నాగార్జున ,రోషన్, శ్రీయా శర్మల నటన,మ్యూజిక్నాగార్జున ,రోషన్, శ్రీయా శర్మల నటన,మ్యూజిక్డైరక్షన్ ,స్లో నేరేషన్

పేద కుటుంబంలో పుట్టిన శామ్యుల్ (రోషన్) భూపతి నగరంలోని రాజ వంశీయులైన భూపతి రాజు కూతురు శాంతి (శ్రీయా శర్మ) ను ప్రేమిస్తాడు. అయితే వారి ప్రేమను కాదని చెప్పడంతో పాటుగా తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలంటే తనకంటే ఎక్కువ సంపద పేరు ప్రతిష్టలతో వచ్చి కనబడమని భూపతి రాజు చాలెంజ్ చేస్తాడు. దాని కోసం తల్లి తండ్రులను వదిలి హైదరాబాద్ వచ్చిన శామ్యుల్ కింగ్ నాగార్జునను కలిసి తనతోనే చాలెంజ్ చేసే ప్రోగ్రాం ఒకటి చెబుతాడు. ఇంతకీ శామ్యుల్ నాగార్జునతో చేసిన చాలెంజ్ ఏంటి..? భూపతి రాజు పందెంలో ఎవరు గెలిచారు..? శామ్యుల్, రోషన్ లు ఒకటయ్యారా అన్నది అసలు కథ.

హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన నిర్మలా కాన్వెంట్ లో రోషన్ లుక్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. టీనేజ్ లవర్ గా హీరోకున్న క్వాలిటీస్ అన్ని సూపర్ గా మెయింటైన్ చేశాడు. అయితే మొదటి సినిమా కాబట్టి నటనలో ఇంకాస్త పరిణితి రావాల్సి ఉంది. మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్ యాక్టింగ్ పరంగా రోషన్ మంచి మార్కులే కొట్టేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీయా శర్మ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసింది అందుకే శాంతి పాత్రలో ఆడియెన్స్ కు వెంటనే కనెట్ అయ్యింది శ్రీయా శర్మ. కింగ్ నాగార్జున ఈ సినిమా భారమంతా తన మీద వేసుకున్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం అన్ని తానై నడిపించాడు నాగార్జున. బుల్లితెర మీద కనిపించిన ఎం.ఈ.కే ప్రోగ్రాం తో నాగ్ ఈసారి సిల్వర్ స్క్రీన్ పై గేం షోలో అలరించారు. ఇక మిగతా పాత్రలందరు తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

నాగ కోటేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా డైరక్షన్ పరంగా ఓకే అనిపించుకుంది కాని సినిమా మొత్తం ముందే ఊహించేసినట్టు జరుగుతుంది. ఇక రోషన్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎం.ఈ.కె సెట్ ను సిల్వర్ స్క్రీన్ మీద చాంపియన్ ఆఫ్ చాంపియన్ ప్రొగ్రాం ద్వారా చూపించిన సెట్ ప్రాపర్టీస్ అంతా కొత్తగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎలాగు నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్ లు కాబట్టి సినిమా అవుట్ పుట్ రిచ్ గా వచ్చింది.

నిర్మలా కాన్వెంట్ అని ఓ టీనేజ్ లవ్ స్టోరీతో కథ రాసుకున్న దర్శకుడు.. దానికి స్లం డాగ్ మిలినియర్ కాన్సెప్ట్ ను యాడ్ చేశాడని అనిపిస్తుంది. నాగ్ చేసిన స్పెషల్ షోతో తన అభుభవాలను ప్రశ్నలకు ఆన్సర్ గా చెప్పిన విధానం బాగుటుంది. అయితే సినిమాను ఇంకాస్త గ్రిప్పింగ్ తో చేసుంటే ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యుండేది. ఇక మొదటి భాగమంతా దర్శకుడి లోపం కనిపిస్తుంది.

 

ఎంచుకున్న కథను అదే రేంజ్లో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు కొన్ని పొరపాట్లు చేశాడు. సెకండ్ హాఫ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చాకా సినిమా కాస్త స్పీడ్ అందుకుంటుంది. ఇక రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ లో జాగ్రత్త పడ్డ దర్శకుడు టీనేజ్ లవ్ లో ఉన్న ఫ్రెష్ నెస్ ను కూడా కొంతమేరకు కన్వే చేయగలిగాడు.


క్లైమాక్స్ లో నాగార్జున, రోషన్ ల మధ్య రియాలిటీ షో అంత సీరియస్ గా సాగినట్టు అనిపించదు.. ఆ ప్రశ్నలు కూడా రెండు కోట్ల ఆటకు అడిగే ప్రశ్నల్లా ఉండవు.. సినిమా మొత్తం దర్శకుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డా మెయిన్ నేరేషన్ విషయంలో పొరపాట్లు చేశాడు. సరదాగా చూసే వారికి తప్ప సినిమా ప్రత్యేకంగా చూడాల్సిందిగా ఉండదు.

Roshan Meka,Shriya Sharma,G. Naga Koteswara Rao,Nagarjuna Akkineni,Nimmagadda Prasad,Roshan Saluriటీనేజ్ లవ్ తో.. నిర్మలా కాన్వెంట్

మరింత సమాచారం తెలుసుకోండి: