హీరోయిన్ ,క్యారక్టరైజేషన్ ,కామెడీహీరోయిన్ ,క్యారక్టరైజేషన్ ,కామెడీస్క్రీన్ ప్లే , డైరక్షన్

విక్రం (సుమంత్) అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు.. మంచి ఫిట్నెస్ గల విక్కి జాబ్ మాత్రం చేయాలని ఉండదు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకోవడం చేత తల్లి (శ్రీలక్ష్మి) అతన్ని గారాభంగా పెంచుతుంది. పైకి చిటపటలాడుతూనే లోపల తన గురించి ఆలోచిస్తుంది. ఈ క్రమంలో విక్కికి ఆంజనేయులు (తణికెళ్ల భరణి) ఇన్ ఫెర్టిలిటీ డాక్టర్ పరిచయం అవుతాడు. తల్లిదండ్రులు కాలేని వారికి వీర్య కణాలను ఇస్తూ లీగల్ గా వ్యాపారం చేస్తుంటాడు. అయితే అనుకోకుండా విక్కి మీద ఆంజనేయులు కన్ను పడుతుంది. అతన్ని వీర్యం దానమివ్వాల్సిందిగా కోరతాడు. ముందు కాదన్నా డబ్బుకి ఆశపడి విక్కి అలా ఆంజనేయులు అడిగినప్పుడల్లా స్పెర్మ్ డొనేట్ చేస్తూనే ఉంటాడు. ఇక ఈ క్రమంలో ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) పరిచయం అవుతుంది. ఆమెతో పరిచయం పెంచుకునే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు. తన గురించి అన్ని నిజాలు చెప్పిన ఆషిమా విక్కికి ప్రపోజ్ చేస్తుంది. కాని విక్కి మాత్రం తానో స్పెర్మ్ డోనర్ అని చెప్పాడు. పెళ్ల్లి తర్వాత ఆ విషయం తెలుసుకున్న ఆషిమా విక్కికి దూరం అవుతుంది. అసలు విక్కి ఆషిమా ఎలా దూరమయ్యారు..? ఆ ఇద్దరిని కలిపింది ఎవరు..? ఆషిమాకు ఉన్న సమస్య ఏంటి..? అన్నది అసలు కథ.    

ఎన్నాళ్ల నుండో హిట్ కోసం తపిస్తున్న సుమంత్ ఈసారి ఓ సూపర్ హిట్ రీమేక్ తో వచ్చాడు. స్పెర్మ్ డోనార్ గా సుమంత్ తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ముందు సరదాగా స్పెర్మ్ డొనేట్ చేయడం ఆ తర్వాత అదో సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కంటిన్యూ చేయడం వేరియేషన్స్ చూపించాడు. విక్కి క్యారక్టర్ లో సుమంత్ కనిపించకుండా మంచి ప్రయత్నమే చేశాడు. ఇక ఆషిమాగా పల్లవి సుభాష్ సినిమాకు ప్రాణం పోసింది. అక్కడ యామి గౌతం ఎంత బాగా చేసిందో ఇక్కడ పల్లవి కూడా అంతే బాగా నటించింది. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర చేసిన నటుడు తణికెళ్ల భరణి. ఓ డాక్టర్ గా స్పెర్మ్ డోనర్ ను వెతికే క్రమంలో భరణి గారు చూపించిన కన్ ఫ్యూజన్ మంచి ఫన్ క్రియేట్ చేసింది. సుమంత్, తణికెళ్ల భరణి పాత్రలు మంచిగా ఎంటర్టైన్ చేశాయి. ఇక విక్కి తల్లిగా శ్రీలక్ష్మి అద్భుతంగా నటించారు. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  



ముందుగా విక్కి డోనార్ కథను రీమేక్ గా ప్రయత్నించిన డైరక్టర్ మల్లిక్ రాం గురించి చెప్పుకుంటే. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాను తీసుకొచ్చి ఆ ఫీల్ ను మిస్ గైడ్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి భాగం వరకు దర్శకుడు సక్సెస్ అయినట్టు కనిపించినా అసలు సినిమాకు ఆయువు పట్టైన సెకండ్ హాఫ్ ఏదో అలా కానిచ్చేశాడు. ఇక సంగీతం కూడా థియేటర్లో విన్న సేపు పర్వాలేదు అనిపిస్తుంది. కెమెరా పనితనం బాగుంది కాని ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి.

విక్కి డోనార్ కథను తెలుగులో నరుడా డోనరుడా సుమంత్ హీరోగా చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా బాలీవుడ్ లో ఆ సినిమా ఫీల్ ను తెలుగులో పండించలేదు అన్నది వాస్తవం. సినిమా మొత్తం కామెడీగానే కానిచ్చేశాడు దర్శకుడు మల్లిక్ రాం. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అంతా గ్రిప్పింగ్ తో రాసుకున్నా సెకండ్ హాఫ్ మాత్రం తేలగొట్టాడు.

సుమంత్ క్యారక్టరైజేషన్, పల్లవి సుభాష్ క్యారక్టరైజేషన్ విషయంలో మంచి నైపుణ్యత కనిపించినా అది సినిమాకు ఉపయోగపడకుండా పోయింది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లోనే వెళ్తున్నా చివరి పావు గంట ఫీల్ మిస్ చేసినట్టు కనబడుతుంది. సుమంత్ ఇదవరకు సినిమాల కన్నా పర్వాలేదు బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పులు వచ్చాయి.  

హీరోయిన్ పల్లవి సుభాష్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. మాత్రుక సినిమాలో యామి గౌతంకు ఏమాత్రం తీసి పోకుండా నటించింది పల్లవి. ఇక తణికెళ్ల భరణి క్యారక్టర్ కూడా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. సినిమా మొత్తం సరదాగా నడిచినట్టు అనిపించినా థియేటర్ నుండి బయటకు వస్తే ఎలాంటి ఫీలింగ్ లేకుండా చేస్తుంది.

మరి బోర్ కొట్టి సినిమాకు వెళ్లాలనుకునే వారికి ఈ డోనరుడు కాస్త ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. మరి అంచనాలను పెట్టుకుని వెళ్తే మాత్రం నిరాశ చెందినట్టే.
Sumanth,Pallavi Subhash,Mallik Ram,Y Supriya,Sricharan Pakalaఇతనో నవ్వుల డోనరుడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: