సుమంత్ అశ్విన్ ,కాళకేయ ప్రభాకర్ ,కెమెరామెన్ పనితనం సుమంత్ అశ్విన్ ,కాళకేయ ప్రభాకర్ ,కెమెరామెన్ పనితనం కథ , కథనం ,బ్యాడ్ నేరేషన్ , డైరక్షన్

కొత్తగా కండక్టర్ జాబ్ లో జాయిన అయిన రవి (సుమంత్ అశ్విన్) ఎస్.కోట డిపో నుండి గవిటికి బస్ రూట్ లో వెళ్తుంటాడు. ఇక బస్ డ్రైవర్ గా శేషు (ప్రభాకర్) ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు. డ్రైవర్, కండక్టర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే గవిటిలో కళ్యాణి (పూజా జవేరి)తో ప్రేమలో పడతాడు రవి. అదే ఊరిలో విశ్వనాధం (నాజర్) పెద్ద మనిషి ఉంటాడు. రిటైర్డ్ టీచర్ గా ఉన్న ఆయన తన స్నేహితుడి కూతురు అమృత (పావని గంగిరెడ్డి)ని కొడుకు దేవాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. అయితే దేవ అనుకోకుండా సూరత్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ యాక్సిడెంట్ కూడా బస్ కండెక్టర్, డ్రైవర్ వల్లే జరుగుతుంది. రక్తంతో తడిసిన దేవను హాస్పిటల్ కు తీసెకెళ్లమని ఓ వ్యక్తికి అప్పగించగా అతను దేవను లోయలో పడేస్తాడు. అసలు దేవను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..? విశ్వనాధ్ కు నమ్మిన బంటుగా ఉన్న భద్ర ఏం చేశాడు..? కళ్యాణిని రవి పెళ్లి చేసుకున్నాడా..? అన్నది అసలు కథ.

రైట్ రైట్ అంటూ వచ్చిన సుమంత్ అశ్విన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే తన పాత్ర వరకు పర్వాలేదనిపించిన సుమంత్ సినిమాకు హిట్ కావాల్సిన అంశాలను మిస్ చేసుకున్నాడు. కేరింత తర్వాత చేసిన ఈ సినిమాలో రవి పాత్రకు న్యాయం చేసినా సినిమా మాత్రం సుమంత్ కు బ్యాడ్ ఇమేజ్ తీసుకు వస్తుంది. ఇక హీరోయిన్ కళ్యాణిగా నటించిన పూజా జవేరి పర్వాలేదు కాని ఆమెకు సినిమాలో ఎక్కువ స్కోప్ లేకుండా పోయింది. సీనియర్ నటుడు నాజర్ సినిమాకు కాస్త హెల్ప్ అయ్యారు. ఆయన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక విలన్ గా చేసిన భద్ర మంచి నటన కనబరిచాడు. ఇక ముఖ్యంగా సినిమాలో హీరో పక్కన బస్ డ్రైవర్ గా బాహుబలి ప్రభాకర్ సినిమా మొత్తం ఉన్నాడు. తనలోని నటన బయటకు తీసే ప్రయత్నంలో ఓ మంచి రోల్ ప్లే చేశాడు ప్రభాకర్. ఇంకా వీరే కాకుండా రావు రమేష్, జీవా చిన్న చిన్న పాత్రలు వేసి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సినిమా దర్శకుడు మను సినిమా నీట్ గా ప్రెజెంట్ చేశాడు కాని ఎంటర్టైన్ మాత్రం చేయలేకపోయాడు.  ఓ మలయాళ సినిమాను ఆ ఫీల్ మిస్ అవ్వకుండా సినిమా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలో బెస్ట్ అన్నది ఏదన్నా ఉంది అంటే అది కెమెరామన్ శేఖర్ వి జోసెఫ్ పనితనం. కథకు తగ్గ లొకేషన్స్ ను షాట్ టు షాట్ బాగా నీట్ ప్రెజెంట్ చేశాడు. జె.బి అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఉద్దవ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.  

మలయాళ సినిమాను తెలుగులో తీసే దర్శక నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అయితే కథ కథనాలను బట్టి ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కాని రైట్ రైట్ లో దర్శకుడు ఆ యాస్పెక్ట్ లో విఫలమయ్యాడు. సినిమా చూస్తుంటే 80-90ల సినిమాల్లా అనిపిస్తుంది. సుమంత్ అశ్విన్ పాత్రకు న్యాయం చేసినా తానో కుర్ర హీరో అవ్వడం చేత తనని డైజెస్ట్ చేసుకోలేకపోయారు.


సినిమా కథ పాతదే అయినా దాన్ని తెరకెక్కించడంలో కూడా దర్శకుడు మను పాత పద్ధతినే ఫాలో అయ్యి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ సినిమాలొస్తున్న ఈ టైంలో ఇలాంటి సినిమాలను ఒప్పించాలంటే టైట్ స్క్రీన్ ప్లే కంపల్సరీ కాని సినిమా చూస్తున్న ప్రతి ఆడియెన్స్ సినిమాలో చివరకు జరిగేది ఊహించేస్తాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొడుతుంది.  


ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా అసలు లేదు.. హీరో హీరోయిన్ ల మధ్య సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. రొమాన్స్ అన్నది లేదు అని చెప్పాలి. ఇక హీరోయిన్ క్యారక్టర్ చాలా వీక్ గా చూపించినట్టు అనిపిస్తుంది. సినిమాను ఓ రెండు వారాల నుండి ఓ రేంజ్ ప్రమోట్ చేస్తున్న చిత్రయూనిట్ సినిమా ఓ పాత చింతకాయ పచ్చడిలా తీశారు. ఫైనల్ గా ఏంటంటే రైట్ రైట్ అంటూ రైట్ రూటులో వెళ్లాల్సిన సుమంత అశ్విన్ బస్సు పూర్తిగా ట్రాక్ తప్పి రాంగ్ రూట్ లో వెళ్లింది. 


Sumanth Ashwin, Pooja Zaveri, Nasser, Shakalaka Shankar, Dhanraj, Tagubothu Ramesh, Jeeva, Raja Ravindraరైట్ రైట్.. సుమంత్ అశ్విన్ విఫల ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: