కార్తి నటన ,విజువల ఎఫెక్ట్స్ , కామెడీకార్తి నటన ,విజువల ఎఫెక్ట్స్ , కామెడీసెకండ్ హాఫ్ స్లో అవడం, స్క్రీన్ ప్లే ,సాంగ్స్

కాష్మోరా (కార్తి) ఆత్మలను వశం చేసుకునే దెయ్యాల భారిన పడిన వారి నుండి కాపాడుతూ ఉంటాడు. అయితే ఇదంతా తను చేసే మ్యాజిక్ అని తెలియదు. అయితే ఇతను నిజంగానే ఆత్మలను బందిస్తాడనిఓ పొలిటిషియన్ ద్వారా ఓ ఆత్మను బంధించాలని కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ కోటలోకి వెళ్లిన కాష్మోరాఅక్కడ ఇరుక్కుపొతాడు. అయితే అసలు కోటలోకి కాష్మోరాని రప్పించేలా చేసుకుంది రాజ్ నాయక్ (కార్తి)ఆత్మ.  అసలు కాష్మోరాను రాజ్ నాయక్ అక్కడికి ఎందుకు రప్పించాడు..? అక్కడ నుండి తను ఎలా బయటపడ్డాడు..? అన్నది అసలు కథ.   

కాష్మోరా సినిమా గురించి చెప్పాలంటే ముందు కార్తి గురించి మాట్లాడాలి. సినిమాలో మూడు పాత్రల్లో కార్తి అదరగొట్టాడు. తనలోని విలక్షణ కోణాన్ని ఈ సినిమా చూపించాడు కార్తి. ముఖ్యంగా ఇంటర్వల్ కు ముందు సీన్స్ లో ఆకట్టుకున్నాడు. మొదటి భాగం కాష్మోరాగా ఆకట్టుకున్న కార్తి సెకండ్ హాఫ్ లో రాజ్ నాయక్ గా అలరించాడు.ఇక రాణీ రతన్ మహాదేవిగా నయనతార పాత్ర ఉన్నది కొద్దిసేపే అయినా తనమార్క్ నటనతో ఆకట్టుకుంటుంది. శ్రీదివ్య పాత్ర అంతంత మాత్రమే అని చెప్పాలి. కమెడియన్ వివేక్సెటైరికల్ కామెడీతో కాసేపు నవ్వులు పండించాడు.

కాష్మొరా టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా సినిమా దర్శకుడు గోకుల్ తన ప్రతిభ కనబపరిచాడనిచెప్పొచ్చు.. హర్రర్ సినిమాకు మాస్ అండ్ కామెడీ యాంగిల్ ను అద్ది పర్వాలేదు అనిపించాడు. అయితేస్క్రీన్ ప్లేలో ఇంకాస్త పట్టు సాధించి ఉంటే బాగుండేది. సంతోష్ నారాయణన్ పాటలు అంతగాఇంప్రెసివ్ గా లేవు. విజువల ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా ఉన్నా కొన్ని చోట్ల తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా ఇంకాస్త జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేది. 

కార్తితో కాష్మోరా తీయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. అయితే హర్రర్ సినిమాకు కమర్షియల్ హంగులు జోడించి దానికి కామెడీ టచ్ ఇచ్చిన ఈ కాష్మోరా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. సినిమా మొదటి భాగం అంతా సరదాగా రాసుకుని ప్రీ ఇంటర్వల్ సీన్ హైలెట్ గా రాసుకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ ను రొటీన్ గానే కానిచ్చాడు.


ఎప్పుడైతే రాజ్ నాయక్ ఎపిసోడ్ ముగుస్తుందో ఇక క్లైమాక్స్ అందరు ఊహించే విధంగా ఉంటుంది. పోని విజువల్స్ పరంగా ఏమన్నా అద్భుతం చేస్తారేమో అనుకుంటే అది జరుగదు. రొటీన్ కథే కాని కొత్తగా చెప్పాలని ప్రయత్నించిన గోకుల్ కొంతమేరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.


అయితే సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. బాహుబలితో ఈ సినిమాను పోల్చొద్దు అంటూ ఆ రేంజ్ సినిమాగా వచ్చిన కాష్మోరా కాసేపు మగధీర, మరికాసేపు అరుంధతి సినిమాలను గుర్తు చేస్తుంది. కార్తి సినిమాలను అభిమానించే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.

Karthi,Nayanthara,Gokul,S.R.Prabhu,Santhosh Narayanan కాష్మోరా కామెడీతో నడిపించేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: