సందీప్ కిషన్ ,నిత్యా మీనన్సందీప్ కిషన్ ,నిత్యా మీనన్కథ , కథనం ,మ్యూజిక్ ,డైరక్షన్

కృష్ణ వచన్ (సందీప్ కిషన్) తన చేస్తున్న పనికి మానిపులేషన్స్ కాదు కాలిక్యులేషన్స్ తో విన్ అయ్యేవాడు. చిన్నప్పటి నుండి మాంగో (నిత్యా మీనన్) అంటే ఇష్టంతో ఉంటాడు కృష్ణ. ఇక ఇదిలా ఉంటే హైదరబాద్ ను బాంబు పేలుల్లతో బెంబేలెత్తేలా చేసిన టెర్రరిస్ట్ అస్లాం భాయ్ (రాహుల్ దేవ్) ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చెంచల్ గూడ జైల్ ఉన్న తనను తీహార్ జైల్ కు తీసుకెళ్లాలని పోలీస్ వారి ప్లాన్. అయితే ఈలోపే హైటెక్ సిటీ లోని ఓ ఫ్లై ఓవర్ లో ట్రాఫిక్ జాం అయ్యేలా చేసి.. పెద్ద బాంబ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తారు అస్లాం భాయ్ మనుషులు. ఆ క్రమంలో అన్వర్ (రవి కిషన్) తన మనుషులతో యాక్సిడెంట్ చేయించి ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ ఆగిపోయేలా చేస్తారు. ఇక బాంబ్ బ్లాస్ట్ చేయడానికి మాత్రం తన మనిషి అక్కడ కనిపించడు. ఈ క్రమంలో ఆటోలో వస్తున్న మాంగో, బైక్ మీద వస్తున్న కృష్ణ ఫ్లై ఓవర్ మీద కలుసుకుంటారు. ముందు గొడవతో మొదలైన వీరి పరిచయం తాము చిన్నప్పుడు విడిపోయిన స్నేహితులుగా గుర్తిస్తారు. కాని ఒకరికి ఒకరు చెప్పుకోరు.. ఇక ఇప్పుడు అన్వర్ చూపు కృష్ణ మీద పడుతుంది. ఫ్లై ఓవర్ లో ప్రేమపాఠాలు చెప్పుకుంటున్న తనకు ఓ షాక్ ఇస్తాడు. తాను చెప్పినట్టు చేకపోతే తన మాంగోని చంపేస్తాడని బెదిస్తాడు. అందుకే అన్వర్ చెప్పినట్టుగా పనులన్ని చేసి తానో టెర్రరిస్ట్ అన్న అనుభూతి ఫ్లై ఓవర్ లో ఉన్న వారికి కలిగేలా చేస్తాడు. అసలు కృష్ణ టెర్రరిస్ట్ ల టార్గెట్ ఎలా అయ్యాడు..? అసలు ఇదంతా ఎందుకు నడిపిస్తున్నాడు..?  చివరకు ఏమైంది అన్నది అసలు కథ.   

కృష్ణ వచన్ గా సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. సినిమాలో సందీప్ రివీల్ అయిన మొదటి డైలాగే తన క్యారక్టరైజేషన్ తెలిసేలా చేసింది. ఇక దానిలో ఒదిగిపోయి చేశాడు సందీప్. ఇక అన్వర్ ఇచ్చిన గైడెన్స్ లకు స్ట్రగుల్ అవుతూ సందీప్ బాగా నటించాడని చెప్పాలి. ఇక మాంగోగా నిత్యా తన సహజ నటనను కనబరిచింది. చెప్పే డైలాగ్ ఏదైనా అభినయంతో చూపించే నిత్యా ఈ పాత్రకు తన పరిధి మేరకు నటించింది. ఇక విలన్ అన్వర్ గా నటించిన రవి కిషన్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. హీరోని మైండ్ గేం తో ఆడుకునే అన్వర్ పాత్రలో రవికిషన్ ఓకే అనిపించుకోగా.. అస్లాం భాయ్ గా రాహుల్ దేవ్ కేవలం తక్కువ పాత్రకే పరిమితమయ్యాడు. ఇక సినిమాలో నటించిన కమెడియన్స్ ఆలి, సప్తగిరి, తాగుబోతు రమేష్, థర్టీ ఇయర్స్ పృధ్వి ఇలా అందరు కలిసి ట్రాఫిక్ జాంలోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా అజయ్ మరోసారి కనిపించి అలరించగా.. ఝాన్సీ కూడా ఈ సినిమాలో కాప్ గా కనిపించింది.  

రచయితగా ఎంతో అనుభవం ఉన్న రాజ సింహ ఎప్పుడే 7 ఏళ్ల క్రితం రాసుకున్న ఈ కథ కొత్తగానే ఉన్నది అని చెప్పగలం. కాని కథను తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడిగా తాను సక్సెస్ కాలేదన్నది వాస్తవం. సినిమాకు చోటా కె నాయుడు కెమెరా వర్క్ బాగుంది. ఎక్కువగా సినిమా సి.జి వర్క్ ఉండటంతో అది తెర మీద కనిపిచింది. మిక్కి మ్యూజిక్ కూడా అంత పెద్ద నోటబుల్ గా లేదు. కేవలం సినిమాలో తప్ప బయటకు వచ్చాక ఒక్క పాట కూడా గుర్తు పెట్టుకునే అవకాశం ఉండదు. కాకపోతే ఫ్లై ఓవర్ కాంపౌండ్ కు ఎలెక్ట్రికల్ షాక్ ఇవ్వకుండా అతని క్యారక్టర్ మార్చే క్రమంలో వచ్చే సాంగ్ బాగుంటుంది. నిర్మాత అంజిరెడ్డి సినిమా మీద ఉన్న అభిరుచి అంతా సినిమా ప్రొడక్షన్ లో రిచ్ గా కనిపించింది. 

రచయిత దర్శకులుగా మారినప్పుడు తాము రాసుకున్న కథ తెర మీద తమకంటే ఇంకెవ్వరు అందంగా తెరకెక్కించ లేరు అన్న భయంతో అలా చేస్తారు. అయితే ఇక్క రాసుకున్న రచయిత దర్శకుడిగా మారినా కూడా లాభం లేదు అని చెప్పాలి. ఓ కస్టడీలో ఉన్న టెర్రరిస్ట్ ను రిలీజ్ చేసేందుకు హై టెక్ సిటీ ఫ్లై ఓవర్ ను టార్గెట్ చేసి అక్కడ ఓ యాక్సిడెంట్.. ట్రాఫిక్ జామ్.. ఇలా అన్ని ఆపరేషన్స్ చేసి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి విధ్వంసం సృష్టించాలనుకుంటారు. అంతేకాదు ఆ పాయింట్ తో అస్లాం భాయ్ ను కూడా విడిపించాలనే డిమాండ్ కూడా చేయాలనుకుంటారు. అంతలో కథలోకి ఓ అన్ నోన్ క్యారక్టర్ ఎంటర్ అవడం.. అతని సహాకరంతో ఆ ఆపరేషన్ చేయాలనుకోవడం వరకు దర్శకుడు అనుకున్న కథ బాగుంది. కాని ఎక్యుక్యూషన్ టైం లో అది దెబ్బేసింది.  


ఓ రోజు మొత్తం ట్రాఫిక్ జాం అవుతుంటే గవర్న్ మెంట్, పోలీస్ డిపార్ట్ మెంట్ అలా చూస్తూ ఉండటం కాస్త వెటకారంగా ఉంది. ఇక అన్వర్ కృష్ణ చివరి మూమెంట్లో జోకులు వేయడం కూడా అతిగా అనిపిస్తుంది. ఇక తెలివిగల వాడు కాబట్టి అన్వర్ ను పక్క దారి పట్టించి అక్కడ వారికి సేవ్ చేయాలనే చూస్తాడు హీరో కాని అక్కడ మాత్రం తన కాలిల్యులేషన్స్ చూపించకపోవడం ఆశ్చర్యం. సినిమా మొత్తం ఫ్లై ఓవర్ మీదే ఉంటుంది. కథ కథనాలు రాసుకున్న విధానం మంచిగానే అనిపించినా వాటికి తెర మీదకు ఎక్కించిన విధానంలో దర్శకుడు విఫలమయ్యాడు.  


కొన్ని యాంగిల్ లో సినిమా బాలీవుడ్ 'ఏ వెడ్ నెస్ డే' ను గుర్తుకు తెస్తుంది. ఇక సినిమాలో లవ్ స్టోరీ అంతగా వర్క్ అవుట్ కాలేదు.. ఇక కామెడీ కూడా అదే పరిస్థితి.. పోనీ సస్పెన్స్ ఏమన్నా ఉందా అంటే అది కూడా సో సోగానే ఉంది. మొత్తనికి దర్శకుడి మీద నమ్మకంతో ఒక అమ్మాయి తప్ప మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్ కిషన్ కు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పాలి.    


Sundeep Kishan , Nithya Menen , Ali Rao Ramesh , Tanikella Bharani , Ravi Kishan , Brahmanandam ,సందీప్ ను ఒక అమ్మయి కూడా కాపాడలేకపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: