ఆది ,ఫస్ట్ హాఫ్కా,మెడీఆది ,ఫస్ట్ హాఫ్కా,మెడీ రొటీన్ స్టోరీ, డైరెక్షన్ ,హీరోయిన్
బాబ్జి (ఆది)రికవర్ ఏజెంట్ గా పనిచేస్తూ ఎలాంటి వారి దగ్గర నుండైనా సరే అమౌంట్ రికవరీ చేయగల సత్తా ఉన్న కుర్రాడు. తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టిన ఈగో గోవర్థన్ రెడ్డి (పృథ్వి) ని ముక్కుపిండి మరి వసూళు చేస్తాడు బాబ్జి. ఇక జాలీగా గడుపుతున్న బాబ్జి జీవితంలోకి కావ్య వస్తుంది. ఓ సహాయం కోసం కావ్య బాబ్జితో మాట్లాడటం చూసి కావ్య అన్నయ్య ఏసిపి (అభిమన్యు సింగ్) బాబ్జికి వార్నింగ్ ఇస్తాడు. ఇక కావ్య ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసిన ప్రతిసారి పారిపోయే ప్లాన్లో ఉంటుంది. అలా ఓసారి పారిపోయే క్రమంలో బాబ్జితో కనిపించిన కావ్య ఇద్దరు ప్రేమించుకుని లేచిపోతున్నారనే అపోహతో వారి వెంట పోలీసులను పంపిస్తాడు. ఎలాగోలా వారి నుండి తప్పించుకున్నారనుకున్న బాబ్జి, కావ్యలను మరో గ్యాంగ్ వెంటాడుతుంది. ఇక అటు రౌడి గ్యాంగ్ ఇటు పోలీసులు వెంటాడుతున్న తమని సడెన్ గా వచ్చి దొరబాబు మనుషులు తీసుకెళ్తారు.  అసలు ఇంతకీ ఈ దొరబాబు ఎవరు..? కావ్య కోసం గాలిస్తున్న ఆ రౌడి గ్యాంగ్ ఎక్కడనుండి వచ్చింది..? చివరకు ఏసిపి వారిని ఎలా పట్టుకున్నాడు..? బాబ్జి, కావ్యలు ప్రేమించుకున్నారా అన్నది అసలు కథ.       
రాక్ స్టార్ ఆది మునుపటి సినిమాల కన్నా ఈ సినిమాలో కాస్త జోష్ ఫుల్ గా కనిపించాడు. లుక్ దగ్గర నుండి డైలాగ్స్, డ్యాన్సుల్లో ఆది అందరిని ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన నమితా ప్రమోద్ పర్వాలేదనిపించుకుంది. హీరోయిన్ కు స్కోప్ ఉన్నా ఆమె నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది తప్ప సినిమా అంతా హీరోయిన్ అంతగా ఆకట్టుకోదు. ఇక దొరబాబుగా సాయి కుమార్ హుందాతనమైన పాత్రలో నటించాడు. తనకు కొట్టినపిండి లాంటి ఇలాంటి పాత్రలో సాయి కుమార్ ఓకే అనిపించుకున్నాడు. కాని ఆ పాత్రకు అంత బలం లేకపోవడం మైనస్ అయ్యింది. ఇక ఆది ఫ్రెండ్స్ గా నటించిన రవి, సుదర్శన్, షకలక శంకర్ కామెడీ పండించారు. ఆలి ఉన్న కొద్దిసేపు నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. పోసాని ఎప్పటిలానే కామెడీ రోల్ తో ఆకట్టుకున్నాడు.  మిస్టర్ ఈగోగా పృధ్వి స్కోప్ ఉన్న పాత్రే చేశాడు. అయితే అతన్ని వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక రౌడిషీటర్ రాజు పాత్ర ఉన్న కొద్ది సేపైనా విలనిజం ప్రదర్శించాడు.      



చుట్టాలబ్బాయ్ సినిమా ముందుగా దర్శకుడు వీరభద్రం విషయానికొస్తే కథ పాతదే కాని దాన్ని చెప్పే ప్రయత్నంలో కూడా దర్శకుడు పూర్తిగా పట్టు తప్పాడు. థమన్ సంగీతం ఓకే అనిపించింది. నేపథ్య సంగీతం కాస్త సినిమాను కాపాడింది. అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఒకే కాని సినిమా ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. ఎస్.ఆర్.టి బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. మొదటిసారే అయినా సినిమాకు కావాల్సిన ప్రొడక్షన్ ఎఫర్ట్ నిర్మాత ఇచ్చారు.

చుట్టాలబ్బాయ్.. ఓ పాత సినిమా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ఇదవరకు సినిమాల కంటే స్క్రీన్ స్కోప్ బాగానే వాడుకున్నాడు. అయితే దర్శకుడు వీరభద్రం అనుకున్న ఈ కథ కొత్తదేమి కాదు.. ఇక కథనం ఏమన్నా కొత్తగా నడిప్తాడా అంటే అది రొటీన్ గా నడుస్తుంది. మొదటి భాగంలో కొన్ని కామెడీ సీన్స్ తప్ప సినిమా మొత్తం కథ ఆడియెన్ ముందే కనిపెట్టేస్తాడు. ఇక సినిమా ఎక్కడ గ్రిప్పింగ్ తో నడిపించలేదు దర్శకుడు. అంతా ఎదో కామెడీగా నడుస్తుంది. సీరియస్ సీన్స్ కూడా పేలవంగా నడిపించేశారు. 


రికవర్ ఏజెంట్ గా పనిచేస్తున్న బాబ్జి ఓ అమ్మాయితో ఒక రెండు సార్లు మాట్లాడితే ఆ అమ్మాయి అన్న అతన్ని కొట్టడం, వార్నింగ్ ఇవ్వడం వరకు ఓకే కాని ఆ అమ్మాయి పారిపోతుంటే ఇతను వెంటపడటం లాజిక్ అనిపించదు. ఆ అమ్మాయితో ఎలాంటి రిలేషన్ లేకుండా హీరో హీరోయిన్ కోసం ఏదేదో చేస్తుంటాడు. ఇక పోలీసుల నుండి తప్పించుకోవడం మళ్లీ ఓ విలన్ గ్యాంగ్ వారిని టార్గెట్ చేయడం కూడా రొటీన్ గానే ఉంటుంది. 


ఏసిపి తన తమ్ముడిని ఎంకౌంటర్ చేశాడని తన చెల్లిని టార్గెట్ చేస్తూ రౌడిషీటర్ రాజు కేవలం సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇవ్వడం అది కూడా విలనిజం అంతగా పండలేదని చెప్పాలి. ఇక ఊళ్లో దొరబాబు చాలా పెద్ద మనిషి అతని గురించి చాలా మంది చెబుతుంటారని విలన్, ఏసిపి అంటారు.. అయితే ఆ హుందా తనం కేవలం నిలబడి చూడటానికే అన్నట్టు అయ్యింది సాయి కుమార్ పరిస్థితి. ఆది వరకు తన బాబ్జి రోల్ తో అదరగొట్టినా హీరోయిన్ అంతగా ప్లస్ అవ్వలేదు.  


ఇక హీరో హీరోయిన్ లవ్ సీన్స్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. అప్పటిదాకా కలిసి ఉన్నా రాని ఫీలింగ్ వారు విడిపోయాక రావడం అంత గొప్పగా ఏం అనిపించదు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక మొదటి భాగం కొన్ని నవ్వులతో నడిపించినా సెకండ్ హాఫ్ రొటీన్ ఫ్యామిలీ డ్రామాతో లాగించి చివరకు మళ్లీ రొటీన్ ఎండింగే ఇచ్చేశాడు దర్శకుడు. కాసిన్ని నవ్వుల కోసం ఆదిని కాస్త కొత్తగా చూసే వారికి తప్ప ఈ చుట్టాలబ్బాయ్ అంతగా ఆకట్టుకోలేదు.  

Aadi,Namitha Pramodh,Veerabhadram Mullapudi,Venkat Talari,Ram Talluri,Thaman SS ఆది 'చుట్టాలబ్బాయ్' మళ్లీ నిరాశ పరచాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: