విక్రం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీవిక్రం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ ,స్లో నేరేషన్ ,రొటీన్ స్టోరీ

లవ్ (విక్రం) ఓ సైంటిస్ట్ తను కనిపెట్టిన స్పీడ్ డ్రగ్ తో ప్రపంచం మొత్తం తన ఆదీనంలో తెచ్చుకోవాలని చూస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం లవ్ సామ్రజ్యాన్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అఖిల్ వినోద్ (విక్రం) తన సీక్రెట్ ఆపరేషన్ తో లవ్ సమ్రాజ్యాన్ని కూల్చేస్తాడు. అయితే అక్కడితో లవ్ చనిపోయాడు అనుకుని తన వృత్తికి కూడా దూరంగా అఖిల్ ఉంటాడు. చాలా కాలం తర్వాత మలేసియాలో ఇండియన్ ఎంబసీలో ఓ వృద్ధుడు లవ్ తయారు చేసిన స్పీడ్ డ్రగ్ తో 20 మంది ప్రాణాలను తీస్తాడు. లవ్ చనిపోయాడు అనుకున్న ఇండియ పోలీస్ దానికి షాక్ అవుతారు. వెంటనే లవ్ కేస్ ఇన్వెస్టిగేట్ చేసిన అఖిల్ ను మళ్లీ రంగంలో దించుతారు. తన భార్య మీరా (నయనతార) లవ్ వల్లనే చనిపోయిందని అఖిల్ కూడా లవ్ మీద పగతీర్చుకోవాలని అనుకుంటాడు. ఇక ఆల్రెడీ సస్పెషన్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆరుషి (నిత్యా మీనన్) అసిస్టెంట్ గా అఖిల్ మళ్లీ ఈ ఆపరేషన్ ను డీల్ చేసేందుకు మలేషియా వెళ్తాడు. అసలు లవ్ చేసే డ్రగ్ ఎలా ఉపయోగపడుతుంది..? దానితో లవ్ ఎం సాధిద్దాం అనుకున్నాడు..? చివరకు అఖిల్ లవ్ ను ఏం చేశాడు..? అన్నది అసలు కథ.  

అపరిచితుడు, ఐ సినిమాలతో విక్రం సినిమా అంటే కచ్చితంగా తన క్యారక్టరైజేషన్ తోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడని తెలుసు. ఇక ఇంకొక్కడు సినిమాలో విక్రం అఖిల్ వినోద్, లవ్ ల పాత్రల్లో మరోసారి మెప్పించాడు. అఖిల్ గా అలరిస్తూనే లవ్ గా ట్రాన్స్ జెండర్ పాత్రలో విక్రం అదరగొట్టేశాడు. ఇక రా ఏజెంట్స్ గా నయనతార,నిత్యా మీనన్ జస్ట్ ఓకే. మీరా పాత్రలో నయన్ ఓకే అనిపించగా ఆరుషిగా నిత్యా మరోసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారక్టర్ లో నటించి మెప్పించింది. అయితే నిత్యా పాత్ర మరి చిన్నదిగా ఉంటుంది. నాజర్, తంబి రామయ్య పాత్రలు పరిది మేరకు నటించారు.

సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలా తెరకెక్కించిన ఆనంద్ రంగ దర్శకత్వం పరంగా ఓకే అనిపించినా కథ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. లవ్ ను ట్రేస్ చేసి పట్టుకోవడమే మొత్తం కథ దాన్ని రెండున్నర గంటలు సాగించినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోనే నడవడం ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. సినిమా సంగీతం పరంగా హారీస్ జైరాజ్ మ్యూజిక్ పాటలు నిరాశ పరచినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. విక్రం ను రెండు షేడ్స్ లో బాగానే చూపించారు. భాను శ్రీనివాసన్ ఎడిటింగ్ ఓకే అనిపించినా ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. శింభు తమీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఐ తర్వాత అంచనాలను మించి సినిమా అందించాలనే ఉద్దేశంతో వచ్చిన ఇంకొక్కడు రొటీన్ కథా కథాంశాలతో వచ్చాడు. ఆనంద్ శంకర్ రాసుకున్న ఇంకొక్కడు కథలో ఆ స్పీడ్ డ్రగ్ తప్ప మిగతా అంతా పాత చితకాయ పచ్చడే.. లవ్ ను ట్రేస్ చేసి పట్టుకోవడమే సినిమా కథ.. అయితే ఇక్కడ లవ్ క్యారక్టర్ చేసిన విక్రం ట్రాన్స్ జెండర్ గా అలరించినా అంతగా ఆకట్టుకోలేదు. అఖిల్ గా పర్ఫెక్ట్ అనిపించుకున్న విక్రం లవ్ గా సోసోగానే ఉన్నాడు. ఇక సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. సగటు సినిమా వీక్షకుడు సినిమా బోర్ ఫీలవ్వడం ఖాయం.

నాలుగేళ్ల తర్వాత డ్యూటీలో జాయిన అయిన అఖిల్ మలేషియన్ పోలీస్ సహకారంతో లవ్ ను పట్టుకోవాలని చూస్తాడు. ఇక ఇంటర్వల్ బ్యాంగ్ లో చనిపోయింది అనుకున్న అఖిల్ భార్య మీరా మళ్లీ ప్రత్యక్షమవుతుంది. అల్లుకున్న కథనే పొడిగించాలనే ఉద్దేశంతో తప్పించి ఏమాత్రం ఆకట్టుకునే కథ కథనాలు లేవని చెప్పాలి. కేవలం విక్రం మార్క్ స్టైలిష్ యాక్షన్ కోసం సినిమా చూసేయొచ్చు.

ఇక తమిళ సినిమా అంతా కాన్సెప్ట్ బేస్ మీదే వెళ్తుంటాయి.. కాని మన దగ్గర సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కూడా ఉండేలా జాగ్రత్త పడతారు. అయితే ఇవేవి లేకపోవడంతో ఇంకొక్కడు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి నచ్చే అవకాశం లేదు. టెక్నికల్ గా హై స్టాండర్డ్ తో తీసిన ఈ సినిమాలో కథ అనేది లేకుండా అంతా ముందే ఊహించేలా ఉండటంతో ఆడియెన్ ఎక్కడ థ్రిల్ ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంటర్వల్ లో చనిపోయింది అనుకున్న నయనతార రావడం కూడా పెద్ద ట్విస్ట్ ఏం అనిపించదు.

ఇలాంటి కథ కథనాలతో చాలా సినిమాలు చూసిన అనుభవం ప్రేక్షకులే ఉంది కాబట్టి వారి ఈ సినిమా అంతగా రుచించదు. మరి బోర్ కొట్టి విక్రం మార్క్ స్టైలిష్ యాక్టింగ్ చూడాలనుకునే వారికి ఏమన్నా ఇంకొక్కడు నచ్చే అవకాశం ఉంది.

Vikram,Nayantara,Nithya Menen,Anand Shankar,Shibu Thameens,Harris Jayarajఇంకొక్కడు మరో రొటీన్ సినిమా ..!

మరింత సమాచారం తెలుసుకోండి: