నాని ,నివేదా థామస్ ,మ్యూజిక్నాని ,నివేదా థామస్ ,మ్యూజిక్ సెకండ్ హాఫ్ ,ఎడిటింగ్

 గౌతం (నాని) ఐఐటి అహ్మదాబాద్ లో ఎం.బి.ఏ చేసి ఉద్యోగం కోసం ట్రైల్స్ లో ఉంటాడు. తనకు నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతున్న గౌతంకు కేథరిన్ (నివేదా థామస్) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన గౌతం ఆమెను లైన్లోకి దించుతాడు. ఇక మరో పక్క ఐశ్వర్య ఎస్టేట్స్ కు వారసురాలు ఐశ్వర్య (సురభి). సినిమా ఐశ్వర్య, కేథరిన్ ఇద్దరు ఫ్లైట్ మీటింగ్ తో మొదలవుతుంది. ఇక ఆ పరిచయంతోనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఓ పక్క జై బెస్ట్ బిజినెస్ మేన్ అవార్డ్ తీసుకోగా ఆమెతో ఐశ్వర్యను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఫిక్స్ చేస్తారు. వి.ఎఫ్.ఎక్స్ కోర్స్ కోసం లండన్ వెళ్లి వచ్చిన కేథరిన్ కు గౌతం చనిపోయాడని తెలుస్తుంది. ఐశ్వర్య పెళ్లి చేసుకునే జై కూడా గౌతం పోలికలు ఉండటం ఆమెను ఆలోచనలో పడేస్తుంది. ఇక ప్రతిరోజు విలేఖరి గీత సహాయంతో అసలు జరిగిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతకీ గౌతం, జై ఇద్దరా ఒకరా..? జై, ఐశ్వర్య పెళ్లి జరిగిందా..? గౌతం ఎలా చనిపోయాడు అన్నది అసలు కథ.  

జెంటిల్ మెన్ సినిమా కచ్చితంగా నాని మాత్రమే చేయగల సినిమా అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేంలో హీరోగా ఉంటూనే విలన్ లా అనిపించుకునేందుకు కష్టపడ్డాడు. సినిమా మొత్తం నాని వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇక కొద్దిసేపైనా గౌతంగా నాని సింప్లీ సూపర్బ్. జై గా హుందాగా నటించినా.. ఆడియెన్స్ అందరు గౌతం క్యారక్టర్ కు కనెక్ట్ అవుతారు. రెండు పాత్రల్లో మంచి వేరియేషన్స్ చూపించి నాచురల్ స్టార్ గా మరో మెట్టుకి ఎదిగాడు నాని.

ఇక హీరోయిన్స్ గా నటించిన నివేదా థామస్, సురభిలు కేవలం గ్లామర్ కోసమే అన్నట్టు కాకుండా కథలో పాత్రల మేరకు నటించారు. ముఖ్యంగా కేథరిన్ గా నటించిన నివేదా నాని తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సురభి క్యూట్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. జెంటిల్ మన్ గా అవసరాల శ్రీనివాస్ నెగిటివ్ రోల్ చేయడం విశేషం. పైకి మంచిగా కనపడుతూనే అవసరాల శ్రీనివాస్ బాగా మెప్పించాడు. ఇక సినిమాలో నటించిన మిగతా స్టార్ కాస్ట్ వెన్నెల కిశోర్, తణికెళ్ల భరణి, ఆనంద్, రోహిణి లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  



సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెర మీదకు తీసుకురావడం సక్సెస్ అయ్యాడు. నాని సినిమా అంటే ఎలా ఉండాలో అలా ఉంది. ముందునుండి చెబుతున్న హీరోనా విలనా అన్న కాన్సెప్ట్ వర్క్ అవుట్ అయ్యేలా చేశాడు. ఇక సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన పి.జి.విందా కెమెరా పనితనం చాలా హెల్ప్ అయ్యింది. ఇక మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా పెద్ద ప్లస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ ను రెట్టింపు చేసేలా చేసింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఒకే అనేలా ఉంది.. సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని కత్తెరలు పడి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పాటల్లో లొకేషన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంటుంది. జెంటిల్ మెన్ ను రిచ్ గా తీయడంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ సక్సెస్ అయ్యారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 



హీరోయిన్స్ ఇద్దరు ఫ్లైట్ లో ఒకరు లవర్ గురించి.. మరొకరు కాబోయే వరుడు గురించి మాట్లాడటంతో స్టార్ట్ అవుతుంది. ఇక ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు హీరోయిన్స్ ఒకరికే హాయ్ చెబుతారు. తీరా కట్ చేస్తే కేథరిన్ లవర్ గా కాకుండా ఐశ్వర్య ఉడ్ బీగా జై ప్రత్యక్ష మవుతాడు. అక్కడ స్టార్ట్ అయిన కేథరిన్ డౌట్ జై అసలు ఎవరు.. తన మెయిన్ ఎయిమ్ ఏంటి అన్న దాని మీద నడుస్తుంది. జరుగుతున్న అన్ని పనులకు జై కారణం అవుతాడు.. దానితో అతనే విలన్ అని ఫిక్స్ అవుతుంది. ఇక అతన్ని విలన్ గా నిరూపించే మార్గంలో తానే అంతా నడిపిస్తుంది.   


ఇంద్రగంటి మోహనకృష్ణ రాసుకున్న ఈ కథ సస్పెన్స్ లా మెయిన్ చేయడంలో సక్సెస్ అయినా మొదటి భాగం పండించినంత ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో లేదు. కేవలం కామెడీతో ఎంటర్టైన్ మెంట్ అని కాదు సినిమా సస్పెన్స్ రివీల్ చేసే క్రమంలో కాస్త లాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించేలా ఉంటే.. సెకండ్ హాఫ్ కాస్త స్లో అవుతుంది. పేపర్ మీద రాసుకున్న సీన్ తెర మీద చూపించడంలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఇంద్రగంటి సక్సెస్ సాధించాడనే అనాలి.


ఇక ప్రతిరోజు అనే ఓ రిపోర్టర్ కేథరిన్ ఇళ్లు వెతుక్కుంటూ వచ్చి అంతలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎందుకనేది అర్ధం కాదు. కేథరిన్ జై, వంశీ సీక్రెట్ గా కలుసుకునే ప్లేస్ కు వెళ్తుంది కాని అక్కడ వంశీని ఎందుకు అనుమానించలేదు అన్న ఆలోచన వస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా రాసుకున్న ఇంద్రగంటి కొన్ని సీన్స్ లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది.   


ఫైనల్ గా జై లా ఉన్నది జై కాదు గౌతం అన్న విషయం చెప్పే సరికి ఆడియెన్స్ కాస్త షాక్ అవుతారు. ఇక తనను అంతలా ఇబ్బంది పెట్టిన వంశీ (అవసరాల శ్రీనివాస్) ను అంతా ఈజీగా చంపడం బాలేదు. సినిమాలో హీరో నానినే.. అసలు చేసేది డబుల్ రోలా.. సింగిల్ రోలా అన్న పాయింట్ లాస్ట్ మినిట్ లో రివీల్ చేస్తాడు. అయితే నాని హీరో కాబట్టి తను చేసే ప్రతి పనికి ఓ కారణం ఉంటుంది.. లాస్ట్ లో ఏదో ఉంటుంది అని ఊహించిన ఆడియెన్స్ కు ఫ్లాష్ బ్యాక్ అనుకున్నంత పండలేదు. తన రూపంతో ఉన్న జై  ఇండస్ట్రీస్ అధినేత జైను కలవాలని అనుకుంటాడు. కాని ఇంతలో తనని చంపడం అది కూడా తనని చంపాలనే కారణంతో అని తెలవడంతో జై లా మారిపోతాడు. 


సినిమా సినిమాకు కొత్త కథలతో అలరించే నాని జెంటిల్ మెన్ సినిమాతో కచ్చితంగా కొత్త కథతో వచ్చాడని చెప్పాలి. ఇక తనలోని నెగటివ్ యాంగిల్ ను చూపించినట్టు కనిపిస్తూ చేసిన నటన అద్భుతం. కచ్చితంగా ఒక్కసారి చూసే సినిమాగా జెంటిల్ మెన్ ఉంటుంది. 



Nani,Surabhi ,Niveda Thomasహీరోగానే కాదు నాని విలన్ గా కూడా జెంటిల్ మెన్..!

మరింత సమాచారం తెలుసుకోండి: