కథ ,కథనం ,డైరక్షన్ ,ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ,మ్యూజిక్కథ ,కథనం ,డైరక్షన్ ,ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ,మ్యూజిక్అక్కడక్కడ స్లో అనిపించడం
సాయి రాం, గాయత్రి, అభి, మహిత ఈ నలుగురు జీవితాల కథే ఈ మనమంతా. విజేత సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న సాయి రాం (మోహన్ లాల్) మేనేజర్ పోస్ట్ కోసం ఎదురుచూస్తుంటాడు. మధ్యతరగతి జీవితాన్ని గడుపే సాయి రాం ఎన్ని సమస్యలొచ్చినా సర్ధుకుంటూ పోతుంటాడు. ఇక గాయత్రి (గౌతమి) కూడా అంతే తన కుటుంబానికి కావాల్సినవన్ని చూస్తూ  మంచి గృహిణిగా ఉంటుంది. అభి (విశ్వాంత్) క్లవర్ స్టూడెంట్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. మహతి (రైనా రావు) పరుల కోసం సహాయపడే మంచి మనసుతో కనిపిస్తుంది. అయితే ఈ నలుగురు జీవితాల్లో జరిగిన ఓ సంఘంటన వారిని ఎలాంటి పరిక్ష పెట్టింది అన్నది మనమంతా కథ. వీరు జీవితాల్లో అనుకోని మలుపులేంటి.. ? వాటి వల్ల ఎలాంటి పరిణామాలు దారి తీశాయి..? అసలు వీరి నలుగురు ఎవరికి ఎవరు ఏమవుతారు అన్నది అసలు కథ. 

మనమంతా కథ అనుకున్నప్పుడే ఈ సినిమా కేవలం మోహన్ లాల్ మాత్రమే చేయగలరు అన్నప్పుడు దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి చెప్పేది నిజం కాదేమో అనిపిస్తుంది కాని సినిమా చూశాక సాయి రాం పాత్రకు మోహన్ లాల్ తప్ప మరెవరిని ఊహించలేం అనక తప్పదు. కంప్లీట్ యాక్టర్ గా మోహన్ లాల్ మనమంతాలో అద్భుతమైన నటన కనబరిచారు. ఇక తన రోల్ కు తానే డబ్బింగ్ చెప్పుకుని సినిమా మీద తనకున్న కమిట్మెంట్ ఏంటో చూపించారు మోహన్ లాల్. ఇక గాయత్రిగా చేసిన గౌతమి కూడా మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. తన సహజ నటనతో మనమంతా సినిమాకు ఓ మంచి నిండుతనం తెచ్చారు గౌతమి. ఇక సినిమాలో మహతిగా చేసిన రైనా రావు గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. ఎదుటివారికి సహాయం చేయాలన్న మంచి మనసున్న వ్యక్తిత్వంతో కూడిన ఆ చిన్నారి పాత్ర సింప్లీ సూపర్బ్. ఆమె నటన కూడా చాలా సహజంగా చేసింది. అభిగా నటించిన విశ్వాంత్ కూడా ఓకే అనిపించుకున్నాడు. ఇక అతిధి పాత్రల్లో నటించిన గొల్లపుడి మారుతి రావు, తారకరత్నలు కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. అభి స్నేహితురాలిగా చేసిన అనీషా కూడా కొద్దిసేపైనా మంచి పాత్ర చేసింది. 

టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా కథ కథనం దర్శకత్వం మొత్తం తానై నడిపించిన చంద్రశేఖర్ యేలేటి మరోసారి తన ప్రతిభ కనబరిచాడు. రాసుకున్న కథను ఎక్కడ తప్పుదోవ పట్టించకుండా కథనం రాసుకుని అదే విధంగా చిన్నపాటి సస్పెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా మహేష్ శంకర్ సంగీతం సినిమాకు మంచి హెల్ప్ అయ్యింది. జి.వి చంద్ర శేఖర్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథకు ఎంతవరకు అవసరమో అంత కుదిరినట్టి పెట్టాడు నిర్మాత.  

ఐతే సినిమా నుండి తన సినిమా అంటే ఆడియెన్స్ లో చిన్న క్యూరియాసిటీ ఏర్పడేలా చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ఈ మనమంతా కూడా తన మ్యాజిక్ తో ఓ రకంగా అద్భుతాన్ని చేశాడు. నలుగురు జీవితాలతో అల్లుకున్న కథ దానికి మధ్యతరగతి సాధక బాధకాలు ఇక అవి ఏమాత్రం సినిమాటిక్ గా లేకుండా చేసే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యేలేటి సినిమా అంటే విషయమున్న సినిమా అన్న ఆలోచనతో వచ్చే ఆడియెన్స్ కు ఈ మనమంతా కూడా తన అద్భుతాన్ని చూపించాడు. 


కథ రాసుకున్నప్పుడు నలుగురు పాత్రలు ఏ విధంగా అనుకున్నాడో అవి తెర మీద ఆవిష్కరించడంలో కూడా దర్శకుడు అదే విధంగా సక్సెస్ అయ్యాడు. జీవితంలో పైకి ఎదగడం కోసం తప్పుడు మార్గం ఎన్నుకుంటే అది జీవితాన్నే ప్రమాదకరంగా మార్చేలా చేస్తుందని సాయి రాం పాత్రతో చెప్పగా.. ఓ చిన్నారి పాపతో కల్మషం లేని ప్రేమ ఎటువంటి వారినైనా మార్చేస్తుంది అన్న విషయాన్ని చెప్పగలిగాడు. ఇక తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ గృహిణి జీవితంలో గొప్ప అవకాశం వచ్చినా ఈ బంధాలను విడిచి వెళ్లలేదనే కనెక్టివిటీ.. ఇక క్లవర్ స్టూడెంట్ గా ఉన్న అభి ప్రేమ మత్తులో పడి కెరియర్ ను కాదు జీవితాన్నే వదిలేద్దాం అనుకునేలోపు అమ్మ పోగొట్టిన బ్యాగ్ చెప్పే సందేశం. ఇక సినిమా పతాక సన్నివేశాలు అందరిని ఒక్క దగ్గరికి చేర్చి అదరహో అనిపించుకున్నాడు. 

ఇలా అనుకున్న నాలుగు పాత్రలతో ఓ జీవితానికి సరిపడ అనుభవాలను ఇచ్చాడు దర్శకుడు యేలేటి. ప్రతి ఒక్క వయసు వారికి మనసుతో పెట్టి చూస్తే మనమంతా అర్ధమవుతుంది. కమర్షియల్ అంశాలు కావాలి.. కామెడీతో ఎంటర్టైన్ చేయాలి అనుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉండదు.
Mohanlal,Gautami,Viswant Duddumpudi,Chandra Sekhar Yeleti,Sai Korrapati,Rajani Korrapati,Mahesh Shankarమనసుని కదిలించే 'మనమంతా'..!

మరింత సమాచారం తెలుసుకోండి: