చిరంజీవి , డైలాగ్స్ , రత్నవేలు కెమెరా వర్క్చిరంజీవి , డైలాగ్స్ , రత్నవేలు కెమెరా వర్క్మ్యూజిక్ , స్క్రీన్ ప్లే

నీరూరు గ్రామంలో కార్పోరేట్ సంస్థ రైతుల దగ్గర నుండి అన్యాయంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఆ గ్రామనికి చెందిన శంకర్ (చిరంజీవి) వారికి అండగా నిలబడతాడు. కార్పోరేట్ సంస్థ అధినేత అగర్వాల్ తన ఆపరేషన్స్ కు శంకర్ అడ్డుపడుతున్నాడని అతన్ని చంపేయాలని చూస్తాడు. ఇతన్లోనే కలకత్తా జైల్ నుండి తప్పించుకుని కత్తి శ్రీను (చిరంజీవి) తన స్నేహితుడు గిరి (ఆలి) దగ్గరకు వస్తాడు. శంకర్ లానే ఉన్న తనను చూసి అనాధ ఆశ్రమానికి చేరుకోగా అక్కడి వారి కష్టాలను ముందు అంతగా పట్టించుకోని శ్రీను, శంకర్ గతం తెలుసుకున్నాక ఆ గ్రామ ప్రజలకు న్యాయం జరగడం కోసం అగర్వాల్ తో ఢీ కొడతాడు శ్రీను. సమస్యను దేశం మొత్తం తెలిసేలా చేసిన శ్రీను చివరకు అగర్వాల్ ను మట్టు పెడతాడు. కేసు గెలిచే దాకా శంకర్ రూపంలో ఉండి శ్రీను అంతా చేస్తాడు. ఇక శంకర్ శ్రీనులు ఇద్దరు నీరురు ప్రజల భూములను కాపాడతారు.   

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఆయన మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఇక స్క్రీన్ మొత్తం చిరు కలరింగ్ అదిరిపోయింది. వన్ మ్యాన్ షో గా సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించాడు మెగాస్టార్. ఇక హీరోయిన్ గా నటించిన కాజల్ కూడా చిరుకి తగ్గ జోడిగా బాగుంది. కమెడియన్ ఆలి, బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు. పోసాని కామెడీ కూడా రెగ్యులర్ గానే అనిపించినా నవ్వులు తెప్పిస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు. 

ఖైది నంబర్ 150 మూవీ ముందుగా దర్శకుడు వినాయక్ గురించి చెప్పాలి. చిరు గ్రేస్ ను ఏమాత్రం తగ్గించకుండా సినిమా తీశాడు. రీమేక్ కథ అయినా సరే తెలుగు ఆడియెన్స్ కోరుకునే ఎంటర్టైనింగ్ అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నారు. డైరక్షన్ పరంగా వినాయక్ మంచి మార్కులే కొట్టేశాడు. అయితే సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్పింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తానికి చిరుని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు. ఇక దేవి మ్యూజిక్ పర్వాలేదు. అమ్మడు సాంగ్ ఒక్కటి బాగా క్లిక్ అయ్యింది. సాంగ్ లో చెర్రి గెస్ట్ అప్పియరెన్స్ అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. మొదటి సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ లో చరణ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. 

చిరంజీవి 150వ సినిమా అది కూడా పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. అయితే ఖైది నంబర్ 150 ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. సినిమా మొత్తం మెగాస్టార్ తన పవర్ ను చూపించేశాడు. యాక్టింగ్ డ్యాన్స్ కామెడీ టైమింగ్ ఇలా తనలోని పర్ఫెక్షన్ మరోసారి చూపించి అదరగొట్టాడు మెగాస్టార్. ముఖ్యంగా ఫైట్స్ లో మెగాస్టార్ తన సత్తా చూపించాడు.


కత్తి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కొన్ని కామెడీ సీన్స్ తప్పితే యాజిటీజ్ దించేశారని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం కాస్త చిరు ఎనర్జీతో నడిపించేసినా సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. గ్రిప్పింగ్ మిస్ అయిన భావన కలుగుతుంది. ఠాగూర్ లో బలమైన కథ ఉంది అందుకే ఆ రీమేక్ అంత పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇందులో కథ ఉన్నా డ్యుయల్ రోల్ అనేసరికి కాస్త నాటకీయత కనిపిస్తుంది. 


కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ఆడియెన్స్ తో విజిల్స్ వేసేలా ఉంటాయి. మొత్తానికి చిరంజీవి కం బ్యాక్ మూవీగా ఖైది నంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి కానుకగా ఇచ్చేయొచ్చు. ఇన్నేళ్ళ ఈ ఎనర్జీ మిస్ అయిన మెగా ఫ్యాన్స్ థియేటర్ లో విజిల్స్ తో హుషారెక్కించేస్తున్నారు. 


Chiranjeevi,Kajal Aggarwal,V.V. Vinayak,Surekha Konidela,Ram Charan,A. Subaskaran,Devi Sri Prasadమెగాస్టార్ ఖైది నంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు పసందైన విందు..!

మరింత సమాచారం తెలుసుకోండి: