సత్య రాజ్ , కామెడీ సీన్స్ ,ఆసక్తికరమైన కథసత్య రాజ్ , కామెడీ సీన్స్ ,ఆసక్తికరమైన కథసెకండ్ హాఫ్ , స్క్రీన్ ప్లే

దొరపురం అనే గ్రామంలో ఓ పాడు బడ్డ బంగ్లా.. భయంకరమైన ఆ బంగ్లాలో ఎవరు వెళ్లడానికి సాహసించరు. ఎవరైనా సాహసించి వెళితే ఇక వారు ప్రాణాలతో బయట పడరనే నమ్మకం. ఇక అదే ఊరుకు ఎస్సైగా వచ్చి సత్య (శిబిరాజ్).. జాక్సన్ బంగ్లా గురించి ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక అదే ఊరులో విజ్జి (బిందు మాధవి)ని చూసి ప్రేమిస్తాడు సత్య. విజ్జిని చిన్న నాటి నుండి తన బావ వీర (కరుణాకరణ్) కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. విజ్జి ఎవరికి దక్కాలో విజ్జి తండ్రి సర్పంచ్ నిర్ణయిస్తాడు. జాక్సన్ బంగ్లాలో వెళ్లి తిరిగి ఎవరు వస్తారో వారికిచ్చి ఆమె పెళ్లి చేస్తానంటారు. ఇక బంగ్లాలో జరిగే పరిణామాలు ఎవరు ఊహించరు. బ్రిటీష్ కాలంలో దొర (సత్యరాజ్) ప్రజల పక్షాన ఉంటే, జాక్సన్ (జచేరి) ప్రజలను తిప్పలు పెడతాడు.. ఇక విరోదులుగా చనిపోయినా సరే వారి ప్రేతాత్మలు కూడా ఇంకా పగతో ఉంటారు. అసలు దెయ్యాల బంగ్లాలో ఏం జరిగింది..? చివరి సత్య, వీరాల్లో ఎవరు గెలిచారు..? అసలు ఆ బంగ్లా కథ మొత్తం ఏంటి..? అన్నది అసలు సినిమా. 

దొర సినిమా మొత్తం పేరుకే సత్య రాజ్ మిగతా కథ మొత్తం నడిపించేది శిబిరాజ్.. సత్య పాత్ర చేసిన శిబిరాజ్ కే సినిమాలో ఎక్కువ స్కోప్ ఉంది. ఇక దొరగా సత్యరాజ్ ఉన్నంత సేపు అదరగొట్టేశాడు. ఇక కథ మొత్తం నడిపించిన శిబిరాజ్ తన శక్తి మేరకు నటించాడు. విజ్జిగా బిందు మాధవి ఓకే అనేలా ఉంది. అయితే సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించదు. ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

సినిమా అవుట్ పరంగా చూస్తే టెక్నికల్ గా బాగా వచ్చిందని చెప్పొచ్చు. రచయిత దర్శకుడు ధరణి దరన్ కథ గొప్పగా ఊహించినా దాన్ని తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. సినిమాకు కెమెరామన్ యువరాజ్ సింగ్ తన బెస్ట్ అవుట్ పుట్ చూపించాడు. సినిమా మూడ్ కథ చుట్టే తిరిగేలా చేయడంలో తన పనితనం చూపించాడు. సిద్ధార్థ్ విపిన్ సంగీతం పర్వాలేదు. సినిమా మొత్తం సిజి వర్క్ మీదే నడిచింది.. అందుకే లొకేషన్స్ కు పెద్దగా స్కోప్ లేదు. ఇక నాలుగు గోడల మధ్య సినిమా నడిచింది. ప్రొడక్షన్ పరంగా సినిమా రిచ్ గానే ఉంది. 

ఓ కొత్త కథ అనుకున్న దర్శకుడు ధరణి ధరణ్ దాన్ని తెరకెక్కించడంలో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. పాత్రలను వాటి క్యారక్టరైజేషన్ అద్భుతంగా రాసుకున్న ఈయన తెర మీద వాటిని పండించడంలో అంతగా వర్క్ అవుట్ కాకుండా చేశాడు. ఇక హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు హర్రర్ తో కామెడీని మిక్స్ చేసి ఎటు కాకుండా చేశారు. సినిమా ఓపెనింగ్ కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా రాసుకున్న దర్శకుడు సినిమాను పూర్తిగా హర్రర్ కథాంశంతో తెరకెక్కేలా చూసుకునే బెటర్ గా ఉండేది. కేవలం ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు బలంగా ఉన్నట్టు అనిపిస్తాయి.


ఇక ఎలాగు సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా వాడి అసలు లాజిక్ లేకుండా చేశాడు. దొరగా నటించిన సత్యరాజ్ ఉన్నంత సేపు సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. నటీనటుల నుండి కథకు తగ్గ అవుట్ పుట్ తీసుకోవడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు. ఇదో భయపెట్టాడానికి వచ్చిన ఓ కామెడీ సినిమా అని చెప్పాలి.  


బాహుబలి కట్టప్పతో క్రేజ్ సంపాదించిన సత్యరాజ్ వల్ల తెలుగులో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవాకాశాలు ఉన్నాయి. ఎంచుకున్న కథా వస్తువు కొత్తదే అయినా దాన్ని సరైన క్రమంలో అమర్చలేక దర్శకుడు చేసిన ప్రయత్నం ఈ ప్రయత్నం అంత గొప్పగా ఏం లేదు.
Satya Raj, Sibiraj, Bindu Madhavi, Dharani Dharan, Jakkam Jawahar Babu, Siddharth Vipinఈ 'దొర' ఇంకాస్త ముస్తాబయితే బాగుండేది..!

మరింత సమాచారం తెలుసుకోండి: