చాందిని నటన, విలేజ్ లొకేషన్స్, కెమెరా వర్క్చాందిని నటన, విలేజ్ లొకేషన్స్, కెమెరా వర్క్స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరక్షన్, ఎడిటింగ్, క్లారిటీ లేకపోవడం

ఊర్లో పెద్ద మనిషిగా ఉన్న మహదేవరాజు (నాగినీడు) మాట అందరికి శాసనం.. ఇక ఆయనకు ఓ కూతురు సుచి (చాందిని చౌదరి) అల్లారు ముద్దుగా పెంచుతాడు. తప్పుచేస్తే ఎవరిని క్షమించని నైజం అతనిది అందుకే పాత కారైనా సరే ప్రాణంగా చూసుకుంటున్న దానిని పాడు చేశాడని తమ్ముడు (రాజీవ్ కనకాల) తో ఏళ్ల తరబడి కోపంగా ఉంటాడు.. ఇక కార్ రిపేర్ చేసేందుకు వాసు (సుధీర్ వర్మ) సుచి వాళ్ల ఇంటికి వస్తాడు. తొలిచూపులోనే సుచిని చూసి ఇష్టపడ్డ వాసు ఆమెను కూడా ప్రేమలో దించుతాడు. అయితే సుచి పుట్టినప్పుడే తన మేనళ్లుడు గోపి (సుధాకర్) కు భార్య పుట్టిందని చాటింపేస్తాడు. సుధాకర్ ఆల్రెడీ ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు.. వాసు, సుచి డీప్ లవ్ గురించి సుధాకర్ తెలుసుకుంటాడు.. మరి సుచి, వాసు ప్రేమ మహదేవరాజు అంగీకరించాడా..?  సుచికి, సుధాకర్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..? సినిమా ఎలా సుఖాంతం అయ్యింది అన్నది అసలు కథ.        

కుందనపు బొమ్మ టైటిల్ కు తగ్గట్టు సినిమా మొత్తం తన అందం అభినయంతో అదరగొట్టేసింది చాందిని చౌదరి.. షార్ట్ ఫిలింస్ లో అనుభవం సిల్వర్ స్క్రీన్ మీద కూడా చాలా బాగా ఉపయోగించుకుంది. పల్లెటూరు అమ్మాయిలా క్యూట్ గా అలరించింది. అయితే ఇంకా అమ్మడు కాస్త నటనలో మెలుకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సీన్స్ లో అమ్మడి టాలెంట్ తెలిసిపోతుంది. ఇక సినిమాలో హీరోలుగా నటించిన సుధాకర్, సుధీర్ వర్మలు ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. సినిమాలో వీరి క్యారక్టర్స్ కు న్యాయం చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసిన నాగినీడు, రాజీవ్ కనకాల మంచి నటన కనబరిచారు. ఇక మిగతా కామెడీ యాక్టర్స్ అంతా సోసోగా నడిపించేశారు.  

ముళ్లపూడి వర డైరెక్ట్ చేసిన కుందనపు బొమ్మ సినిమా దర్శకుడు ఇప్పటి తరం వారిని దృష్టిలో పెట్టుకుని తీయలేదు అని చెప్పాలి. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఇక సినిమాకు పని చెసిన టెక్నికల్ టీం నుండి కూడా అంత పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు ముళ్లపూడి వర. ఎస్.డి.జాన్ కెమెరా వర్క్ బాగుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం. కాని కీరవాణి రెగ్యులర్ సినిమాల్లా మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. నిర్మాతలు సినిమా సాధ్యమైనంత వరకు రిచ్ గా వచ్చేలా సహకరించారు.  

కథ ఎంత పాతదే అయినా సినిమా తెరకెక్కించడంలో కొత్తదనం సమకూర్చితే ఎలాంటి సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరు అమ్మాయి పని మీద వచ్చిన హీరో ఆమెను ప్రేమించడం.. ఆల్రెడీ ఆ అమ్మాయి బావతో పెళ్లి ఫిక్స్ అవ్వడం.. వీరి ప్రేమకు బావ సపోర్ట్ ఇస్తాడనుకుంటే సడెన్ గా విలన్ అవడం.. ఇలాంటి సినిమాలు చూసి చూసి ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. మరి అలాంటి కథతోనే ఇంకేదో చెబుదాం అనే ప్రయత్నం చేశారు ముళ్లపూడి వర.


పాటల్లో వంశీ స్టైల్ ను అనుకరించినట్టు అనిపిస్తుంది. ఇక కథ కథనాల్లో క్లారిటీ లేకపోవడం పెద్ద మైనస్.. ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా అంత వర్క్ అవుట్ కాలేదు. హీరోయిన్ గా చేసిన చాందిని చౌదరి పర్వాలేదు కాని హీరోలిద్దరు వెరీ బ్యాడ్ అని చెప్పాలి. కాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా సరే సినిమా సక్సెస్ అవడానికి వీలుండేది. 


మొదటి భాగంలో కొన్ని సీన్స్.. సెకండ్ హాఫ్ లో మరికొన్ని సీన్స్ సినిమాలో ఇవి తప్ప మరేవి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉండవు.. ప్రేమకథ అంటూ వచ్చిన ఈ సినిమా ఆ సన్నివేశాలను చెప్పే ప్రయత్నంలో కూడా ప్రేక్షకులకు చేరువవ్వకపోవడం విశేషం. ఓవరాల్ గా ఇక చేసేందుకు పనేం లేదు.. కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే సినిమా చూసే వారు వెళ్లొచ్చు.  


Sudhakar Komakula, Chandini Chowdary, Vara Mullapudi, Anil Kumar Raju, M. M. Keeravaniనిరాశ పరచిన కుందనపు బొమ్మ..!

మరింత సమాచారం తెలుసుకోండి: