నిహారిక నటన ,నాగ శౌర్య, రావు రమేష్ ల మధ్య సీన్స్,క్లైమాక్స్నిహారిక నటన ,నాగ శౌర్య, రావు రమేష్ ల మధ్య సీన్స్,క్లైమాక్స్స్లో నేరేషన్ ,డైరక్షన్ ,స్క్రీన్ ప్లే

సూర్య (నాగ శౌర్య) సెటిల్మెంట్లు గట్రా చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తండ్రి (రావు రమేష్) ఓ పొలిటికల్ సపోర్టర్ అయితే తానెప్పుడు నాయకుడిగా ఉండాలనుకోని తండ్రి తన కొడుకుని ఎమ్మెల్యే చేయాలనుకుంటాడు. జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కొడుకుని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో సంధ్య (నిహారిక) తొలి చూపులోనే కనెక్ట్ అవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. తనని పదే పదే చూడాలనే ఉద్దేశంతో సూర్యను ఫాలో అవుతుంది. ఇక కొద్దికాలానికే సూర్య, సంధ్య ప్రేమలో పడతారు. సంధ్య నిష్కల్మషం లేని అమ్మాయి.. సూర్యను మనసారా ప్రేమిస్తుంది. ఒకసారి అనుకోని విధంగా సూర్య రాంగ్ సెటిల్ మెంట్ లో భాగంగా ఓ పెద్ద చిక్కులో పడతాడు. ఇంతకీ సూర్యకు వచ్చిన సమస్య ఏంటి..? సూర్య, సంధ్య లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయ్యింది..? తండ్రి కోరిక మేరకు సూర్య పొలిటిషియన్ అయ్యాడా..? అన్నది అసలు కథ.      

ఒక మనసు సినిమాకు ఇంత క్రేజ్ తీసుకువచ్చింది సంధ్య పాత్ర చేసిన నిహారిక. ప్రాణంగా ఓ అబ్బాయిని ప్రేమించే అమ్మాయి పాత్రలో నిహారిక నిజంగా అదరగొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే నిహారిక సంధ్య పాత్రలో చాలా ఇన్వాల్వ్ మెంట్ తో చేసింది. కొన్ని సీన్స్ తప్ప నిహారిక నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక సూర్య పాత్రలో నాగ శౌర్య కూడా అదుర్స్ అనిపించాడు. క్యారక్టర్స్ పరంగా వీరి పాత్రలకు హీరో హీరోయిన్ ఇద్దరు చాలా చక్కగా న్యాయం చేశారు. ఇక తండ్రిగా రావు రమేష్ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకోగా.. సత్య పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఉన్న కాసేపైనా బానే చేశాడు. ఇక పొలిటిషియన్ గా నాగినీడు పర్వాలేదనిపించుకున్నాడు. సినిమా మొత్తం హీరో హీరోయిన్ పాత్రల మధ్యే ఎక్కువ నడుస్తుంది. సంధ్య తల్లి పాత్రలో ప్రగతి ఓకే అనిపించుకోగా.. కేవలం రెండు మూడు సీన్స్ కే పరిమితమయ్యాడు వెన్నెల కిశోర్.     

ఒక మనసు అంటూ మనసుని కదిలించే ప్రయత్నం చేసిన రామరాజు దర్శకత్వం పరంగా ఓకే కాని సినిమాను ప్రేక్షకులకు ఎక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా చాలా సందర్భాల్లో పొయేటిక్ గా చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఓకే అనిపించుకుంది. రెండు పాటలు బాగున్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను కంటిన్యూ చేసేలా చేస్తుంది. ఇక రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే అనిపించేలా ఉంది.. సినిమా మొత్తం వైజాగ్ ఏరియాలోనే షూట్ చేశారు.. బీచ్ అందాలను అద్భుతంగా చూపించాడు కెమెరామన్ రామ్ రెడ్డి. ఇక సినిమాను ఎడిట్ చేసిన వారు ధర్మేంద్ర కాకర్ల.. సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో రిపీటెడ్ సీన్స్ వస్తున్నట్టు అనిపిస్తాయి. సో ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఇంకాస్త ట్రిం అయ్యి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక మధురా శ్రీధర్ సినిమా మొత్తం తక్కువ లొకేషన్స్ లోనే బాగ రిచ్ గా తీశారు.       

ఆవారాగా తిరిగి సెటిమెంట్ చేసుకునే వ్యక్తికి ప్రాణం కంటే ప్రేమించే అమ్మాయి జత కట్టడం.. వారిద్దరి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్.. సరిగ్గా అదే టైంలో హీరో కులానికి సంబంధించిన గొడవల కేస్ లో ఇరకడం.. చివరగా ఆ అమ్మాయిని వదల్లేక తండ్రి కోరిక తీర్చలేక ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం ఇది కథ.   


సూర్య, సంధ్య పాత్రలకు నాగ శౌర్య నిహారికలు ఫ్రెష్ గా అనిపించారు. కాని సినిమాలో పొయెటిక్ ఫీల్ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ఆడియెన్స్ కు సినిమా ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇక సినిమాలో చాలా సీన్స్ హీరో హీరోయిన్స్ మధ్యలోనే ఉంటాయి. కనబడినప్పుడల్లా ఇద్దరు ఒకరి చేతిని మరొకరు తీసుకోవడం లాంటివి కాస్త బోర్ కొట్టేస్తాయి. సంధ్య కారక్టర్ లో నిహారిక నటన అద్భుతం తన మొదటి సినిమానే ఇలాంటి మంచి పాత్ర ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. అంతేకాదు మొదటి సినిమాకే నిహారిక తన అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఇక నాగ శౌర్య కూడా సూర్య పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేశాడు.    


అయితే ఎటుకూడి దర్శకుడు రామ రాజు మాత్రమే కథ కథనాలను సరిగా నడిపించలేకపోయాడు.. సినిమా మొత్తం స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే స్లోగా రన్ అవుతుంది. మళ్లీ క్లైమాక్స్ మాత్రం సినిమా కంటెంట్ ఎక్స్ పోజ్ అయ్యేలా చేస్తుంది. మధ్యలో మొత్తం సినిమా ఫీల్ ను మిస్ చేశాడు దర్శకుడు. వచ్చిన సీన్స్ మళ్లీ మళ్లీ వచ్చి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.. హీరో హీరోయిన్స్ కలిసిన ప్రతిసారి మాట్లాడే మాటలు ప్రేక్షకులకు అర్ధం కావు.. డైలాగ్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. 


సినిమా ఓవరాల్ గా తండ్రి కోరిక కోసం తన ప్రేమను త్యాగం చేసే హీరో.. ఇక ప్రేమించిన మనిషి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసే హీరోయిన్.. సినిమా ఫీల్ చివరి రెండు నిమిషాలు మాత్రమే జస్టిఫై చేస్తుంది. క్లాస్ ఆడియెన్స్ ఏమన్నా సినిమా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది కాని బి,సి సెంటర్స్ లో సినిమా నిరాశే కలిగిస్తుంది.  


Naga Shourya, Niharika Konidela, Rama Raju Gottimukkala, Madhura Sreedhar Reddy, Ravi Prakash, Sunil Kashyapమనసుని కదిలించలేని 'ఒక మనసు'

మరింత సమాచారం తెలుసుకోండి: