Mirchi:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


1:04am: APHerald ‘మిర్చి’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం
1:20am: డార్లింగ్ ఫ్యాన్స్ తో  థియెటర్ ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. అభిమానులందరు నిద్రమానుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
1:25am:   మరికొద్దిసేపట్లో చిత్రం ప్రారంభం కానుంది.
1:43am:   సినిమా ప్రారంభమైంది, అభిమానుల విజిల్స్- అరుపులతో  టైటిల్స్ పడుతున్నాయి.
1:45am:   పవర్ ఫుల్ డైలాగ్ ‘కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్‘ తో హీరో ప్రభాస్ ఎంట్రీ అదిరింది.
1:50am:   మరో డైలాగ్ ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’తో థియేటర్ లో అరుపులు కేకలు.
1:52am:   ‘యాహు యాహు‘ సాంగ్, ప్రబాస్- రిచాలు అందంగా కనిపిస్తున్నారు.
1:54am:   ‘స్టార్ స్టార్ రెబల్ స్టార్’ అనే నినాదంతో థియెటర్  మార్మోగుతుంది.
1:58am:  ప్రభాస్ ఇండియాలో ల్యాండయ్యాడు. గాగుల్స్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 
1:59am:   సుబ్బారాజు ఎంట్రీ బాగుంది. ప్రభాస్ అందర్నీ డ్యూడ్-డ్యూడ్ అంటూ పిలుస్తూ సందడిచేస్తున్నాడు.
2:01am:   ఇంటి యజమాని పాత్రలో బ్రహ్మి [వీరప్రతాప్]ఎంట్రీ హాస్యభరితంగా ఉంది. బ్రహ్మి పండించే హాస్యం థియేటర్ లో  నవ్వులు పూయిస్తుంది.
2:06am:   ప్రభాస్ సూపర్ కూల్ డైలాగ్ ‘girls are magic try them’.
2:12am:   చిత్రం పల్నాడు బ్యాక్ డ్రాప్ కి మారింది.‘మిర్చి మిర్చి’ సాంగ్ మొదలైంది. నందిని సెక్సీ డ్యాన్స్ తో థియేటర్ లో కేకలు రెట్టింపు అయ్యాయి.
2:13am:   సుబ్బారాజును ప్రభాస్ క్లాస్మేట్ గా చూపించడం అంతగా ఆకట్టుకోదు.
2:14am:   సుబ్బారాజు ప్రభాస్ ను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు.
2:21am:   బ్రహ్మి డైలాగ్ ‘ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు కాలేవు’ తో థియేటర్ లో విజిల్స్.
2:23am:   దర్శకుడు ఫ్యాక్షన్ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తున్నాడు.
2:25am:   నాగినీడు ప్రతినాయకుడు పాత్రలో సహజత్వం ప్రదర్శిస్తున్నాడు.
2:28am:  పల్నాడులో బ్రహ్మి! హాస్యభరిత డైలాగ్స్ తో నవ్విస్తున్నాడు.
2:31am:   ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్, సెంటిమెంట్ సన్నివేశాలను చక్కని బ్యాగ్రౌండ్ సంగీతంతో తెరకెక్కించారు.
2:35am:   రిచా డబుల్ మీనింగ్ డైలాగులు జిగుప్సా కరంగా ఉన్నాయి.
2:36am:   ప్రభాస్ నాగినీడు లోని కౄరత్వాన్ని మార్చే సన్నివేశాలు బాగున్నాయి.
2:38am:   ప్రభాస్ తన చాకచక్యంతో రిచా ఫ్యామిలీని ఒప్పించే సన్నివేశం బాగుంది.
2:40am:   ‘బార్బీగర్ల్’  సాంగ్ లో ప్రభాస్-రిచాల జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.
2:45am:   రిచా ఫ్యామిలీతో కలిసే సన్నివేశంలో ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది.
2:49am:   విలన్ పాత్రలో సంపత్ నటన తన హవాబావాలు అద్భుతంగా ఉన్నాయి.
2:55am:   అందరూ ఎదురు చూస్తున్న ఫైట్ సీన్ లో ప్రభాస్ దోవతి గెటప్ లో ప్రత్యేకమైన కత్తిని ఉపయోగించే సన్నివేశాలు అంత్యంత అద్భుతంగా తెరకెకెక్కించారు.
విశ్రాంతి  
3:08am:   ప్రభాస్ తన గత జీవితం గురించి రిచాతో చెబుతున్నాడు. చిత్రం హైదరాబాద్ కు మారింది. ప్రభాస్ ఫార్మల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
3:12am: ప్రభాస్ తల్లిగా నదియా నంటన బాగుంది.
3:15am: దేవా [సత్యరాజ్] ప్రభాస్ తండ్రిగా ఒక ప్రదానపాత్రలో నటించాడు.
3:16am: అనుష్క పరిచయం చాలా సాధరణంగా జరిగినప్పటికీ అందంతో ఆకట్టుకుంటుంది.
3:18am: అనుష్క తన మొదటి చూపులోనే ప్రభాస్ ప్రేమలో పడుతుంది.
3:20am: సత్యరాజ్ గడ్డం, కళ్ళజోడుతో ఒకింత బాలీవుడ్  స్టార్ వినోద్ ఖన్నాలా కనిపిస్తున్నాడు.
3:24am: ‘పండగలా’ సాంగ్ లో, ఫార్మల్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పాటలో తండ్రీ- కొడుకులు కలవడం, అనుష్క ప్రభాస్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు జరుగుతున్నాయి.
3:30am: అద్బుతమైన ఫైట్ సీన్, ప్రభాస్ లోని మాస్ నటనని భహిర్గతం చేసింది.
3:32am: అనుష్క సరదాగా, అల్లరిగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.                      
3:40am: అజయ్, కాట్రాజ్ లు విలన్ గ్యాంగ్ లో ఉండటం ప్రతినాయకుల పాత్రలకు బలాన్నిచ్చింది.
3:46am: రెండు గ్రూపుల మద్య తగాదాలతో గ్రామం కాలిపోయే పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రభాస్ చేసే ఫైట్ సన్నివేశం అర్థవంతంగా ఉంది.
3:48am: ‘కాటుక కళ్ళకు’  సాంగ్ లో ప్రభాస్ డ్యాన్స్ మూవ్స్, అనుష్క అందాలతో ఉర్రూతలూగించింది.
3:55am: ప్రభాస్ ఇంటిపై దాడి సన్నివేశాన్ని  చూపించడంలో దర్శకుడి పనితీరు  అభినందనీయం.                    
3:59am: ‘డార్లింగ్ సాంగ్’ లో ప్రభాస్- అనుష్కల డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఆనందంతో విజిల్స్, కేకలు పెడుతున్నారు.
4:00am: మరో ఫైట్ సీన్లో ప్రభాస్ తన ఉగ్రరూపాన్ని చూపించాడు.
4:03am: ఈ పైట్ ముగింపులో ప్రభాస్ కు ఒక విషాదకరమైన సంఘటన జరిగింది.
4:05am: ప్రభాస్, సత్యారాజ్ ల మధ్య ఎమోషనల్, సెంటిమెంట్ సన్నివేశం బాగుంది.
4:10am: పెళ్లిపట్టు పంచెలో ఫైట్ సీన్ ‘ఈశ్వర్’ చిత్రంలో ప్రభాస్ ను గుర్తుచేస్తుంది.
4:11am: ప్లాష్ బ్యాక్ ముగిసింది, కథ ప్రస్తుతంలో సాగుతుంది. ప్లాష్ బ్యాక్ చూపించిన తీరు బాగుంది.
4:17am: ప్రభాస్ తన గురించి ఒక వాస్తవాన్ని రిచా అంకుల్ కు చెబుతాడు. ఇక్కడ వచ్చిన డైలాగ్ ‘ కత్తి వాడ్డం మొదలెడుతే నాకంటే బాగా ఎవడూ వాడలేడూ’ మరియు ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది.                                 
4:19am: చివరగా ప్రభాస్ ప్రజల హృదయాలను ప్రేమతో గెలుచుకోవాలనే తన కలను నేరవేర్చుకోవడంలో సఫళీకృతుడవుతాడు.
4:25am: ప్రభాస్ తిరిగి అనుష్కను కలిసి వారి ప్రేమను కొనసాగిస్తుండడంతో చిత్రం ముగుస్తుంది.  
శుభం      
 

Mirchi Review: Cast & Crew

  • Director: Koratala Siva, Producer: V. Vamsi Krishna Reddy,Pramod Uppalapati
  • Music: Devi Sri Prasad, Cinematography: Madhi, Editing : Kotagiri Venkateswara Rao, Writer:
  • Star Cast: Prabhas, Sathyaraj, Anushka Shetty, Richa Gangopadhyay, Nadhiya, Adithya, Brahmanandam, Dinesh, Satyam Rajesh, Srinivasa Reddy, Nagineedu, Raghu Babu, Sampath Raj, Benarji, Subbaraju, Supreeth, Hema, Karthik, Mamilla Shailaja Priya and Hamsa Nandini
  • Genre: Action - Romance, Censor Rating: A, Duration: 02:30Hrs.
  • Description: Mirchi Telugu Review | Mirchi Telugu Movie Review | Prabhas Mirchi Review | Prabhas Mirchi Rating | Mirchi Review, Rating | Mirchi Movie Cast & Crew, Music, Performances, Language: te
  • Keywords: Mirchi Telugu Movie Review;Mirchi Telugu Movie Rating;Mirchi Review;Mirchi Rating;Prabhas Mirchi Review;Mirchi Movie Review;Prabhas Mirchi Rating;Mirchi Movie Rating;Prabhas;Anushka Shetty;Devi Sri Prasad;Telugu Latest Movies;
  • Is Family Friendly: true
  • Author: , Creator: APHerald, Publisher: APHerald

  •  

    More Articles on Mirchi || Mirchi Wallpapers || Mirchi Videos


     

    మరింత సమాచారం తెలుసుకోండి: