ఎన్టీఆర్, మోహన్ లాల్ ,మ్యూజిక్ , డైలాగ్స్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ,మ్యూజిక్ , డైలాగ్స్ స్లో నేరేషన్ , వీక్ క్లైమాక్స్ , మిస్సింగ్ ఎంటర్టైన్ మెంట్

సత్యం (మోహన్ లాల్) ఓ మెకానిక్ ఊళ్లో ఉన్న తనని తమ్ముడి బలవంతంతో హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ ఏర్పాటు చేస్తాడు. కేవలం రిపేర్లే కాకుండా ప్రజల సమస్యలను కూడా సాల్వ్ చేస్తుంటాడు. జనతా గ్యారేజ్ చేస్తున్న పనులు ఓ పెద్ద మనిషి ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) కు నచ్చదు. గ్యారేజ్ సత్యంతో పాటు మిగతా మెకానిక్ లు ప్రజల సమస్యలను తీరుస్తుంటారు. గ్యారేజ్ కు వార్నింగ్ ఇచ్చినా మారకపోవడంతో సత్యం తమ్ముడి ఫ్యామిలీని చంపేస్తారు. తన తమ్ముడు కొడుకు ఆనంద్ ను వాళ్ల మామయ్యకు అప్పచెబుతాడు సత్యం. ఇక ఆనంద్ (ఎన్.టి.ఆర్) ఓ నేచర్ లవర్. ప్రకృతికి భంగం కలిగించే ఏ పని చేసినా సరే ఊరుకోడు. అదే క్రమంలో ఓ పార్క్ విషయంలో ముంబైలో గొడవపడటం వల్ల ఆనంద్ మామయ్య (సురేష్) ఆనంద్ ను హైదరాబాద్ కు పంపిస్తాడు. ఈ లోపే సత్య మీద ఎటాక్ జరగడం గ్యారేజ్ లో సమస్యలు తీరుతాయని వచ్చిన ప్రజలు వెనక్కి వెళ్లడం జరుగుతుంది. ఇక ఆనంద్ గురించి తెలుసుకున్న సత్యం జనతా గ్యారేజ్ లో ఆనంద్ ను చేర్చుకుంటాడు. ఇకఅక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ జనతా గ్యారేజ్ లో అడుగుపెట్టిన ఆనంద్ సత్యంకు ఏమవుతాడు..?  ముఖేష్ చేస్తున్న ఆగడాలను జనతా సహాయంతో ఆనంద్ ఎలా చేధించాడు..? అన్నది అసలు కథ. 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నేచర్ లవర్ గా నూటికి నూరు పళ్లు న్యాయం చేశాడు. కమర్షియల్ హీరో అంటే కేవలం ఫైట్స్ ఒక్కటే కాకుండా ఓ సెపరేట్ క్యారక్టరైజేషన్ ట్రై చేయడం గొప్ప విషయం. సినిమాలో తారక్ ను కొత్త కోణంలో చూడొచ్చు. ఎంతో స్టైలిష్ లుక్ తో జూనియర్ ఆకట్టుకున్నాడు. ఇక నటన పరంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్స్ సమంత, నిత్యా మీనన్లు కేవలం ఉన్నారు అని అనిపించేందుకే. పాటల కోసం తప్పించి సమంత, నిత్యా అంతగా ఉపయోగపడలేదు. ఇక సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిన పాత్ర సత్యంగా చేసిన మోహన్ లాల్. ఈ పాత్రకు కొరటాల శివ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్టర్ గా మోహన్ లాల్ అదరగొట్టేశాడు. ఇక పోలీస్ కమిషనర్ గా సాయి కుమార్ చాలా రోజుల తర్వాత మంచి రోల్ చేశారు. అంతేకాదు మెకానిక్స్ గా నటించిన అజయ్, బ్రహ్మాజి మిగతా వారు కూడా మంచి నటన కనబరిచారు. 

జనతా గ్యారేజ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేసుకున్న కొరటాల శివ ముందు రెండు సినిమా కన్నా ఈ సినిమాలో కాస్త పట్టు తప్పాడని అనిపిస్తుంది. కథకు బలం చేకూర్చే కొన్ని సందర్భాల్లో రాసుకున్న డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. సినిమాకు దేవి మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయి. తిరు కెమెరా పనితనం ప్రతి ఫ్రేం లో అందంగా అనిపించింది. జూనియర్ ను ఇంతకుముందు ఎన్నడు చూడని విధంగా తిరు తన కెమెరా పనితనాన్ని చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో అదరగొట్టేశారు.  

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు ముందు నుండి భారీ హైప్ రావడంతో అంచనాలు భారీ రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గ్యారేజ్ కాస్త వెనుక పడ్డది. కమర్షియల్ సినిమానే కథాబలంతో చెప్పాలనుకున్న కొరటాల శివ జనతా గ్యారేజ్ విషయంలో గ్రిప్పింగ్ కోల్పోయాడు.


కథ కూడా చాలా చిన్నదే.. మొదటి భాగమంతా తారక్ క్యారక్టరైజేషన్ తో సరదాగా నడిపించేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో మొదటి 20 మినిట్స్ హై లెవెల్ లో ఉంటుంది. అయితే అలాంటి సీన్స్ ఇంకో రెండు మూడు పడి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇక సిఎంతో కూడా మాట్లాడగల విలన్ ఓ గ్యారేజ్ విషయంలో అంత గాబరా పడటం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాకు విలన్స్ పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక మొక్కలను ప్రేమించే పాత్రలో తారక్ మనుషులను ప్రేమించి కష్టంలో ఆదుకునే పాత్రలో మోహన్ లా ఇద్దరు ఎవరికి వారే పోటా పోటీగా నటించారు.


సినిమాలో గ్లామర్ కోసమే సమంత, నిత్యా మీనన్ ఉన్నారనిపిస్తుంది. ఇక విదిశ అయితే అసలు రిజిస్టర్ కూడా అవ్వని పాత్ర చేసింది. ప్రతి సినిమాలో కొన్ని సెంటిమెంట్స్ వాడే కొరటాల శివ ఈ గ్యారేజ్ లో కూడా వాటిని వాడేశాడు. వాటిలో ఒకటి క్లైమక్స్ ఏదో ఒక ఫ్యాక్టరీ దగ్గర పెట్టడం. విలన్ లు చితకబాదే కార్యక్రమం అక్కడే ఏర్పాటు చేస్తాడు కొరటాల శివ. మొక్కలను చెట్లను ప్రేమించే ఆనంద్ ను మనుషులను కూడా ప్రేమించడం సత్యం నేర్పిస్తాడు.

అంచనాలు బాగ ఉండే సరికి సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్టు ఉన్నా సెకండ్ హాఫ్ లో మొదటి 20 నిమిషాలు కేక పెట్టించేశాడు. కాని మళ్లీ క్లైమాక్స్ లో వీక్ అయిపోతుంది. సో మొత్తానికి జూనియర్ ఎకౌంట్ లో ఓ మంచి సినిమా పడ్డట్టే. కాని కొరటాల శివ ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది.


TWEETS:


5:35 am : మంచి క్లయిమాక్స్ ఎపిసోడ్ తో  సినిమా పూర్తి అయ్యింది.


5:30 am :సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తున్నాయి..సాయికుమార్ అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నారు. సినిమా క్లయిమాక్స్ దశకు చేరింది.


5:25am : అందరూ ఎదురు చూస్తున్న ఐటమ్ సాంగ్ వస్తుంది..ఇప్పటి వరకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా వేసిన కాజల్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ తో కనిపిస్తుంది. కాజాల్ చాలా సెక్సీగా కనిపిస్తుంది. కొరియోగ్రఫీ సూపర్


5:17am : ఎన్టీఆర్, నిత్యా మీనన్  మద్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. 


5:15am :  జనతా గ్యారేజ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్ అద్భుతమైన స్టోరీ, కుటుంబం, ప్రేమ, హ్యూమన్ ఎలిమెంట్స్, సంగీతం, మాటలు అన్నీ బాగా చూపిస్తున్నారు. 


5:05am :  ప్రస్తుతం కుటుంబ నేపథ్యంలో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొడుతున్నాడు.


4:55am :  డైలాగ్ : నీ అంతటోడు లేడూ అంటే..కాదూ నీకంటే ఎవరూ లేరూ అంటే..


4:50 am : కమీషనర్ ఆఫీసర్ గా సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. 


4:48am :  జయహో జనతా టైటిల్ సాంగ్ వస్తుంది. ఎన్టీఆర్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. 


4:46am : సినిమాలో ఇప్పుడు సూపర్ యాక్షన్ సన్నివేశం వస్తుంది. చాలా కాలం తర్వాత  ఎన్టీఆర్ ఇలాంటి స్టంట్స్ చేశారు.


4:43am : డైలాగ్ : మీ పిల్లలు మంచి వారనుకోండి సార్..వాళ్లకు మీరు ఇచ్చే డబ్బు ఒక లెక్క కాదు..చెడ్డవాడైతే మీరెచ్చే డబ్బు ఎంతో కాలవ ఇవ్వడు.


4:40am : రాజీవ్ కనకాల కు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. 


4:35 am : ఇంట్రవెల్ తర్వాత మోహన్ లాల్, ఎన్టీఆర్ ల మద్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. 


.............. విశ్రాంతి............


4:25 am :  అద్భుతమైన సన్నివేశంతో ఇంట్రవెల్ పడింది.


4:16 am :  సినిమాలో ఇప్పుడు మాఫియా ఎంట్రీ ఇచ్చారు..ఫ్యామిలీ పాలిటిక్స్ తో సినిమా సాగుతుంది. సినిమా ఇప్పుడు అంతా సీరియస్ మోడ్ లోకి వెళ్లింది.  సినిమా ఇంట్రవెల్ దిశగా సాగుతుంది.


4:12 am :  దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ సాంగ్ లో సమంత చాలా సెక్సీగా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తుంటే థియేటర్లో చప్పట్లు, విజిల్స్ తో మారుమోగుతుంది. మ్యూజిక్ రాక్ అండ్ రోల్..


4:10 am :  ఎన్టీఆర్, సమంత మద్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. 


4:8 am :  డైలాగ్ : భాయ్ కోపం..నీ కోపం నా కోపం తొక్కలో కోపాలు సృష్టి కోపం ముందు ఇవన్నీ చిన్నవే..


4:07am :  డైలాగ్ : నా సైన్స్ లో ప్రతీదీ చిన్నదే..నేచర్ తో పోలిస్తే..


4:05am :  రాక్ అండ్ బ్రో అనే పాట వస్తుంది..అద్భుతమైన సీనరీస్ చూపిస్తున్నారు.  అందమైన ప్రకృతిని అద్భుతమైన ఫోటో గ్రఫితో చూపిన్నారు. ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ చాలా అందంగా కనిపిస్తున్నారు. రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి మాయ చేస్తున్నాడు. 


3:58am :  ఎన్టీఆర్, నిత్యా మీనన్ ల మద్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. 


3:55am :  సినిమా ప్రతి ఫ్రేమ్ లో మోహన్ లాల్ లేదా ఎన్టీఆర్ ఇద్దరూ కనిస్తూ ఉన్నారు. సినిమా కాస్త ఎంట్రటైన్ మెంట్ గా నడుస్తుంది. 


3:50am : సమంతా చాలా క్యాజువల్ గా కనిపిస్తుంది. ఇక నిత్యామీనన్ చాలా బబ్లీ గర్ల్ లా క్యూట్ గా ఈ తరం అమ్మాయిగా కనిపిస్తుంది. 


3:48am : సినిమా కొత్త మలుపులు ఏమీ రావడం లేదు.. అంతే కాదు ఇప్పటి వరకు ఎలాంటి ట్విస్ట్ లు రాలేదు..సినిమా స్పీడ్ గా మూవ్ అవుతుంది.


3:45am : ప్రస్తుతం సినిమా అంతా హైదరాబాద్, ముంబాయి మద్యలోనే సాగుతుంది. 


3:40am : మోహన్ లాల్  కి సంబంధించి అద్భుతమైన సన్నివేశం వస్తుంది. 


3:35am : మోహన్ లాల్ తన తమ్ముడిని కోల్పోతాడు..సినిమా ఇప్పుడు ప్రజంట్ కి మారింది. 


3:29 am : ఆనంద్ (ఎన్టీఆర్) చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. ప్రకృతిని, చెట్లను ప్రేమించే ఓ యువకుడిగా ఎన్టీఆర్ లుకింగ్ చాలా బాగుంది. 


3:26 am : సినిమా హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యింది..కానీ 1980 లోనే కొనసాగుతుంది. 


3:23 am :  ఆనంద్( ఎన్టీఆర్ ) చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు..మొదటి పాట ‘ప్రణామం ప్రణామం’ పిక్చరైజేషన్, కొరియోెగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ గడ్డంతో కనిపిస్తూ చాలా సిన్సియర్ గా ఉన్నాడు. 


3:23 am :  ఎన్టీఆర్ చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు..మొదటి పాట ‘ప్రణామం ప్రణామం’ పిక్చరైజేషన్, కొరియోెగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ గడ్డంతో కనిపిస్తూ చాలా సిన్సియర్ గా ఉన్నాడు. 


3:20 am : మానవత్వం బతికించడానికి జనతా గ్యారేజ్ స్థాపించబడింది...సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.


3:15 am : సినిమా  అసలు సీన్ మొదలైంది..జనం కోసం జనతా గ్యారేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. 


3:10 am : సినిమా సీరియస్ మోడ్ లో నడుస్తుంది. ఇప్పుడు జగపతి బాబు వాయిస్ వోవర్ వస్తుంది.


3:08 am : జనతా గ్యారేజ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్ ఐపిఎస్ అధికారిగా సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చారు.


3:05 am : సినిమా ఇప్పుడే మొదలైంది..1980 సంవత్సరం నేపథ్యంలో లో సినిమా మొదలైంది...మోహన్ లాల్, దేవయాని ఎంట్రీ ఇచ్చారు.


2:55 am : చాలా వరకు యువకులు థియేటర్ వద్దకు వచ్చారు..జై బాలయ్య, జై ఎన్టీఆర్ .. జై జై జనతా గ్యారేజ్ అంటూ విజిల్స్ భారీ హంగామా చేస్తున్నారు. సినిమా ఎప్పుడు మొదలైతుందీ అంటూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి థియేటర్ వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది.


2:45 am : చాలా సంవత్సరాల తర్వాత మోహన్ లాల్ స్టేట్ గా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు..ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో మంచి సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


2:41 am : ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తెలుగు, మళియాల భాష ల్లో రిలీజ్ అవుతుంది..గతంలో మళియాలంలో సింహాద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

        
2:40 am : థియేటర్స్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది..కౌటౌట్స్ వద్ద ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిందాబాద్, జై బాలయ్య  అంటూ విజిల్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫ్యాన్స్. 


2:35 am : హాయ్ ఏపీహెరాల్డ్.కామ్ రీడర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మళియాల సూపర్ స్టార్ మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ట్విట్, రివ్యూకి స్వాగతం సుస్వాగతం..
Jr NTR,Mohanlal,Samantha Ruth Prabhu,Nithya Menen,Koratala Siva,Naveen Yerneni,Y. Ravi Shankar,C. V. Mohan,Devi Sri Prasad 'జనతా గ్యారేజ్' ఇంకొంచం కష్టపడితే బాగుండేది..!

మరింత సమాచారం తెలుసుకోండి: