రజిని స్టైలిష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వల్ సీన్రజిని స్టైలిష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వల్ సీన్కథను నడిపించిన విధానం, డైరక్షన్, స్లో నేరేషన్
కబలీశ్వరన్(కబాలి) ఓ గ్యాంగ్ స్టర్.. మలేసియా 43 గ్యాంగ్ చేసిన కుట్రలో పాతిక సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి వస్తాడు. అయితే పాతిక సంవత్సరాల క్రితం టోని లీ (విన్స్ టన్ చావో), వీర శంకర్ (కిశోర్) చిన్న రౌడీలుగా ఉన్న వారు ఓ సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటారు. అన్ని రకమైన ఇల్లీగల్ బిజినెస్ లను చేస్తూ ఆధిప్రత్యం చెలాయిస్తుంటారు. ఇక కబాలి రిలీజ్ అయ్యాడు ఎప్పటికైనా తన వల్ల ఇబ్బందే అనుకున్న టోని లీ గ్యాంగ్ కబాలిని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. కబాలి జైలులో ఉన్నా సరే ఫ్రీ లైఫ్ ఫౌండేషన్ నడిపిస్తూ టోనీ లీ గ్యాంగ్ భాదితులైన ఇండియన్స్ ను ఎడ్యుకేట్ చేస్తుంటారు. కబాలి సహచరుడు అమీర్, మీరా. అసలు కథ మొదలయ్యేది మలేసియాలో ఆధిప్రత్యమెపై పోరాటం చేస్తున్న సీతారామరాజు (నాజర్) కు సపోర్ట్ గా నిలుస్తాడు కబాలి. ఇక ఆయన మరణం తర్వాత ఆ ప్లేస్ ను కబాలి అందుకుంటాడు. తమ ఆగడాలకు అడ్డొస్తున్న కబాలిని జైలు పంపించిన టోని గ్యాంగ్ కబాలి ఫ్యామిలీను చెల్లాచెదురు చేస్తుంది. 43 గ్యాంగ్ ని కబాలి మట్టికరిపించాడా..? వారు నడిపించే ఇలీగల్ బిజినెస్ లు ఎలా మూతపడ్డాయి..? ఫ్యామిలీకి దూరమైన కబాలి వారిని చేరుకున్నాడా..? అన్నది అసలు కథ.    



సూపర్ స్టార్ రజిని సినిమా అంటే ఆయన మేనరిజాలతోనే సినిమా అంతా అదరగొట్టేస్తాడని తెలిసిందే. అయితే ముఖ్యంగా కబాలి సినిమాలో రజిని వన్ మ్యాన్ షో చేశాడు. సినిమా మొత్తం రజిని మీదే నడుస్తుంది. కబాలిగా సినిమా మొత్తం గడ్డంతో కనిపించిన రజిని యంగ్ గా కనిపించిన కొన్ని సీన్స్ అయినా హైలెట్ గా నిలిచాయి. అయితే రజినిని మరింత స్టైల్ గా చూపించడంలో దర్శకుడు పా.రంజిత్ విఫలమయ్యాడు. ఇక హీరోయిన్ గా నటించిన రాధికాకు అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏం కాదు. సెంటిమెంట్ కోసం రాధికా పాత్ర తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో యోగిగా నటించిన ధన్సిక అదరగొట్టింది. ముందు టోని గ్యాంగ్ మనిషిగా కనిపించిన యోగి ఇంటర్వెల్ సీన్ లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. తన పాత్ర పరంగా యోగిగా ధన్సిక ఓకే అనిపించుకుంది. కబాలి సహచరుగా నటించిన అమీర్, జీవ పర్వాలేదు అన్నట్టు నటించారు. సీతారామరాజు పాత్రలో నాజర్ కొద్దిసేపు కనిపించినా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా సినిమాలో విలన్స్ గా నటించిన వీరశంకర్ (కిశోర్) బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోని లీగా మలేసియన్ నటుడు విన్స్ టన్ చావో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు.   



కబాలి సినిమాకు పనిచేసిన టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే కబాలిగా కొద్ది రోజుల నుండి రజినితో తెగ సందడి చేస్తున్న దర్శకుడు పా.రంజిత్ గురించి మాట్లాడాలి. సినిమాకు అనుకున్న కథ కొత్తగా ఉన్న దాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు చాలా తప్పులు చేశాడు. ఓ విధంగా దర్శకుడు కబాలికి న్యాయం చేయలేకపోయాడు. కబాలికి ప్రాణం లాంటి సంగీతం ఇచ్చాడు సంతోష్ నారాయణన్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా కబాలి అదరగొట్టేలా చేసింది. ఇక సినిమా కెమెరా మన్ మురళి కూడా బెస్ట్ అవుట్ పుట్ అందించారు. సాద్యమైనంత వరకు ఫుల్ స్క్రీన్ మీద ఫుల్ కలర్ ను వాడిన కెమెరా మన్ సినిమాలో ముఖ్య పాత్ర పోశించాడు. ఇక నిర్మాత కళైపులి ఎస్ థాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అధిక భాగం మలేసియాలో షూట్ చేసినా ఎక్కడ ఖర్చుకి వెనుకాడకుండా సినిమా రిచ్ గా ప్రొడ్యూస్ చేశారు.



మలేసియాలో భారతీయులకు జరుగుతన్న అన్యాయాన్ని ఎదురించి నిలిచే వ్యక్తిగా కబాలి ముందుంటాడు. అయితే అప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయుల సంరక్షణ కోసం పోరాడుతున్న సీతారామరాజు కబాలి ధీరత్వం నచ్చి అతనితో ఉండమంటాడు. ఇక సీతారామరాజు అక్కడ జరుగుతున్న భారతీయుల అన్యాయాలను ఎదుర్కునే ఆలోచనతో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే వీర శంకర్ కూడా కలుస్తాడు. అయితే గ్యాంగ్ లో ఇల్లీగల్ వ్యవహారాలను నడపాలని చూస్తున్న వీర శంకర్ ను అవమానించిన సీతారామరాజుని చంపేసి ఆల్రెడీ అక్కడ రాజ్యమేలుతున్న గ్యాంగ్ 43లో చేరుతాడు. టోని లీ నేతృత్వంలో వీర శంకర్ కబాలి అడ్డు తొలగించాలనుకుంటాడు. అయితే సీతారామరాజు చనిపోయాక ఆ స్థానంలో ఉండాల్సింది తన కొడుకు ధర్మ అని అతన్ని ఉసిగొలిపి కబాలి ఫ్యామిలీ మీద ఎటాక్ జరిగేలా చేస్తాడు. ఇక ఆ క్రమంలో ధర్మను చంపిన కబాలిని పోలీసులు పాతిక ఏళ్లు జైలులో ఉంచుతారు.

కథ అనుకున్న విధానంలో కాస్త కన్ ఫ్యూజ్ చేసిన దర్శకుడు రంజిత్ అదే కన్ ఫ్యూజన్ ను తెర మీద కొనసాగించాడు. అప్పుడే ఎదుగుతున్న కబాలిని ఫ్యామిలీతో ఎటాక్ చేసి జైలుకి వెళ్లేలా చేస్తారు ఓకే. కాని కబాలి తిరిగొచ్చాడని వారు భయపడటంలో ఎలాంటి లాజిక్ కనబడలేదు. ఇక పాతిక సంవత్సరాలు జైలులో ఉన్నా కబాలి బయట వ్యవహారాలను ఎలా నడిపించాడు అన్నది చూపించలేదు.  
గ్యాంగ్ స్టర్ సినిమాల్లో సెంటిమెంట్ ఎలా వర్క్ అవుట్ అవుతుందని దర్శకుడు ఊహించాడో ఏమో కాని సినిమా మొదటి భాగంలో తన భార్యను ఊహించుకునే సందర్భంలో, సెకండ్ హాఫ్ లో ఆమెను కలుసుకునే విషయంలో రాసుకున్న సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టేలా చేస్తాయి. 
రజిని సినిమా అంటే కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. అయితే సినిమాలో అలాంటివి ఉన్నా మిగతా సినిమా సాగతీయడంతో అంత గొప్పగా అనిపించవు. సినిమా మొదలు పెట్టిన విధానం సూపర్ గా ఉంటుంది. ఇక తర్వాత తర్వాత కొద్దిగా డ్రాప్ అవుట్ అవుతుంది. కథనాన్ని గ్రిప్పింగ్ గా చూపించడంలో దర్శకుడు పా.రంజిత్ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా రజిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కాని మిగతా ఆడియెన్స్ సెంటిమెంట్ డోసు ఎక్కువైందని ఫీల్ అవుతారు. సినిమాలో అసలు కథను నడిపించకుండా ఏటెటో తీసుకెళ్లి చివరకు విలన్ ను చంపడం క్లైమాక్స్ లా పెట్టుకున్నాడు. అది కూడా పేలవమైన కంక్లూజన్ తో సినిమా ఎండ్ చేస్తాడు. ఓవరాల్ గా ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన కబాలి రజిని స్టైలిష్ యాక్షన్ ఒకే అనిపించినా ఊహించినంత గొప్ప చిత్రం కాదని మాత్రం చెప్పొచ్చు.      



Rajinikanth,Radhika Apte,Pa. Ranjith,Kalaippuli S Thanu,Santhosh Narayananరజిని 'కబాలి' కేవలం అభిమానులకే..!

మరింత సమాచారం తెలుసుకోండి: