నిత్యా మీనన్, నరేష్ ల నటన , ప్రీ క్లైమాక్స్ నిత్యా మీనన్, నరేష్ ల నటన , ప్రీ క్లైమాక్స్ స్లో నేరేషన్, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

మాలిని (నిత్యా మీనన్) ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తుంటుంది. కెనెడా వెళ్లే ప్రయత్నంలో విసా కోసం ట్రై చేస్తుంది అక్కడ వరుణ్ (క్రిష్ జె) తో ప్రేమలో పడుతుంది. వరుణ్ వాళ్ల పై ఆఫీసర్ ప్రకాశ్ (నరేష్) మాలిని మీద కన్నేస్తాడు. ఆమెను మానభంగం చేస్తాడు. అయితే వరుణ్ మాలినిని చెరదీసి ఆమెను కోలుకునేలా చేస్తాడు. ఆమె కాస్త కుదుట పడ్డాక ప్రకాశ్ మరోసారి మాలిని మీద ఎటాక్ చేస్తాడు. ఈ క్రమంలో కాస్త రిలీఫ్ కోసం వైజాగ్ వెళ్దామని వరుణ్ చెప్పడంతో అక్కడకి వెళ్తారు. ఇక ఇంతలోనే ట్విస్ట్ మాలినిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తారు. ప్రకాశ్, వరుణ్ ఇద్దరు కలిసే తన జీవితాన్ని నాశనం చేశారని తెలుస్తుంది. జెల్లో ఉన్న మాలిని అక్కడ జరిగిన విషయాలతో స్పూర్తి పొంది బయట ఉన్న మానవ మృగాలను చంపాలని నిర్ణయించుకుంటుంది. అయితే మాలిని ఈ క్రమంలో జైల్లో ఉన్న వారు హెల్ప్ చేస్తారు. ఇంతకీ మాలిని వరుణ్ ను ఏం చేసింది..? ప్రకాశ్ ను మాలిని ఎలా చంపేసింది..? అన్నది అసలు 

నిత్యా మీనన్ తన భుజాల మీద వేసుకుని చేసిన సినిమా ఈ ఘటన. మాలిని పాత్రలో అద్భుతంగా నటించింది నిత్యా. నిత్యా మీనన్ ఇదవరకు చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఆమె మీద నడుస్తుండటంతో కీ రోల్ గా నిత్య అదరగొట్టింది. ఇక వరుణ్ గా నటించిన క్రిష్ కూడా పర్వాలేదు అనిపించాడు. ఇక ప్రకాశ్ లాంటి కామాంధుడి పాత్రలో సీనియర్ యాక్టర్ నరేష్ అదరగొట్టాడు. నరేష్ ను ఇలా విలన్ గా చూపించాలని ఆలోచన రావడం గొప్ప విషయం అయితే ఆ పాత్రకు నరేష్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం విశేషం. సాధారణంగా ఇన్నోసెంట్ గా ఉండే నరేష్ విలన్ రోల్ కాస్త వెరైటీగా అనిపించింది. ఇక కోవై సరళ కాసేపు నవ్వులు పంచగా.. కోటా శ్రీనివాస్ రావు ఓ మంచి పాత్రలో నటించి మెప్పించారు.    

దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీ ప్రియ 'ఘటన' మూవీతో ముందుకొచ్చారు. అయితే తీసుకున్న కథ కథనాలు పాతవే అంతేకాదు సినిమా మొత్తం స్లోగా నడుస్తుంది. చెప్పాలనుకున్న పాయింట్ చెప్పిన విధానం బాగుంది కాని ఫైనల్ గా మాత్రం ఆమె సక్సెస్ కాలేదు. మ్యూజిక్ కూడా అంతంత మత్రంగానే ఉంది. కెమెరామెన్ పనితనం ఓకే. ప్రొడక్షన్ కూడా సినిమా కథకు అవసరాన్ని బట్టి సింపుల్ గానే కానిచ్చేశారు. 
22 ఫీమేల్ కొట్టాయం సినిమాగా మళయాలంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో ఘటనగా తెచ్చారు. నర్స్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయి మీద కామాంధుల కన్ను పడితే ఎలా జరుగుతుందో రాసుకున్న కథతో వచ్చిన ఈ ఘటన ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో విఫలమయ్యింది. కథ దానిలోని పాత్రలు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండవు. ముఖ్యంగా ఎమోషన్ క్యారీ చేయడంలో అసలు సక్సెస్ కాలేదు.

నిత్యా మీనన్ పాత్ర వరకు దర్శకురాలు ఒకే అనిపించుకున్నా సినిమా మొత్తం రొటీన్ కథతో స్లో నేరేషన్ తో నీరసం తెప్పిస్తుంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఓ రొటీన్ కథతో ఈ ఘటన మూవీ వచ్చింది. కొన్ని పాయింట్స్ లో సినిమా బాగుంది అనిపించినా ఓవరాల్ గా సినిమా బోర్ కొట్టించడం ఖాయం.    

మొదటి భాగం కన్నా రెండో భాగం కాస్త స్పీడ్ గా అనిపించినా మళ్లీ రొటీన్ క్లైమాక్స్ తో ముగించడం నిరాశ కలిగిస్తుంది. సినిమాలో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మాలినిగా నిత్యా మీనన్ బాగుంది. ఒకే ఒక్క సింగిల్ పాయింట్ తో సినిమా నడిపించిన తీరు కాస్త ప్రేక్షకుల సహనాన్ని పరిక్షపెడుతుంది. 
Nithya Menon,SriPriya,V R Krishna.M,Aravind Shankarనిత్యా నటన కోసమే ఈ 'ఘటన'..!

మరింత సమాచారం తెలుసుకోండి: