సినిమాలకు నప్పని సన్నివేశాలను ఫారిన్ లొకేషన్స్ వాడరు. అది ఈ సినిమాలో ప్లస్ పాయింట్. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. గోప్రురం ఫిలిమ్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా కనిపించాయి. 

ఏ చిత్ర పరిశ్రమైనా సరే సినిమాలేవి లేక చేసిన సినిమాలే చేస్తూ చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. సో అలాంటి కోవలోనే ఈ రాయుడు కూడా చూసేప్పుడు ఎప్పుడో ఏదో ఒక సినిమాలో చూసిన కథలానే ఉంటుంది. ఊరిలో దుర్మార్గులు రౌడీలు వారిని ఎదురించే ఓ హీరో.. విలన్ గ్యాంగ్ ను పట్టించే సాక్ష్యం హీరోయిన్ దగ్గరుండంతో ఆమెను చంపాలని చూడటం దానికి హీరోయిన్ హీరో సపోర్ట్ అడగటం. హీరో విలన్ గ్యాంగ్ నుండి ఆమెను కాపాడటం ఇలా సేమ్ ఇదే కథను ఎన్నోసార్లు చూశాం.  

రాయుడు కథ కూడా అదే అయితే ముత్తయ్య దీన్ని పక్కా మాస్ సినిమాగా తెరకెక్కించారు. హీరోని అన్నమ్మ పెంచుకుంటే అతన్ని ఓ వీరుడిలా పెంచుతుంది. ఇక హీరోయిన్ తల్లికి కష్టమొస్తే మొదట హీరోని సైడ్ చేసిన అన్నమ్మ చివరకు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడాలని కోరుతుంది. అయితే సినిమా మొత్తం ట్రీట్ మెంట్ బాగున్నా సెకండ్ హాఫ్ లో ఆడియెన్స్ కాస్త విసుగు వస్తుంది. మొదటి భాగం అంతా బోర్ కొట్టకుండా నడిపించగలిగిన దర్శకుడు ముత్తయ్య సెకండ్ హాఫ్ లో సాగదీశాడని చెప్పాలి. భైరవ పాత్రను ముందునుండి ఎదో ఉంది అన్నట్టు చూపించి చివరకు ఆ పాత్రను బాచి చేత చంపిస్తాడు. అది ఎవరికి అర్ధం కాని ట్విస్ట్. అంత పెద్ద మనిషిని చంపేసిన మూర్ఖత్వం అని చూపించే ప్రయత్నం చేసినా తన మీద చెయ్యి లేపిన మనిషి తనను చంపుతాడు అన్న ఆలోచన భైరవ ఎందుకు చేయలేదు అన్న ఆలోచన వస్తుంది.


సినిమా చివర 20 నిమిషాలు పరమ బోర్.. హీరో బామ్మ అన్నమ్మను చంపే సీన్స్ మరి ఆడియెన్స్ ను ఇబ్బంది పెడతాయి. అయితే అది ఎమోషనల్ టచ్ ఇచ్చే ఉద్దేశంతో దర్శకుడు అనుకున్నా.. ఆమెను చంపడం ఖాయం మధ్యలో ఈ ఆటలెందుకు అని అనుకుంటారు. ఇక ఫైనల్ గా ఆమెను చంపిన విలన్ ను హీరో మట్టికరిపించడం.. సో సినిమా అవ్వడానికి ఓ అర్ధ గంట ముందే సినిమా అయ్యింది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ముందే తెలిసిపోతుందన్నమాట. ఇక తెలిసిన స్టోరీని కూడా అంత అందంగా తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు.

విశాల్ పర్ఫార్మెన్స్ సినిమాలో పీక్స్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రీ దివ్య కూడా ఇంప్రెస్ చేసేసింది. తెలుగమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అన్న ఆలోచన వస్తుంది. శ్రీ దివ్య లుక్స్ సినిమాలో సింప్లీ సూపర్బ్. సో మొత్తానికి ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ పర్వాలేదనిపించినా సినిమా స్క్రీన్ ప్లే లో మరింత జాగ్రత్త పడి ఉంటే కాస్త బాగుండేది. సినిమా అంతా సాగదీతగా అనిపించేసరికి విశాల్ మరోసారి హిట్ మిస్ అయ్యాడనే చెప్పాలి. మాస్ అంశాలున్న సినిమా.. శ్రీ దివ్య అందాలను చూడాలనుకునే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ సినిమాలు కాదు కొత్త కథ కథనాలు ఆశించే వారికి ఇది కచ్చితంగా నిరాశ పరుస్తుంది. 


Vishal,Sri Divya,Mutthayya,Vishal,Hari Venkateswara Pictures,D Immanఊర మాస్ 'రాయుడు' జనాలకు ఎక్కడం కష్టమే అబ్బా..!

మరింత సమాచారం తెలుసుకోండి: