త్రిష , సత్యం రాజేష్ కామెడీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ త్రిష , సత్యం రాజేష్ కామెడీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథ , కథనం , దర్శకత్వం, పాటలు

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ అయిన సంజయ్ ఓ పక్కన వంద కోట్ల ఆస్తి గల అమ్మాయితో పెళ్లికి సిద్ధమైనా తనను ప్రేమిస్తున్న సంధ్య (సుష్మా రాజ్) ను సొంతం చేసుకోవాలని తన స్నేహితుడు ఫాంహౌజ్ కు తీసుకు వెళ్తాడు. ఇక దారి మధ్యలో ఫాం హౌజ్ రూట్ మర్చిపోయిన సంజయ్ ఓ వ్యక్తిని దారి అడుగుతాడు. అతను రాంగ్ అడ్రెస్ చెప్పి వాళ్లను దుండిగల్ ప్రాంతానికి వెళ్లేలా చేస్తాడు. దుండిగల్ప్రాంతం మొత్తం 35 ఏళ్లుగా అక్కడకి వెళ్లిన మనుషులు మాయమవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం దానికి రిస్ట్రిక్టెడ్ ఏరియాగా గుర్తించి అక్కడికి ఎవరు వెళ్లకూడదని గోడ కట్టేస్తుంది. అయితే సంజయ్ వచ్చేప్పుడు మాత్రం ఆ గోడ తెరుచుకుని అతని ఓ బంగ్లాకు వచ్చేలా చేస్తుంది. సంజయ్, సంధ్యలు దుండిగల బంగ్లా చేరుకుంటారు. అది దుండిగల్ అని వారికి తెలియదు. అక్కడకు వచ్చిన సంధ్యను లోబరుచుకునే పని చేసే ఆలోచనలో ఉన్న సంజయ్ కు అక్కడ గాయత్రి (త్రిష) ప్రేతాత్మ రూపంలో తిరుగుతుందని గమనిస్తాడు. ఇక సంజయ్, సధ్యలను గాయత్రి ఎలా ఆడుకుంది..? అసలు గాయత్రి ప్రేతాత్మగా ఎలా మారింది..? వారి ప్రాణాలతో విడిచి పెట్టిందా..?అన్నది అసలు కథ.        

దర్శకుడు గోవి ఏం చెప్పి త్రిషను ఒప్పించాడో తెలియదు కాని చేసినంత వరకు గాయత్రి పాత్రలో త్రిష పర్వాలేదనిపించింది. ఇక చిన్న నాటి నుండే హీరోయిన్ గా అవ్వాలనే కోరికతో త్రిష చేసిన నటన ఓకే కాని కథనంలో మొత్తం తేలగొట్టేశాడు దర్శకుడు. తన పాత్ర చేయడంలో తన వరకు త్రిషా న్యాయం చేసింది. ఇక సంజయ్ గా దాదాపు సినిమా మొత్తం చేశాడు సత్యం రాజేష్. తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసినా కథలో దమ్ము లేకపోవడంతో అంత బాగా పండలేదు. సంధ్యగా నటించిన సుష్మా రాజ్ పర్వాలేదు. గాయత్రి తండ్రి పాత్రలో నటించిన జయప్రకాశ్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లో మెరిసిన బ్రహ్మానందం అంతగా నవ్వులేం చిందించలేదు. కాని మురళికృష్ణ పాత్రలో వచ్చిన మల్లెల మెగాస్టార్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక గాయత్రి ప్రేతాత్మగా మారడానికి తనని మోసం చేసిన క్యారక్టర్ లో గణేష్ వెంకట్రామన్ మంచి నటన కనబరిచాడు.   

ఇక ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే సినిమా కథ కథనాల్లో దర్శకుడు అనుకున్న పాయింట్ ఎక్కడ సరైన అవగాహనతో తీసినట్టు అనిపించదు. కెమెరామన్ పనితనం కూడా సోసోగానే ఉంటుంది. రఘు కుంచె పాటల్లో ఒక్కపాట బాగుంది. ఇక సాయి కార్తిక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త పర్వాలేదు. సినిమా కోసం త్రిష తన సొంత డబ్బింగ్ చెప్పడం.. ఓ పాట కూడా పాడటం విశేషం. ఇక మామిడిపల్లి గిరిధర్, పద్మజల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. అయితే సినిమా మొత్తం ఒక ఇంట్లో కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు.     

ఓ కామాంక్ష ఉన్న వాడి వల్ల హీరోయిన్ అవాలనుకున్న గాయత్రి జీవితం నాశనం అవడంతో అదే ఆలోచనతో అటు పక్కకు ఎవరు వచ్చినా వారిని చంపేయడం ఆమె పని. దర్శకుడు రాసుకున్న ఈ కథ పేపర్ మీద చాలా బాగా ఉండి ఉంటుంది. అయితే తీరా అది తెర రూపం దాల్చేసరికి అంతా ఏదో గజిబిజిగా ఉంటుంది. అసలు ఏమాత్రం సరైన కథనంలో సినిమా వెళ్లదు. సినిమా స్టార్ట్ చేయడం సీరియస్ మోడ్ లో స్టార్ట్ చేసి దూరదర్శన్ వార్తలు చూపించిన దర్శకుడు అదే 35 ఏళ్ల నుండి దుండిగల్ లో జరుగుతున్న మిస్టీరియస్ ఏంటో చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

ఇక హర్రర్ జానర్లో ఓ వరదలా వస్తున్న తెలుగు సినిమాల్లో కామెడీ టచ్ ఇచ్చి ఈ మధ్య కొన్ని హిట్ సాధించాయి. అయితే ఆ క్రమంలో అన్ని హిట్ అవ్వాలంటే కష్టమే.. ఇక నాయకి సినిమా ఫెల్యూర్ పూర్తి భాధ్యత దర్శకుడు గోవర్ధన్ రెడ్డిదే అని చెప్పాలి. కథ కథనాల్లో ఏమాత్రం క్యూరియాసిటీ కలిగించకపోగా ఆడియెన్స్ కి ఓ స్టేజ్ లో విసుగు తెప్పించేలా చేస్తాడు.   

తనకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండబట్టే దెయ్యం అయినా సరే కేవలం కెమెరాలో కనిపించడం అనేది మంచి పాయింట్ కాని దాన్ని కూడా సరిగా చూపించలేకపోయాడు దర్శకుడు. త్రిష కూడా ఈ సినిమా ఏం చూసి ఒప్పుకుందో ఏమో కాని అసలు తన ఇమేజ్ కు తగ్గ సినిమా మాత్రం ఇది కాదు. హర్రర్ నేపథ్యంతో భయపెట్టి నవ్విద్దాం అనుకున్న ఆమెకు ఈ సినిమా నిరాశే మిగిల్చిందని చెప్పాలి.    

సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా చూడాలని ప్రయత్నించే వారికి ఫ్రీగా తలనొప్పి వెంట రావడం ఖాయం. అయితే సినిమా చేసిన ప్రయత్నం దానికి కష్టపడ్డ టెక్నిషియన్స్ గురించి ఆలోచిస్తే అలా చెప్పలేం.. కాని త్రిష నాయకిగా పూర్తిగా నిరాశ పరచిన సినిమా ఇది. 


Trisha,Sushma Raj,Ganesh Venkatraman,Govi,Giridhar Mamidipally,Padmaja Mamidipally,Raghu Kuncheత్రిష 'నాయకి' ఓ వృధా ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: