ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ,కాస్త కామెడీఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ,కాస్త కామెడీమిస్సింగ్ ఎమోషన్ ,డైరక్షన్ ,స్క్రీన్ ప్లే
యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న హీరో యువన్ (సాయి రోనక్) తల్లిదండ్రులను ఓ యాక్సిడెంట్ లో పోగొట్టుకుంటాడు. ఇక అప్పటి నుండి ఒటరి జీవితాన్ని బ్రతుకుతున్న యువన్ తొలిప్రేమ చాలా మధురమైనదని తను చదువుతున్న కాలేజ్ డీన్ కూతురు శాండి (అదితి సింగ్) ను ప్రేమిస్తాడు. యువన్ ప్రపోజల్స్ మెచ్చిన శాండి ప్రేమలో పడుతుంది. ఇక ఇక్కడే అస్లు ట్విస్ట్ యువన్, శాండిలను దూరం చేస్తాడు హీరోయిన్ తండ్రి. ఇక సినిమా ట్రాజెడీగా నడుస్తున్న సమయంలో స్వర (ఐశ్వర్య) ప్పరిచయమవుతుంది యువన్ కు. తన ప్రేయసి కోసం రాసుకున్న తొలిప్రేమ పుస్తకాన్ని చదివిన స్వర యువన్ ను ఇష్టపడుతుంది. దూరమైన శాండి కూడా మరోసారి యువన్ ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఇప్పుడు యువన్ ప్రేమకథ ఎల అంతమయ్యింది..? యువన్ ఇష్టపడ్డ స్వర ఏం చేసింది..? అన్నది అసలు కథ.



హీరో హీరోయిన్ ఇద్దరు తొలి పరిచయమే.. కాబట్టి సన్నివేశాలు ఎంత బలంగా ఉన్నా వాటిని తెర మీద పలికించడంలో అంతగా వర్క్ అవుట్ కాలేదు. యువ గా సాయి రోనక్ ఓకే అనిపించుకోగా.. శాండిగా చేసిన అదితి సింగ్ ఇంకా నటనలో మెలుకువలు నేర్చుకోవాల్సి ఉంది. ఇక ఐశ్వర్య కూడా సోసోగానే నటించింది. ఇక మిగతా పాత్రలన్ని ఏదో వస్తున్నాయంటే వస్తున్నాయన్నట్టు ఉంటుంది.
ఓవరాల్ గా సినిమా కాప్టెన్ ఆఫ్ ది షిప్ వినోద్ లింగాల రాసుకున్న కథ ఓకే అనేలా ఉన్నా.. దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. నవ్ నీత్ సుందర్ మ్యూజిక్ ఒక్క సాంగ్ బాగుంది మిగతావన్ని కేవలం సినిమాలో మాత్రమే బయటకు వస్తే ఏం గుర్తుండవు. ఉన్నంతలో ఐ వింక్ ప్రొడక్షన్ ఖర్చుకి వెనకాడలేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అనిపించకపోయినా మంచిగానే ఉన్నాయి.



పూటకో ప్రేమకథలు వస్తున్న ఈ టైంలో గుప్పెడంత ప్రేమ అంటూ వచ్చిన ఈ కథ దర్శకుడు అనుకున్న పాయింట్ ఫ్రెష్ గానే ఉంటుంది. కాఇ దాన్ని స్క్రీన్ మీద చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసోశియేట్ గా పనిచేసిన వినోద్ లింగాల ఈ సినిమాకు దర్శకుడు. సినిమాలో వచ్చే లవ్ ఎపిసోడ్స్ కూడా అంతలా ఆడియెన్స్ కు రిజిస్టర్ అవ్వకఓగా బోర్ కొట్టేస్తాయి. 


సినిమా అంతా సాగదీతలా అనిపిస్తుంది. ఎమోషన్స్ పండించడంలో నటీనటుల నుండి సరైన అవుట్ పుట్ తీసుకురాలేకపోయాడు దర్శకుడు. ప్రేమకథలను చెప్పే సమయంలో ప్రేక్షకులు కనెక్టివిటీ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కాని ఇందులో ఆ మ్యాజిక్ ఏ కొంచం కనిపించదు. సినిమా ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టు ఉంటుంది. కొత్త వారితో దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినా సినిమాను ఇంకొంచం గ్రిప్పింగ్ తీసి ఉంటే కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేది.


సో రిలీజ్ అయిన జెంటిల్ మన్, మీకు మీరే మాకు మేమేలతో పోటీ పడి వచ్చిన గుప్పెడంత ప్రేమ.. కనీసం గుప్పెడంత కూడా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయింది.



Sai Ronak,Aditi Singh,Aishwaryaగుప్పెడంత ప్రేమ.. ఓ ఫెల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: