26/11 India Pai Daadi: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొత్త సినిమా ‘26/11 ఇండియాపై దాడి’. 2011 సంవత్సరంలో ముంబయిలో ఉగ్రవాదులు దాడి జరిపిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులను ఇస్తున్న రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో తెలుసుకుందాం. చిత్రకథ : తీవ్రవాదంలో శిక్షణ పొందిన 10 మంది వ్యక్తులతో కూడిన ఒక బృందం చేపల వేటకు చెందిన బోటులోని వ్యక్తులను హతమార్చి ఆ బోటు ద్వారా ముంబయి నగరంలో ప్రవేశిస్తుంది. జనసమర్థంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని వీలైనంత ఎక్కుమంది ప్రజల ప్రాణాలను తీయాడమే ఈ బృందంలోని యువకుల లక్ష్యం. వందలాది మంది అమాయకులను బలి తీసుకున్న వీరు కేవలం కొన్ని నిమిషాల వ్యధిలోనే ముంబయి నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తారు. ఆ దాడి జరిగిన తీరు గురించి ఈ కేసును విచారించిన జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ [నానాపటేకర్] ఆధికారులకు వివరిస్తుంటాడు. ఆ బృందంలో వ్యక్తులు చేసిన దాడి తీరును, వారిలో పట్టుబడిన కసబ్ తో విచారణ జరిగిన విధానాన్ని అధికారులకు చెబుతుంటాడు. ఇదే కథాంశంతో చిత్రం సాగుతుంది.   నటీనటుల ప్రతిభ :   జాయింట్ కమీషనర్ ఆఫ్ ముంబయి పోలీస్ గా నానా పటేకర్ నటన అత్యద్భుతంగా ఉంది. అతని హావభావాలు, కంఠ స్వరం అద్భుతంగా కుదిరాయి. ఎమోషనల్ సీన్లలో అతని నటనకు హాట్సఫ్ చెప్పకుండా ఉండలేం. కసబ్ గా సంజీవ్ జైస్వాల్ నటన చాలా సహాజంగా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు అతను నటుడు అని భావించలేం, నిజంగానే అతను కసబ్ అని అనుకుంటాం. సంజీవ్ ముఖం, నటన అన్నీ నిజమైన కసబ్ ను మన కళ్ళ ముందు నిలబెడతాయి. ఈ చిత్రంలో నానా పటేకర్, కసబ్ పోటీపడి నటించారు. చిత్రంలో మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.   సాంకేతిక వర్గం పనితీరు : ఈ సినిమా చూస్తున్నప్పుడు కెమెరా, మ్యూజిక్ ను ఉపయోగించుకోవడంలో రామూను మించిన దర్శకుడు ఇండియాలోనే లేడు అనే అభిప్రాయం కలుగుతుంది. సన్నివేశాలు అత్యంత సహజంగా రావడంలో కెమెరామెన్, మ్యూజిక్ పనితనం ఎంతో ఉంది. కెమెరామెన్, సంగీత దర్శకుడి ప్రతిభ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్యాష్ బాక్ విధానంతో సాగుతాయి. వీటికి ఎడిటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో స్క్రీన్ ప్లే మయాజాలం చూపించాడు. చిత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకూ సినిమాను ఒకే టెంపోలో నడిపించి తనకు దర్శకుడిగా ఇంత పేరు ప్రఖ్యాతలు ఉచితంగా రాలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ముంబయిపై దాడులు మన కళ్ళముందే జరిగిన భ్రాంతిని సృష్టించాడు. హైలెట్స్ :   నేపధ్య సంగీతం, కెమెరా వర్క్, ఎడిటింగ్, నానా పటేకర్ నటన, దర్శకత్వం. డ్రాబ్యాక్స్ :   తెలిసిన కథ, హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండటం. విశ్లేషణ :  ముంబయిపై తీవ్రవాదుల దాడుల నేపధ్యంతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు అన్న వార్తే అనేక విమర్శలకు దారి తీసింది. ఈ సినిమాతో రామూ  మరో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని చాలా మంది భావించారు. ముంబయి దాడులను కూడా వ్యాపారం చేసుకుంటున్నాడని కొంత మంది భావించారు. అయితే రామూ తన పని తాను చేసుకుని పోయాడు. అంతే కాకుండా తన కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ [5.46 మిలియన్లు ] తో ఈ సినిమా నిర్మించాడు. వివాదస్పదకరమైన, విషాధకరమైన వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్, వినోదం వంటి అంశాల జోలికి వెళ్ళకుండా సినిమా మొత్తం ఒక విధమైన ఫీల్ తో రావడానికి రామ్ గోపాల్ వర్మ కృషి చేశాడు. అలాగే మతం, పోలీసులు, తీవ్రవాదులు, దేశం.. ఇలా ఎవరినైనా విమర్శించి తాను సొమ్ము చేసుకోవాలని కూడా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంతో అనుకోలేదు. వాస్తవ సంఘటనలు, ఆ సంఘటనలు జరిగేటప్పుడు అక్కడి నేపధ్యాన్ని సరిగ్గా చూపించాడు. తాను అనుకున్నది, తాను ఏది అయితే తీయాలనుకున్నాడో దాన్ని సరిగ్గా తెరకెక్కించాడు. తీవ్రవాదులు ముంబయిలో ప్రవేశించడంతో ప్రారంభి కసబ్ ఊరితో చిత్రాన్ని ముగించాడు. అయితే ఆ బృందంలో 10 మంది అంతాన్ని, దాడి జరిగిన అన్ని ప్రాంతాల్లో సంభవించిన పూర్తి వివరాలను ఈ సినిమాలో చూపించరు. 26/11 ఇండియాపై దాడి అని ఈ సినిమాకు పేరు పెట్టినా కసబ్ చుట్టూనే సినిమా సాగుతుంది.   చివరగా : ఎప్పుడు కామెడీ, ఫైట్లు, సాంగులేనా.. ఇలాంటి సినిమాలు కూడా చూడండి..!

More Articles on 26/11 India Pai Daadi || 26/11 India Pai Daadi Wallpapers || 26/11 India Pai Daadi Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: