Jabardasth: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

    సిద్దార్థ, సమంత జంటగా నటించిన సినిమా ‘జబర్థస్త్’. ఈ సినిమాకు ‘అలా మొదలయ్యింది’ ఫేం నందినిరెడ్డి దర్శకత్వం వహించడం, బెల్లంకొండ సురేష్ నిర్మించడం వంటి కారణాలతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. మరి ఈ ‘జబర్థస్త్’ ఏలా ఉందో చూద్దాం..! చిత్రకథ :     భైర్రాజు [సిద్ధార్థ] బాగా డబ్బులు  సంపాదిద్దామని ఆశతో అప్పులు చేసి అనేక వ్యాపారాలు చేస్తాడు. అయితే నష్టాలు రావడంతో అప్పు ఇచ్చినవారు అతన్ని తరముతుంటారు. బైర్రాజు అనుకోకుండా ఒకసారి శ్రేయా [సమంత] బిజినెస్ ఐడియాను విని, దాని ద్వారా ఉద్యోగం సంపాదిస్తాడు. ఊహించని పరిణామాలతో ఉద్యోగం పొగొట్టుకుని, శ్రేయాతో వ్యాపారం ప్రారంభిస్తాడు. ఇద్దరూ దగ్గర అవుతారు అనుకునే సమయంలో భైర్రాజు మాటలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. భైర్రాజు సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తాడు... తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి.., శ్రేయా-భైర్రాజు ఎలా దగ్గర అయ్యారు అనేది చిత్ర కథాంశం. నటీనటుల ప్రతిభ :     హీరో సిద్ధార్థ ఈ సినిమాతో తన కెరీయర్ లో తొలిసారిగా ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశాడు. ఫైట్లు చేయకపోయినా, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడ్డం, లుంగీ పైకైత్తి డ్యాన్సులు చేయడం.. వంటి లక్షణాలతో కూడిన పాత్రను బాగా పండించాడు. కామెడీ నిండిన డైలాగులతో అదరగొట్టాడు. చివరిలో సెంటిమెంట్ కూడా పండించాడు. సమంత చాలా చలాకీ అయిన పాత్రలో నటించింది. ముఖ్యంగా పెళ్లి చూపులతో సమంత పరిచయ సన్నివేశం ఆమె నటన లోని కొత్త కోణాన్ని చూపించింది. పాటల్లో గ్లామర్ తో రాణించిన సమంత ఈ సినిమాల్లో కనిపించిన అన్ని సన్నివేశాల్లోనూ మంచి నటన ప్రదర్శించింది. నిత్యామీనన్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఊహించలేని పాత్రతో నిత్యామీనన్ అధ్బుతంగా ఆకట్టుకుంది. ఏ పాత్రలోనైనా రాణించే నటి నిత్యామీనన్. ఆమెకు వేసిన గెటప్ లు కూడా బాగున్నాయి. షియాజీ షిండే పాత్ర నవ్వులు పండిస్తుంది. తాగుబోతు రమేష్, తెలంగాణ శకుంతల పాత్రలు రోటిన్ గా అనిపించినా అలరిస్తాయి. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. మ్యూజిక్ బాగుంది. పాటలు, వాటి చిత్రీరణ కూడా ఆకట్టుకుంటాయి. మాటలు సరదాగా సాగాయి. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. శ్రీహరి-మలేషియా సీన్లు చాలా సాధారణంగా ఉన్నాయి. ‘అలా మొదలయ్యింది’ చిత్రంతో ప్రేమ కథతో ఆకట్టుకున్న నందిని రెడ్డి ఈసారి ఎంటర్ టైన్మెంట్ కథాంశంతో సినిమా రూపొందించారు. లేజిక్ లు గురించి ఆలోచించకుండా సినిమాను ఆహ్లదంగా నడిపారు. కథ లేకపోయినా వినోదంపైనే భారం వేసి సినిమాను నడిపించారు. అక్కడ అక్కడ బోర్ కొట్టించినా హాస్యం, పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సినిమాను ముగించారు.      హైలెట్స్ :
  • సిద్ధార్థ

  • సమంత

  • నిత్యామీనన్

  • నటన

  • మాటలు

  • పాటలు
  డ్రాబ్యాక్స్ :
  •  సాధారణ కథ

  • ఊహించే ముగింపు
విశ్లేషణ : ఇటీవల కాలంలో స్టార్ హీరోలు కూడా ఎంటర్ టైన్మెంట్ వైపు మెగ్గు చూపిస్తున్నారు. దీంతో నందినిరెడ్డి తన రెండవ చిత్రంతో అలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటలతో గారడీ చేస్తూ సాగే ఈ సినిమాను స్ర్ర్కీన్-ప్లే బలంతో నడిపించాలని చూశారు. సినిమా ప్రారంభం, ఆ తరువాత కూడా సినిమా ఆసక్తికరంగా సాగుతుంది, అయితే విశ్రాంతి బ్లాకు ముందు, మలేషియా డాన్ గా శ్రీహరి సన్నివేశాలు బోర్ కలిగిస్తాయి... ఇక్కడే స్ర్కీన్ ప్లే గాడి తప్పినట్లు అనిపిస్తుంది, అయితే తాగుబోతు రమేష్, షియాజీ షిండే పాత్రలు వినోదం పంచుతూ సినిమా నడిపిస్తాయి. కానీ కృత్రిమంగా అనిపించే సెంటిమెంట్ తో కూడిన సాధారణమైన ముగింపుతో శుభం కార్డు పడుతుంది. టాలీవుడ్ లో కామెడీ పండించగల దర్శకులు అతి కొద్దిమంది. పైనా కిందా పడి, కాళ్ళు చేతులు కొట్టేసుకునేటటువంటి వికృతి చేష్టలు లేకుండా నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సామన్య పాత్రల నుండి ఇంటిల్లపాదీ ఆస్వాదించకలిగినటు వంటి హాస్యాన్ని అందించగలిగిన పత్రిభ నందినిరెడ్డిలో కనబడుతుంది. ‘అలా మొదలయింది’ అయినా, జబర్థస్త్ అయినా... ఈ కామెడీయే ప్రేక్షకులు టిక్కెట్ కోసం ఖర్చు చేసిన డబ్బుకి విలువ చూపిస్తాయి. అలాగే పాటల మీద శ్రద్ధ చూపించే దర్శకుల్లో నందిని రెడ్డి ఒకరు. ముఖ్యంగా ‘ఎందుకీ కలహాలు’ పాటలో నందినిరెడ్డి స్టైల్ కనిపిస్తుంది. లాజిక్ లు వెతక్కుండా సినిమా చూడ్డానికి, నవ్వుకోవడానికి ఈ చిత్రం చూడవచ్చు. కానీ, తన తొలి చిత్రం ‘అలామొదలయింది’తోనే యావత్తు టాలీవుడ్ ని తన ప్రతిభతో తనవైపునకు తిప్పుకున్న నందినిరెడ్డికి బెల్లంకొండ సురేష్ లాంటి నిర్మాత, నెంబర్ వన్ హీరోయిన్ సమంత, సిదార్థ లాంటి దర్శకుల నటుడు దొరికినప్పుడు ఇంకా గొప్ప చిత్రం తీసుండోచ్చు.    చివరగా :   కామెడీ జస్ట్ కామెడి.  

Jabardasth Review: Cast & Crew

 

More Articles on Jabardasth || Jabardasth Wallpapers || Jabardasth Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: