Jabardasth:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


APHerald  ‘జబర్ధస్త్’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం, ఉగ్రవాదుల బాంబు బ్లాస్టింగ్ లో మృతిచెందిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము
8:55am : నటీ, నటులు, సాంకేతికవర్గ చిన్ననాటి ఫోటోలతో నందిని రెడ్డి ట్రేడ్ మార్క్ శీర్షికలు ‘అలామొదలైంది’ శీర్షిక కార్డులను గుర్తుకుతెస్తూ ‘జబర్ధస్త్’ సినిమా టైటిల్స్ పడుతున్నాయి.
8:59am :బీహార్ నేపథ్యంలో షియాజీషిండే పరిచయమవుతున్న సన్నివేశం ఫన్నీగా ఉంది.                
9:01am :సిద్ధార్థ్ పరిచయం... అతని పాత్ర గురించి సునీల్ చెబుతున్న వాయిస్ ఓవర్ బాగుంది.
9:03am :సినిమాలో మొదటిట పాట ‘తీస్ మార్ ఖాన్’ వస్తుంది.
9:08am :సమంత ఎంట్రీ బాగుంది. గులాబీ కలర్ చీరలో వయ్యారంగా కనిపిస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ‘కుందనపు బొమ్మ’ అనే సాంగ్ రావడం మస్తుగుంది.              
9:10am :సమంత పెళ్ళి చూపుల సన్నివేశం ఫన్నీగా ఉంది, సమంత బిట్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ స్వీట్ గా కనుబడుతుంది.  
9:16am :సమంత పాత్ర పేరు [శ్రేయ],ఇప్పిటిదాకా చిన్మయి ఇచ్చిన వాయిస్ కంటే ఈ సినిమాలో ఇచ్చిన వాయిస్  సమంతాకు సెట్ అయింది.
9:21am :ఇప్పుడు వస్తున్న సన్నివేశాలు హిందీ చిత్రం బ్యాండ్ బాజా- బరాత్ నుండి కాపీ కొట్టినట్లున్నాయి.
9:25am :సిద్దార్థ్ ఫన్నీబట్లర్ ఇంగ్లీష్ తో థియేటర్ లో నవ్వులపువ్వులు పూయిస్తున్నాడు.                  
9:27am :డ్యాన్స్ మాస్టర్ గా ధర్మవరపు ఫన్నీగా కనిపిస్తున్నాడు.
9:33am : ‘తెలంగాణ’ శకుంతల వడ్డీ వ్యాపారిగా సిద్ధార్థ్ ను వెంటాడుతున్న సన్నివేశం బాగుంది... ‘లక్ష్మీ’ సినిమాలో తన నటనను గుర్తుకు తెచ్చేవిధంగా వుంది.  
9:40am :‘తాగుబోతు’ రమేష్ మద్యం సీసాతో ఎట్రీ ఇస్తూ ‘లష్కర్ పోరి చూడు’ సాంగ్ ప్రారంభించాడు సమంతా, సిద్ధార్థ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకుట్టుకుంటుంది.
9:48am :సిద్ధార్థ్ తమాషా మాటలకు థియేటర్ లో ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతున్నారు.
9:57am :సమంతా నెమ్మదిగా సిద్దూతో ప్రేమలో పడుతుంది. ఈ సన్నివేశంలో ‘నిన్నిలా..’ సాంగ్... ఈ సాంగ్ లో సమంతా శారీలో అందంగా కనిపిస్తుంది.
10:08am :ట్విస్ట్: సిద్దూ, సమంతాకు షాక్ ఇచ్చాడు. చిత్రంలో ఇది మొదటి సెంటిమెంట్ సీన్.
విశ్రాంతి :  
10:18am :లక్ష్మీదేవి గెటప్ లో డ్రామా ఆర్టిస్ట్ లాగా... నిత్యామీనన్ పరిచయం బాగుంది.  
10:20am :షియాజీ, ధన్ రాజ్ ల కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులలో నవ్వులపువ్వులు పూయిస్తున్నాయి.
10:28am :నిత్యామీనన్ సిద్ధార్థ్ టీమ్ లో చేరి ఒక కొత్త వ్యాపారానికి సహాయం చేస్తుంది. వీరిద్దరి మద్య జరిగే సన్నివేశాలు చక్కగా చితీకరించారు. నిత్యా, సిద్దూ జంట చూడ్డానికి బాగున్నారు.
10:40am :నిత్యామీనన్, సిద్దూతో సన్నిహితంగా ఉండటాన్నిసమంతా సహించలేకపోతుంది. ఈ సన్నివేశంలోముగ్గురి మధ్య సాగుతున్న ‘మేఘమాల’ అనే సాంగ్ వస్తుంది.
10:54am :సమంతా బెల్లీ డ్యాన్స్ తో హాట్...హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుంది.
10:59am :చిత్రంలో కథ మలేషియాకు మలుపు తిరిగింది. శ్రీహరి డాన్ క్యారెక్టర్ ఇట్రస్టింగ్ గా వుంది. తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
11:05am :‘తాగుబోతు’ రమేష్,  ‘వెన్నెల’ కిషోర్ ల మధ్య జరిగే కామేడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
11:12am :‘అల్లా గుల్లా... అల్లా...’ సాంగ్ వస్తుంది. సమంతా డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలేదు.
11:17am :సిద్దార్థ కూడా సమంతా ప్రేమలో పడ్డాడు. ఫిలీం క్లైమాక్స్ కు చెరవవుతుంది.
11:25am :తాగుబోతు రమేష్ తో ఫన్నీ ఫైట్ సీన్ వస్తుంది. సమంతా సెంటిమెంట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
11:26am :క్లైమాక్స్ సెంటిమెంట్ సన్నివేశాలతో సాగుదీస్తున్నారు.
11:35am :సంతోషకరమైన విషయంతో సినిమా శుభం పడుతుంది.
శుభం :                                                                               

Jabardasth Review: Cast & Crew

   

More Articles on Jabardasth || Jabardasth Wallpapers || Jabardasth Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: